న్యూఢిల్లీ: ఇటీవలకాలంలో దోపిడీలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఎందుకు దొంగతనం చేశారని ప్రశ్నిస్తే వారు చెబుతున్న సమాధానాలను చూస్తే నిజంగా మతిపోతుంది. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి తాను ఎందుకు దొంగతనం చేశాడో తెలుసుకుంటే ఎవరైనా అవాక్క అవ్వక తప్పదు.
(చదవండి: ప్లీజ్.. నా కారుని ధ్వంసం చేయోద్దు!)
అసలు విషయంలోకెళ్లితే... ఢిల్లీలోని సరోజినీ నగర్ ప్రాంతంలో బహుళజాతి కంపెనీలో సీఈవోగా పనిచేస్తున్న ఆదిత్య కుమార్ అనే వ్యక్తి ఇంట్లో ముగ్గురు వ్యక్తులు చోరికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదిత్య కుమార్ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో డోర్ బెల్ మోగడంతో తలుపు తీశాడు. ఇంతలో ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి చోరబడి ఆదిత్యను తాళ్లతో కట్టేసి మొబైల, ల్యాప్‌టాప్, స్కూటర్, విలువైన వస్తువులను తీసుకుని ఉడాయించారు.
అయితే ఆదిత్య కుమార్ కాసేపటికి ఏదోరకంగా కట్లు విడిపించుకుని మరోక విడి ల్యాప్‌టాప్ ద్వారా ఫేస్ బుక్ సాయంతో తన బంధువులకు, స్నేహితులకు సమాచారం అందిచాడు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారించడమే కాక నిందుతులు శుభం(20), ఆసిఫ్(19), మహ్మద్ షరీఫుల్ ముల్లా (41)గా గుర్తించారు. అయితే నిందుతుల్లో ఒకరు తన ప్రియురాలు అలిగి తనతో మాట్లాడకపోవడంతో మనస్తాపానికి గురయ్యానని, అందువల్ల ఆమెకు ఖరీదైన గిఫ్ట్‌లు కొని ఇచ్చి ప్రసన్నం చేసుకునే నిమిత్త దొంగతనం చేసినట్లు చెప్పాడని పోలీసులు మీడియాకి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment