c pardhasaradhi
-
సమన్వయంతో పనిచేస్తా: పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు రాజ్యాంగం కల్పించిన స్వయం ప్రతిపత్తిని కాపాడుతూ, దాని విధులను నిష్పక్షపాతంగా నిర్వహిస్తానని రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి వ్యాఖ్యానించారు. కమిషన్ గౌరవాన్ని మరింత పెంచేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం, సీఎస్, డీజీపీ, జిల్లాల ఎన్నికల యంత్రాంగం సహకారం, సమన్వయంతో పనిచేస్తామని వెల్లడించారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలోని చాంబర్లో ఎన్నికల కమిషనర్‌గా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎన్నికలు అత్యంత కీలకం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో రాజ్యాంగం ప్రకారం గడువులోపు స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించే గురుతర రాజ్యాంగ బాధ్యతను నిర్వహించే అవకాశాన్ని కల్పించిన గవర్నర్, సీఎం, ప్రభుత్వానికి ధన్యవాదాలు..’అని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలే ప్రథమ ప్రాధాన్యత ఇక 2021 ఫిబ్రవరి 10వ తేదీతో పదవీ కాలం ముగియనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించటమే తన ప్రథమ ప్రాధాన్యత అని.. త్వరలోనే జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందిస్తామని పార్థసారథి తెలిపారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు అలాగే ఏప్రిల్‌లో పదవీ కాలం ముగియనున్న సిద్దిపేట మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. (మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ అరెస్ట్) -
విత్తన సదస్సుకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 26వ తేదీ నుంచి జులై మూడు వరకు హైదరాబాద్‌లో జరుగనున్న అంతర్జాతీయ విత్తన సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఘనంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. ఈ మేరకు సోమవారం దానిపై ఏర్పాటైన కార్యనిర్వాహక కమిటీ తొలి సమావేశం జరిగింది. సాధ్యమైనంత త్వరలో పనులన్నీ పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ప్రతినిధులు హైదరాబాద్‌కు వస్తున్నందున భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తెలంగాణ విత్తన పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ఇలాంటి సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. సదస్సులో భారతదేశం, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలు కూడా నిర్వహించాలన్నారు. ఎఫ్ఏవో సహకారంతో సదస్సుకు ముందు జూన్ 24, 25 తేదీలలో ఆఫ్రికా దేశాల విత్తన ప్రతినిధులతో విత్తనోత్పత్తిపై ప్రత్యేక సదస్సు ఉంటుందని, దీనికి తెలంగాణ విత్తన పరిశ్రమ నుంచి కూడా విత్తన ప్రతినిధులు పాల్గొంటున్నారని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. విత్తన ఎగుమతులు, దిగుమతులకు మంచి వేదిక కానున్నదన్నారు. జూన్ 27న విత్తన రైతుల ప్రత్యేక సమావేశానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, విత్తనోత్పత్తి, విత్తన నాణ్యతపై రైతులకు మంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని, తెలంగాణ నుంచి 1500మంది విత్తన రైతులు, గుజరాత్, కర్ణాటకలకు చెందిన విత్తన రైతులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా తెలిపారు. అంతర్జాతీయ విత్తన సదస్సు ముఖ్యాంశాలు.. విశేషాలు - వేదిక – హెచ్ఐసీసీ, నోవాటెల్, హైదరాబాద్ - ప్రపంచంలో విత్తన నాణ్యత ఎలా ఉందనే అంశంపై చర్చలు - తెలంగాణ నుంచి మరిన్ని విత్తన ఎగుమతులకు ప్రోత్సాహకం - జూన్ 26 నుంచి 28 వరకు విత్తన ప్రదర్శన - జూన్ 27న తెలంగాణ విత్తన రైతుల ప్రత్యేక సమావేశం - 70 దేశాల నుంచి 800 మంది విత్తన ప్రముఖులు - ఆఫ్రికా ఖండపు దేశాల ప్రతినిధులతో తెలంగాణ విత్తన పరిశ్రమ ప్రతినిధుల ప్రత్యేక సమావేశం - 94 ఏళ్ల ఇస్టా చరిత్రలో తొలిసారిగా ఆసియా ఖండంలో హైదరాబాద్‌లోనే నిర్వహణ - సదస్సుకు నోడల్ ఆఫీసర్‌గా కేశవులు నియామకం. ఎస్ఎల్బీసీపై వివరణ కోరిన సీఎస్ ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో అవాంతరాలు, ఆగిన పనులకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి నీటి పారుదల శాఖ నుంచి వివరణ అడిగారు. ప్రాజెక్టుల పరిధిలో ఇప్పటివరకు జరిగిన పనులు, పెండింగ్ పనులపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని కోరారు. టన్నెల్ పనులు ఏడాదిగా ఆగాయని, దీనికి తోడు కరెంట్ బిల్లులు కూడా కట్టలేని పరిస్థితుల్లో ప్రాజెక్టు అనేక అవాంతరాలు ఎదుర్కొంటున్న వైనంపై ‘సాక్షి’ప్రచురించిన కథనాలపై ఆయన స్పందించారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు ఇంకా అవసరమైన నిధులు, ఏజెన్సీ ఇదివరకు అడ్వాన్సులు కోరుతూ పెట్టిన అర్జీల అంశాలతో నీటి పారుదల శాఖ నోట్ సిద్ధం చేస్తోంది. పనుల పూర్తికి కనీసం రూ.80కోట్లు అడ్వాన్సుగా ఇవ్వాలని ఏజెన్సీ కోరుతోంది. దీనిపై త్వరలోనే జరిగే కేబినెట్ భేటీలో ఓ నిర్ణయం చేసే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. -
ఖరీఫ్ రైతుబంధుకు రూ.6,900 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ ఖరీఫ్‌లో రైతుబంధు పథకం అమలుకు సర్కారు నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు రూ. 6,900 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇస్తూ వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. కేటాయించిన నిధుల నుంచి విడతల వారీగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము విడుదల చేస్తారు. సొమ్ము మంగళవారం నుంచే రైతుల బ్యాంకు ఖాతా ల్లోకి పంపిస్తామని వ్యవసాయ వర్గాలు వెల్లడించాయి. ఎంత మేరకు మొదటి రోజు పంపిస్తారన్న దానిపై తమకు స్పష్టత లేదని, ఆర్థికశాఖ తన వద్ద ఉన్న నిధుల నుంచి విడుదలవుతాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఖరీఫ్ ప్రారంభం కావడంతో వీలైనంత త్వరగా రైతులందరికీ విడతల వారీగా సొమ్ము వారి బ్యాంకు ఖాతాల్లోకి చేరుతుం దని తెలిపాయి. వాస్తవంగా ఖరీఫ్‌కు పెట్టుబడి సాయాన్ని మే నెలలోనే ఇవ్వాలన్నది సర్కారు లక్ష్యం. కాగా ఇప్పటివరకు ఎన్నికల కోడ్ కొనసాగడంతో ఆలస్యమైనట్లు అధికారులు చెబుతున్నారు. 2019–20 బడ్జెట్లో ఖరీఫ్, రబీ సీజన్లలో రైతుబంధు అమలుకోసం సర్కారు రూ. 12 వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అందులో 6,900 కోట్లు ఖరీఫ్ కోసం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 1.38 కోట్ల ఎకరాల భూమికి పట్టాదారు పాసుపుస్తకాలున్నాయి. ఆ మేరకు దాదాపు 54.5 లక్షలమంది రైతులకు రైతుబంధు అందించా ల్సి ఉంది. అయితే అందులో ఇంకా కొందరు రైతులు తమ బ్యాంకు ఖాతా నంబర్లను వ్యవసాయ శాఖకు ఇవ్వలేదు. సాంకేతికంగా పట్టాదారు పాసు పుస్తకం రాకుండా అన్నీ సరిగా ఉన్న రైతులు తమను సంప్రదించాలని సర్కారు ఇప్పటికే విన్నవించింది. మూడు వారాల్లోగా అందరి ఖాతాల్లోకి సొమ్ము చేరుతుందని అధికారులు చెబుతున్నారు. కాగా, గత రబీ సీజన్లో కొందరు రైతులకు పెట్టుబడి సాయం చేతికి రాలేదు. వారికి ఈ ఖరీఫ్‌తో కలిపి ఇస్తారా లేదా అన్నదానిపై వ్యవసాయ శాఖ వర్గాలు స్పష్టత ఇవ్వడం లేదు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన గోపాల్ తనకు ఖరీఫ్ పెట్టుబడి సాయం అందిందని, కానీ రబీ సాయం రాలేదని తెలిపారు. అలాగే రంగారెడ్డి జిల్లా మంచాల మండలానికి చెందిన సరస్వతికి కూడా రబీ సొమ్ము అందలేదని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఖరీఫ్ సొమ్ముతో కలిపి ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఇలా లక్షలాది మంది రైతులు రబీ సాయం అందక వ్యవసాయ శాఖ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇటు రైతుబంధు.. అటు పీఎం–కిసాన్ గతేడాది ప్రభుత్వం ఒక సీజన్‌కు ఎకరాకు రూ.4 వేలు ఇవ్వగా, ఈ సీజన్ నుంచి రూ.5 వేలకు పెట్టుబడి సాయాన్ని పెంచిన సంగతి విదితమే. దీంతో రైతులకు మరింత ప్రయోజనం కలగనుంది. ఐదెకరాలున్న రైతు గతంలో రూ.20 వేలు అందుకుంటే, ఈసారి రూ.25 వేలు అందుకోనున్నారు. ఒకేసారి ఇంత పెరగడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కేంద్రం ఈ ఏడాది బడ్జెట్లో పీఎం–కిసాన్ నిధి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఐదెకరాల లోపున్న చిన్న, సన్నకారు రైతులకు రూ.6 వేలను మూడు విడతల్లో ఇస్తోంది. తెలంగాణలో దాదాపు 25 లక్షల మంది వరకు సొమ్ము అందుకున్నారు. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఐదెకరాల షరతును తొలగించి ఎన్నెకరాలున్న రైతులకైనా రూ.6 వేల చొప్పున ఇస్తామని ప్రకటించింది. దీంతో తెలంగాణలోని రైతులందరికీ కూడా ఆ మేరకు లాభం జరగనుంది. తెలంగాణలో రైతు బంధు ఇస్తున్న ఆసరా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం–కిసాన్ పథకం ఇవ్వడం లేదన్న చర్చ జరుగుతోంది. ఎన్నెకరాలున్నా రూ.6 వేలు మాత్రమే ఇవ్వడం, అదీ రూ.2 వేల చొప్పున మూడు విడతలు చేయడంతో దీనిపై రైతుల్లో పెద్దగా ఆసక్తి కనిపించలేదు. -
ఉద్యాన ఉత్పత్తుల్లో నాణ్యతే లక్ష్యం: పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉద్యాన నర్సరీల క్రమబద్ధీకరణ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార ముఖ్య కార్యదర్శి, ఉద్యాన ఉత్పత్తుల కమిషనర్ సి.పార్థసారథి అన్నారు. ఉద్యాన పంటల్లో కల్తీ విత్తనాలు, నాణ్యతలేని నారు, మొక్కల సరఫరాను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఉద్యాన నర్సరీల క్రమబద్ధీకరణ నిబంధనలు–2017ను రూపొందించిందన్నా రు. నాంపల్లిలోని తెలంగాణ ఉద్యాన శిక్షణ సంస్థ (టీహెచ్టీసీ)లో బుధవారం రాష్ట్రంలోని మిరప, కూరగాయల నర్సరీల యజమానులకు క్రమబద్ధీకరణ నిబంధనలపై అవగాహనకోసం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఉద్యాన నర్సరీల్లో కల్తీ విత్తనాలు, కల్తీ నారును నిరోధించేందుకు ఇప్పటికే కఠిన చర్యలు చేపట్టామన్నారు. కల్తీ నిరోధించ డం లక్ష్యంగా రాష్ట్ర స్థాయిలో పోలీసు, వ్యవసాయ అధికారులతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలి పారు. నర్సరీల్లో విస్తృత తనిఖీలు నిర్వహించి, కల్తీ ఉత్పత్తి, అమ్మకందారులపై దాడులు నిర్వహించాలని ఆదేశించామన్నారు. కల్తీ నారు, విత్తనాలతో ఎకరాకు రూ.80 వేల నుంచి లక్ష రూపాయల వరకు రైతులు నష్టపోవడంతో పాటు, విలువైన సమయా న్ని కూడా కోల్పోయే అవకాశం ఉందన్నారు. నర్సరీల్లో అవకతవకలు, పొరపాట్లు జరగకుండా యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నర్సరీల్లో మెరుగైన మౌళిక సౌకర్యాలతో ఆరోగ్యవంతమైన మొక్కలను ఉత్పత్తి చేయాలని రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్ ఎల్.వెంకట్రాంరెడ్డి అవగాహన సదస్సులో సూచించారు. ఉద్యానవన శాఖలో నర్సరీ యజమానులు తమ వివరాలు నమోదు చేసుకోవడంతో పాటు, రికార్డుల నిర్వహణ సక్రమం గా ఉండేలా చూసుకోవాలన్నారు. మొక్కల ఉత్పత్తి, అమ్మకంలో అవతవకలకు పాల్పడితే విత్తన, నర్సరీ చట్ట నిబంధనల మేరకు కేసులు నమోదు చేసి, చర్య లు తీసుకుంటామని తెలిపారు. నర్సరీల్లో రికార్డుల నిర్వహణ, విత్తన చట్టం, పీడీ యాక్టు నియమ నిబంధనలు తదితరాలపై ఉద్యాన శాస్త్రవేత్తలు అవగాహ న కల్పించారు. ఈ కార్యక్రమంలో విత్తన ధృవీకరణ సంస్థ ఎండీ కె.కేశవులు, వ్యవసాయశాఖ డిప్యూటీ డైరక్టర్ శివప్రసాద్, రాచకొండ కమిషనరేట్ సీఐ విజయ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రెండు సీజన్లకు కలిపి పంటల బీమా
సాక్షి, హైదరాబాద్: రానున్న ఖరీఫ్, రబీ సీజన్(2019–20)కు కలిపి రాష్ట్ర వ్యవసాయ శాఖ పంటల బీమా నోటిఫికేషన్‌ను ఇటీవల జారీ చేసింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం(పీఎంఎఫ్‌బీవై), పునరుద్ధరించిన వాతావరణ పంటల బీమా పథకం(ఆర్‌డబ్ల్యూసీఐఎస్) అమలుకు క్లస్టర్లవారీగా 2 బీమా ఏజెన్సీలను ఖరారు చేసింది. ఇందులో ఇఫ్కో టోక్యో జీఐసీ, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఏఐసీ) కంపెనీలున్నాయి. 11 జిల్లాల్లో ఇఫ్కో టోక్యో జీఐసీ బీమా(రెండు క్లస్టర్లు) కంపెనీ, 21 జిల్లాల్లో ఏఐసీ(ఆరు క్లస్టర్లలో) పంటల బీమాను అమలు చేయనున్నాయి. సమగ్ర బీమా పథకం(యూపీఐఎస్)ను ప్రయోగాత్మకంగా నిజామాబాద్‌లో అమలు చేయనున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ప్రధానంగా వాతావరణ ఆధారిత బీమా కింద పైల ట్ ప్రాజెక్టులో భాగంగా టమాటా పంటకు బీ మా సౌకర్యం కల్పించారు. రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో దీనిని అమలు చేస్తున్నారు. మామిడి పంటకు కూడా ఆర్‌డబ్ల్యూసీఐఎస్ కింద బీమా ఇవ్వనున్నారు. పంటకోతలో భాగంగా వర్షాలు, వడగండ్లతో నష్టం వస్తే కూడా బీమా వర్తిస్తుందని స్పష్టం చేశారు. పంటల బీమా అమలు చేసే కంపెనీలు కచ్చితంగా ప్రతి సీజన్లో 10% నాన్ లోన్ రైతులను బీమా కవరేజీలోకి తీసుకురావాలన్నారు. కామన్ సర్వీస్ సెంటర్, మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. పంట పేరు మార్చుకునేందుకు గడువు తేదీ కంటే 2 రోజుల ముందు వరకు రైతులకు అవకాశం కల్పించారు. హఠాత్తు వర్షాలకు, మెరుపుతో వచ్చే పిడుగుల కారణంగా నష్టం వాటిల్లినా బీమా పరిహారం ఇవ్వనున్నారు. ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్ కింద వానాకాలంలో మిర్చి, పత్తి, పామాయిల్, బత్తాయి, టమాటా పంటలను గుర్తించగా, యాసంగిలో మామిడి పంటలను గుర్తించింది. వానాకాలం ఆర్‌డబ్ల్యూసీఐఎస్‌ను ఖమ్మం, భద్రాద్రి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట, జోగుళాంబ, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల్లో, పత్తి 32 జిల్లాల్లో, పామాయిల్ పంటకు ఖమ్మం, భద్రాద్రి, బత్తాయి పంటకు నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల, యాదాద్రి, టమాటా పంటకు రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో అమలు చేయనున్నారు. యాసంగిలో ఆర్‌డబ్ల్యూసీఐఎస్ కింద మామిడి పంటకు 32 జిల్లాలు, టమాటా కింద ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలను వ్యవసాయ శాఖ గుర్తించింది. ఖరీఫ్ వరి ఆగస్టు 31, పత్తికి జూలై 15 ఖరీఫ్, రబీ సీజన్లో పీఎంఎఫ్‌బీవై, ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్ వివిధ పంటలకు బీమా ప్రీమియం చెల్లించే గడువు తేదీలను నిర్ణయించారు. త్వర లో ప్రారంభం కానున్న ఖరీఫ్‌లో వరి పంటకు ఆగస్టు 31లోగా బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. జొన్న, మొక్కజొన్న, కందులు, పెసర్లు, మినుములు, వేరుశనగ, సోయాబీన్, పసుపు పంటలకు జూలై 31లోగా ప్రీమియం చెల్లించాలి. ఆర్‌డబ్ల్యూబీసీ ఐఎస్ పథకం కింద మిర్చి పంటకు ఆగస్టు 31లోగా, పత్తి పంటకు జూలై 15లోగా, పామాయిల్ పంటకు జూలై 14లోగా, బత్తాయి పంటకు ఆగస్ట్ 9, టమాటా పంటకు ఆగస్టు 31వ తేదీలోగా పంటల బీమా ప్రీమియం చెల్లించాలి. యాసంగిలో ఇలా.. 2019 యాసంగికి పీఎంఎఫ్‌బీవై కింద శనగ పంటకు నవంబర్ 30లోగా, మొక్కజొన్న పంటకు డిసెంబర్ 15లోగా, వరి, జొన్న, పెసర, మినుములు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఉల్లి, మిర్చి, నువ్వుల పంటలకు డిసెంబర్ 31లోగా రైతులు నమోదు చేయించుకోవాలి. ఆర్‌డబ్ల్యూసీఐఎస్ పథకం కింద టమాటా పంటకు నవంబర్ 30లోగా, మామిడి పంటకు డిసెంబర్ 31లోగా రైతులు ప్రీమియం చెల్లించాలని వ్యవసాయశాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. -
తొలి విడత 10 లక్షల మంది రైతులకే
సాక్షి, హైదరాబాద్: ‘పీఎం–కిసాన్’ పథకం కింద తొలి విడతలో రాష్ట్రంలోని 10 లక్షల మంది రైతు కుటుంబాలకే పెట్టుబడి సాయం అందనున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 20 నాటికి ఈ వివరాలను పీఎం–కిసాన్ వెబ్సైట్లో నోడల్ శాఖగా ఉన్న రాష్ట్ర వ్యవసాయశాఖ అప్లోడ్ చేయనుంది. తొలి దఫా పెట్టుబడి సాయాన్ని ఈ నెల 24న రైతుల బ్యాంకుల ఖాతాలో వేస్తామని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ రైతులందరికీ తొలి విడత సాయం కింద రూ. 2 వేల వంతున వారి బ్యాంకు ఖాతాల్లోకి చేరనుంది. వ్యవసాయశాఖ కసరత్తు..: పీఎం–కిసాన్ పథకానికి అర్హులను గుర్తించేందుకు వ్యవసాయశాఖ ప్రభుత్వ శాఖల సహకారం తీసుకుంది. ఫిబ్రవరి 1 వరకు అందుబాటులో ఉన్న భూరికార్డుల వివరాలను రాష్ట్ర వ్యవసాయశాఖ తెప్పించుకుంది. అందు లో 52.91 లక్షల మంది రైతులున్నారు. కుటుంబం యూనిట్‌గా లెక్కతీసేందుకు వీటన్నింటిని పౌరసరఫరాల శాఖ వద్ద ఉన్న రేషన్ కార్డుల సమాచారంతో పోల్చిచూశారు. దీనిలో వ్యక్తిగత పట్టాదా రులై, రేషన్ కార్డులు గల వారి సంఖ్య 43.81 లక్షలుగా గుర్తించారు. మిగతా 9.10 లక్షల మంది రైతులకు రేషన్ కార్డులు లేకపోవడంతో వారిని పింక్ కార్డుదారులుగా గుర్తించి, అనర్హులుగా తేల్చారు. దీంతో తెల్ల రేషన్ కార్డులు గల రైతుల సంఖ్య 32.12లక్షలుగా తేలింది. ఇందులోన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 7 వేల మంది, 10 వేలు, ఆపైన పింఛన్ తీసుకుంటున్న వారి సంఖ్య 2 వేలుగా గుర్తించారు. ఈ పథకానికి అర్హులైన రైతుల కుటుంబాలను 26.31 లక్షలుగా గుర్తించారు. ఇందులో ఒకే పట్టాదారు పుస్తకం గల కుటుంబాల సంఖ్య 23.08 లక్షలు కాగా, ఒకటి కంటే ఎక్కువున్న కుటుంబాల సంఖ్య 3.23 లక్షలుగా తేలింది. జాబితాపై గ్రామసభలు: అర్హులై ఒకే పట్టాదారు ఉన్న రైతుల వివరాలను గ్రామసభల్లో ప్రదర్శించి అధికారులు మరోసారి సరిచూస్తున్నారు. ఇందులోనే ఈ నెల 20 కల్లా 10లక్షల మంది రైతుల వివరాలను కేంద్ర వ్యవసాయ శాఖకు అప్లోడ్ చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ నిర్ణయించింది. అర్హులై ఒకే కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ పట్టాదారులు ఉన్నట్లయితే వారి జాబితాను తర్వాత ప్రచురించి, వివరాలు సరిచూస్తామన్నారు. 9–10 లక్షల మంది పింక్ రేషన్ కార్డుదారుల వివరాలపై గ్రామసభల ద్వారా అర్హులను గుర్తిస్తామని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి ‘సాక్షి’కి తెలిపారు. -
తహసీల్దార్ ధ్రువీకరణతో బ్యాంకుల్లో చెక్కు క్లియర్
సాక్షి, హైదరాబాద్: పట్టాదారు పాసు పుస్తకం పొందని రైతుల చెక్కులను తహసీల్దార్ ధ్రువీకరణ పత్రం తీసుకొస్తే క్లియర్ చేయాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి బ్యాంకర్లను ఆదేశించారు. సోమవారం ఆయన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించి రైతుబంధు పథకాన్ని సమీక్షించారు. దీనికి ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, జాయింట్ సెక్రటరీ సాయిప్రసాద్, ఎస్ఎల్బీసీ కన్వీనర్ మణికందన్, ఆంధ్రాబ్యాంకు, కెనరా, కార్పొరేషన్, సిండికేట్, ఐవోబీ, ఏపీ జీవీబీ, టీజీబీ బ్యాంకు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్ని బ్యాంకుల్లోనూ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని బ్యాంకర్లు వివరించారు. శని, ఆదివారాల్లో జరిగిన చెక్కుల పంపిణీతో సోమవారం బ్యాంకుల వద్ద రైతులు సులువుగా నగదు మార్చుకున్నట్లు వారు వివరించారు. పార్థసారథి మాట్లాడుతూ తాజాగా అందజేసిన అదనపు రైతు డేటా కు అనుగుణంగా బ్యాంకర్లు 17 నాటికి చెక్కులు ముద్రించి అందజేయాలని సూచించారు. -
30 లక్షల చెక్కులు అందజేత
సాక్షి, హైదరాబాద్: అప్పుడే సగం మంది రైతులకు చెక్కులు చేతికందాయి. ఈ నెల 10 నుంచి ఆదివారం వరకు అంటే నాలుగు రోజుల్లో 5,596 గ్రామసభలు నిర్వహించి.. సుమారు 30 లక్షల చెక్కులు అందజేసినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. వారికి సుమారు రూ.2,800 కోట్ల విలువైన చెక్కులు అందాయని అధికారులు అంచనా వేశారు. రాష్ట్రంలో 10,628 గ్రామాలకు చెందిన 1.43 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమికి చెందిన 58.33 లక్షల మంది రైతులకు రూ.5,730 కోట్ల విలువైన 58.98 లక్షల చెక్కులను ఇవ్వాలని సర్కారు నిర్థారించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రూ.250 కోట్ల మేరకు రైతులు నగదు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు గ్రామసభల్లో ఎవరైనా చెక్కులు తీసుకోనట్లయితే మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో నెల రోజుల వరకు తీసుకోవచ్చని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. మండల స్థాయిలోనూ చెక్కులు తీసుకోనివారుంటే, అటువంటి వారు తమ చెక్కులను మూడు నెలల వరకు హైదరాబాద్‌లోని వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో పొందవచ్చన్నారు. కాగా, రాష్ట్రంలో రైతులకు పాస్ పుస్తకాల పంపిణీ ఊపందుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల్లోనే 13 లక్షల పుస్తకాలు పంపిణీ చేసినట్టు రెవెన్యూ వర్గాలు తెలిపాయి. -
‘రైతుబంధు’ బదిలీలు 22 మంది అధికారులకు పోస్టింగులు
సాక్షి, హైదరాబాద్: ‘రైతుబంధు’పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి వ్యవసాయ శాఖ బదిలీలు చేపట్టింది. పరిపాలనాపరమైన సౌలభ్యంకోసం ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. ఐదో జోన్‌కు చెందిన 12 మంది, ఆరో జోన్‌కు చెందిన ఐదుగురుసహా మరో ఐదుగురిని బదిలీ చేస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారధి ఉత్తర్వులు జారీచేశారు. ఏవో, ఏడీఏ స్థాయిలో బదిలీలు జరిగాయి. ఆదిలాబాద్ ఎఫ్‌టీసీలో ఏవోగా పనిచేస్తున్న భాస్కర్‌ను నేరేడుగొండ మండల ఏవోగా నియమించారు. కె.అరుణ (తాలమడుగు, ఆదిలాబాద్ జిల్లా), వికార్‌అహ్మద్ (కుబీర్, నిర్మల్ జిల్లా), ప్రవీణ్‌కుమార్ (తానూరు, నిర్మల్), బి.వనీల (జగిత్యాల అర్బన్), జె.అనూష (మంథని, పెద్దపల్లి జిల్లా), డీఎన్‌కే శ్రీనివాసరావు (మధిర, ఖమ్మం జిల్లా), సీహెచ్ అనిల్‌కుమార్ (భద్రాచలం), రూప (కల్లూరు, ఖమ్మం జిల్లా), జి.నర్మద (సుజాతనగర్, భద్రాద్రి జిల్లా), బి.రాజేశ్వరి (చుంచుపల్లి, భద్రాద్రి జిల్లా), పి.రాకేశ్ (లక్ష్మీదేవిపల్లి, భద్రాద్రి జిల్లా), కె.నవీన్‌కుమార్ (దుమ్ముగూడెం, భద్రాద్రి జిల్లా), కె.నగేష్‌రెడ్డి (వర్ని), కె.రాజలింగం (మద్నూర్), ఆర్.శశిధర్‌రెడ్డి (బిక్నూరు), జె.రాధ (వాడెపల్లి), డి.సౌమ్య (రుద్రూరు) బదిలీ అయిన వారిలో ఉన్నారు. అలాగే నలుగురు ఏడీఏలకూ బదిలీ ఇచ్చారు. వారిలో ఎం.చంద్రశేఖర్ (బాన్స్వాడ, కామారెడ్డి జిల్లా), ఎ.ఆంజనేయులు (బిచ్కుంద, కామారెడ్డి జిల్లా), బి.మంగీలాల్ (ఇచోడ, ఆదిలాబాద్ జిల్లా), జె.బాబు (బోథ్, ఆదిలాబాద్ జిల్లా) ఉన్నారు. -
ఎగుమతులు పెరిగితేనే ఆదాయం రెట్టింపు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగి తేనే రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముఖ్య కార్య దర్శి నర్సింగ్‌రావు పేర్కొన్నారు. నాబార్డు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌ల ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు’ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడు తూ రైతులు పంటలను ఎక్కడైనా అమ్ముకు నేలా మార్కెట్లు అందుబాటులో ఉండాల న్నారు. సామాన్యులకు అవసరమైన ఆహారో త్పత్తులను ప్రభుత్వం కొనివ్వాలని, పం టల ధరలతో వాటిని ముడిపెట్టరాదన్నారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి మాట్లాడుతూ భారీగా పంట రుణాలిస్తున్నట్లు తాము చెబుతుంటే రైతులు మా త్రం ఇంకా ప్రైవేటు వడ్డీ వ్యాపా రుల నుంచే తీసుకుంటున్నట్లు చెబుతున్నారన్నారు. రైతులకు పెట్టుబడి నిధుల సమస్య తీర్చేందుకు ఎకరానికి రూ. 4 వేల పథకాన్ని తెస్తున్నట్లు చెప్పారు. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ వై.ఆర్.రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల కనీస వేతనం రూ. 18 వేలు ఉండాలని 7వ వేతన సంఘం చెప్పిందని, దీనినైనా కనీసం రైతులకు వర్తింపజేసి వారి ఆదాయాన్ని పెం చాలన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కందా, మేనేజ్ సంస్థ డైరెక్టర్ జనరల్ వి.ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. -
రైతుల ఖాతాలో బీమా సొమ్ము వేయండి
సాక్షి, హైదరాబాద్: రైతుల ఖాతాలోకి బీమా సొమ్ము మొత్తాన్ని వెంటనే జమ చేయాలని వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం ఆయన బ్యాంకర్లు, బీమా కంపెనీలతో సమీక్ష నిర్వహించారు. రైతులకు త్వరితగతిన బీమా సొమ్ము అందేట్లు చూడాలని, దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్లను కోరినట్లు పార్థసారథి తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు, బ్యాంకుల విలీనం వల్ల తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని బ్యాంకర్లు మరింత గడువును కోరారు. కొత్త జిల్లాల సమాచారం వీలైనంత త్వరగా నవీకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పలు బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ సంస్థలే విత్తనోత్పత్తి చేయాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆధ్వర్యంలోని విత్తన సంస్థల ద్వారానే విత్తనోత్పత్తి చేపట్టాలని జాతీయ సదస్సు సిఫార్సు చేసింది. ఈ నెల 6, 7వ తేదీల్లో హైదరాబాద్‌లో జరిగిన విత్తనోత్పత్తి, నాణ్యత నియంత్రణ, మార్కెటింగ్ అంశాలపై జరిగిన జాతీయ సదస్సులో అనేక సిఫార్సులు చేసినట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో విత్తన కార్పొరేషన్లు టెండర్లు లేదా ఇతర మార్గాల ద్వారా విత్తనాలు సేకరించుకుంటు న్నాయన్నారు. అయితే అనేక సందర్భాల్లో అవి నాసిరకంగా ఉంటున్నట్లు చెప్పారు. అందువల్ల ప్రభుత్వ విత్తన సంస్థే విత్తనోత్పత్తి చేయాలని సిఫార్సు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రాల విత్తన సంస్థలతో ఒప్పందం చేసుకొని నాణ్యమైన విత్తనాన్ని కొనుగోలు చేయాలన్నారు. -
బీజీ–3 పత్తి విత్తనంపై ఏంచేయాలి?
సాక్షి, హైదరాబాద్: అనుమతి లేని బీజీ–3 పత్తి విత్తనాన్ని ఈ ఖరీఫ్‌లో రైతులు విరివిగా వేశారని, అనేకచోట్ల మంచి ఫలితాలు రాగా అక్కడక్కడ మిశ్రమ ఫలితాలు వచ్చాయని రాష్ట్ర వ్యవసాయశాఖ కేంద్రానికి తెలిపింది. అనుమతి లేకున్నా అనేక కంపెనీలు, డీలర్లు బీజీ–3ని రైతులకు విక్రయించారని పేర్కొంది. ఈ నేపథ్యంలో బీజీ–3 విత్తనానికి సంబంధించి వివిధ అంశాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో స్పష్టత ఇవ్వాలని ఆ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి బుధవారం కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్రంలో ఈసారి పత్తి విస్తీర్ణంలో దాదాపు 20 శాతం బీజీ–3 పత్తి విత్తనాన్ని రైతులు సాగు చేసినట్లు తెలిసింది. వారంలో పత్తి రైతులకు గుర్తింపు కార్డులు వారం రోజుల్లో పత్తి రైతులకు గుర్తింపు కార్డులు జారీచేస్తామని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. జిల్లా వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ అధికారులతో బుధవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ పత్తి రైతుల వివరాల నమోదు పూర్తయిందని, గుర్తింపు కార్డులను ప్రింట్ చేసి వారంలో గ్రామాల్లో రైతులకు అందజేస్తామని తెలిపారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో రైతులను గుర్తించేందుకు అవసరమైన సాఫ్ట్వేర్ లోడింగ్ జరుగుతోందన్నారు. వచ్చే 23వ తేదీ నాటికి ఇది పూర్తవుతుందన్నారు. ఈ నేపథ్యంలో రైతులు ఒకవేళ గుర్తింపు కార్డు లేకున్నా డేటాలో పొందుపరిచిన ఆధార్‌కార్డు నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు తెలిపి ఆ కేంద్రాల్లో పత్తి అమ్ముకోవచ్చన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రైతులు తొందరపడి పత్తి అమ్ముకోకూడదని, మార్కెట్ బలపడ్డాక కనీస మద్దతు ధరకు విక్రయించుకోవాలని ఆయన కోరారు. ఈ ఏడాది 5.60 లక్షల క్వింటాళ్ల విత్తన ఉత్పత్తి 2017–18 ఖరీఫ్‌లో 2.40 లక్షల క్వింటాళ్లు, రబీలో 3.20 లక్షల క్వింటాళ్ల విత్తనోత్పత్తి జరుగుతుందని పార్థసారథి తెలిపారు. ఈ అంశంపై బుధవారం రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, విత్తన సేంద్రీయ ధ్రువీకరణ సంస్థ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జాతీయ విత్తన సంస్థ (ఎన్ఎస్సీ) నుంచి తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థకు 20 వేల క్వింటాళ్ల సోయాబీన్, 40 వేల క్వింటాళ్ల దయించా (పచ్చిరొట్ట) విత్తనాలను సరఫరా చేసేలా ఒప్పందం జరిగిందన్నారు. అలాగే రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ నుంచి ఎన్ఎస్సీకి తెలంగాణ సోనా వరి, డీహెచ్ఎం 121 మొక్కజొన్న రకం విత్తనాలను సరఫరా చేసేలా ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. అలాగే హైబ్రీడ్ మొక్కజొన్న విత్తన ఉత్పత్తిని హాకా, విత్తనాభివృద్ధి సంస్థలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పార్థసారథి వెల్లడించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ కమిషనర్ డాక్టర్ జగన్మోహన్, విత్తన సేంద్రీయ ధ్రువీకరణ సంచాలకుడు డాక్టర్ కేశవులు తదితరులు పాల్గొన్నారు. -
100 కోట్లతో ఉద్యాన ప్రయోగశాలలు
సాక్షి, హైదరాబాద్: ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో రూ.100 కోట్లతో పరిపాలన భవనం, ప్రయోగశాలలు, పీజీ కళాశాల నిర్మించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి వెల్లడించారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. రాజేంద్రనగర్‌లోని ఉద్యాన కళాశాలలో సోమవారం నూతన కళాశాల, హాస్టల్ భవనాల ప్రారంభానికి హాజరై మాట్లాడారు. ఉద్యాన వర్సిటీ సాధించిన పరిశోధన విజయాలపై సావనీర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.