కావేరీ సీడ్‌ షేర్ల బైబ్యాక్‌ | Kaveri Seeds board approves Rs 325-crore buyback plan | Sakshi
Sakshi News home page

కావేరీ సీడ్‌ షేర్ల బైబ్యాక్‌

Published Sat, Jan 6 2024 6:40 AM | Last Updated on Sat, Jan 6 2024 6:40 AM

Kaveri Seeds board approves Rs 325-crore buyback plan - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విత్తన తయారీ సంస్థ కావేరీ సీడ్‌ కంపెనీ షేర్ల బైబ్యాక్‌ ప్రకటించింది. టెండర్‌ ఆఫర్‌ రూట్‌లో రూ.325 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్‌ చేసేందుకు బోర్డు నిర్ణయం తీసుకుంది. 9% ప్రీమియంతో ఒక్కో షేరు ధరను రూ.725గా నిర్ణయించారు.

గరిష్టంగా 44.82 లక్షల షేర్లను కంపెనీ కొనుగోలు చేయనుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లు, ప్రమోటర్‌ గ్రూప్‌నకు 59.9% వాటా ఉంది. బైబ్యాక్‌ వార్తల నేపథ్యంలో కావేరీ సీడ్స్‌ షేరు ధర బీఎస్‌ఈలో శుక్రవారం 1.18% ఎగసి రూ.662.60 వద్ద స్థిరపడింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement