ఓ వుృగాడు ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన శ్రీ కాళహస్తి వుండలంలో గురువారం ......
ఆలస్యం వెలుగులోకి వచ్చిన వైనం
పోలీసుల అదుపులో నిందితుడు
శ్రీకాళహస్తి: ఓ వుృగాడు ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన శ్రీ కాళహస్తి వుండలంలో గురువారం ఆల స్యంగా వెలుగు చూసింది. సీఐ చిన్నగౌష్ కథనం మేరకు... తొట్టంబేడు వుం డలం, విరూపాక్షపురం దళితవాడకు చెందిన తొండు రాజ్‌కుమార్(25) శ్రీకాళహస్తి వుండలం, రాచగున్నేరి సమీపం లో ఉన్న ఓ ప్రైవేటు కర్మాగారంలో దినకూలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు రాచగున్నేరి పంచాయుతీ పరిధిలోని ఛటర్జీనగర్ కోళ్లఫారం వద్ద నివాసం ఉంటూ కర్మాగారానికి వెళుతున్నాడు.
అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆరేళ్ల బాలిక వుంగళవారం సాయుంత్రం తన ఇంటి సమీపంలోని ఇసుకలో ఆడుకుంటుండగా రాజ్‌కువూర్ ఆమెకు వూయు వూటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. బాలిక పై అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక ఏ డుస్తూ వచ్చి తన తల్లికి ఆ విషయం చెప్పింది. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు రాజ్‌కువూర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సంఘటను గురువారం మీడియాకు తెలిపారు.