జిల్లా కేంద్రంలో ఓ దుండగుడు హల్‌చల్ చేశాడు. రెండు ఇళ్లల్లో చోరీకి పాల్పడి బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను అపహరించుకుపోయాడు
– రెండు ఇళ్లలో చోరీ..
– బంగారం ఎలక్ట్రానిక్ సామగ్రి అపహరణ
నల్లగొండ క్రైం
జిల్లా కేంద్రంలో ఓ దుండగుడు హల్‌చల్ చేశాడు. రెండు ఇళ్లల్లో చోరీకి పాల్పడి బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను అపహరించుకుపోయాడు. టూటౌన్ ఎస్‌ఐ దుర్గాప్రసాద్ తెలిపిన వివరాల ప్రకార.. పాత వీటీ కాలనీకి చెందిన ఊట్కూరి భూపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులు శనివారం రాత్రి భోజనం చేసి నిద్రపోయారు. అర్ధరాత్రి దాటిన తరువాత ఓ దుండగుడు ఇంట్లోకి ప్రవేశించాడు. బీరువాలో ఉన్న ఎనిమిది గ్రాముల బంగారం, సెలఫోన్, చార్జర్ అపహరించాడు. అదే విధంగా ఎన్జీ కాలనీలోని ఆకవరం సతీష్‌కుమార్ ఇంట్లోకి కూడా ప్రవేశించి హెచ్‌పీ కంప్యూటర్ మానిటర్, ఓ ఫోను ఎత్తుకెళ్లాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
సీసీ కెమెరాలో దుండగుడి కదలికలు
పాత వీటీ కాలనీలో చోరీకి పాల్పడిన వ్యక్తి కదలికలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. అయితే బాధితుల ఇళ్లలో సీసీ కెమెరాలు ఉన్నాయని తెలిపారు. నిందితుడిని 24 గంటల్లో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని ఎస్‌ఐ తెలిపారు.