సాక్షి, హైదరాబాద్: ‘రైతుబంధు’పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి వ్యవసాయ శాఖ బదిలీలు చేపట్టింది. పరిపాలనాపరమైన సౌలభ్యంకోసం ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. ఐదో జోన్‌కు చెందిన 12 మంది, ఆరో జోన్‌కు చెందిన ఐదుగురుసహా మరో ఐదుగురిని బదిలీ చేస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారధి ఉత్తర్వులు జారీచేశారు. ఏవో, ఏడీఏ స్థాయిలో బదిలీలు జరిగాయి. ఆదిలాబాద్ ఎఫ్‌టీసీలో ఏవోగా పనిచేస్తున్న భాస్కర్‌ను నేరేడుగొండ మండల ఏవోగా నియమించారు.
కె.అరుణ (తాలమడుగు, ఆదిలాబాద్ జిల్లా), వికార్‌అహ్మద్ (కుబీర్, నిర్మల్ జిల్లా), ప్రవీణ్‌కుమార్ (తానూరు, నిర్మల్), బి.వనీల (జగిత్యాల అర్బన్), జె.అనూష (మంథని, పెద్దపల్లి జిల్లా), డీఎన్‌కే శ్రీనివాసరావు (మధిర, ఖమ్మం జిల్లా), సీహెచ్ అనిల్‌కుమార్ (భద్రాచలం), రూప (కల్లూరు, ఖమ్మం జిల్లా), జి.నర్మద (సుజాతనగర్, భద్రాద్రి జిల్లా), బి.రాజేశ్వరి (చుంచుపల్లి, భద్రాద్రి జిల్లా), పి.రాకేశ్ (లక్ష్మీదేవిపల్లి, భద్రాద్రి జిల్లా), కె.నవీన్‌కుమార్ (దుమ్ముగూడెం, భద్రాద్రి జిల్లా), కె.నగేష్‌రెడ్డి (వర్ని), కె.రాజలింగం (మద్నూర్), ఆర్.శశిధర్‌రెడ్డి (బిక్నూరు), జె.రాధ (వాడెపల్లి), డి.సౌమ్య (రుద్రూరు) బదిలీ అయిన వారిలో ఉన్నారు.
అలాగే నలుగురు ఏడీఏలకూ బదిలీ ఇచ్చారు. వారిలో ఎం.చంద్రశేఖర్ (బాన్స్‌వాడ, కామారెడ్డి జిల్లా), ఎ.ఆంజనేయులు (బిచ్కుంద, కామారెడ్డి జిల్లా), బి.మంగీలాల్ (ఇచోడ, ఆదిలాబాద్ జిల్లా), జె.బాబు (బోథ్, ఆదిలాబాద్ జిల్లా) ఉన్నారు.
‘రైతుబంధు’ బదిలీలు 22 మంది అధికారులకు పోస్టింగులు
Published Tue, May 8 2018 1:18 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment