![States told to increase seed production](/styles/webp/s3/article_images/2017/10/21/c-pardhasaradhi.jpg.webp?itok=_dTYbyIb)
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆధ్వర్యంలోని విత్తన సంస్థల ద్వారానే విత్తనోత్పత్తి చేపట్టాలని జాతీయ సదస్సు సిఫార్సు చేసింది. ఈ నెల 6, 7వ తేదీల్లో హైదరాబాద్‌లో జరిగిన విత్తనోత్పత్తి, నాణ్యత నియంత్రణ, మార్కెటింగ్ అంశాలపై జరిగిన జాతీయ సదస్సులో అనేక సిఫార్సులు చేసినట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు.
వివిధ రాష్ట్రాల్లో విత్తన కార్పొరేషన్లు టెండర్లు లేదా ఇతర మార్గాల ద్వారా విత్తనాలు సేకరించుకుంటు న్నాయన్నారు. అయితే అనేక సందర్భాల్లో అవి నాసిరకంగా ఉంటున్నట్లు చెప్పారు. అందువల్ల ప్రభుత్వ విత్తన సంస్థే విత్తనోత్పత్తి చేయాలని సిఫార్సు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రాల విత్తన సంస్థలతో ఒప్పందం చేసుకొని నాణ్యమైన విత్తనాన్ని కొనుగోలు చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment