Seed production
-
కావేరీ సీడ్ షేర్ల బైబ్యాక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విత్తన తయారీ సంస్థ కావేరీ సీడ్ కంపెనీ షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. టెండర్ ఆఫర్ రూట్లో రూ.325 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేసేందుకు బోర్డు నిర్ణయం తీసుకుంది. 9% ప్రీమియంతో ఒక్కో షేరు ధరను రూ.725గా నిర్ణయించారు. గరిష్టంగా 44.82 లక్షల షేర్లను కంపెనీ కొనుగోలు చేయనుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్‌నకు 59.9% వాటా ఉంది. బైబ్యాక్ వార్తల నేపథ్యంలో కావేరీ సీడ్స్ షేరు ధర బీఎస్ఈలో శుక్రవారం 1.18% ఎగసి రూ.662.60 వద్ద స్థిరపడింది. -
విత్తన భాండాగారానికి ‘బహుళజాతి’ దెబ్బ
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు జిల్లా ఒకనాడు విత్తనోత్పత్తికి ప్రధాన కేంద్రం. లక్ష ఎకరాల్లో ఉత్పత్తి జరిగేది. దేశ, విదేశాలకు ఎగుమతి చేసేవారు. 20 ఏళ్ల క్రితమే 250 వరకు విత్తన పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లు ఉండేవి. దాదాపు 30వేల మంది రైతులు విత్తనోత్పత్తి చేపట్టి లాభాలు పొందేవారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 60వేల మందికి ఉపాధి లభించేది. బహుళజాతి సంస్థలు ప్రవేశపెట్టిన బీటీ పత్తితో నేడు జిల్లాలోని విత్తన పరిశ్రమ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. బడా కంపెనీలకు అనుకూలంగా చంద్రబాబు సర్కారు కో–మార్కెటింగ్‌ను రద్దు చేయడంతో విత్తనోత్పత్తికి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విత్తనోత్పత్తి, విత్తన పరిశ్రమకు సంబంధించి జిల్లాకు పూర్వవైభవం తీసుకురావాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టింది. దేశంలోనే సీడ్ హబ్‌గా నాడు గుర్తింపు 2001కి ముందే కర్నూలు జిల్లాకు సీడ్ హబ్‌గా దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. హైబ్రిడ్ పత్తిరకాలతో పాటు కూరగాయల విత్తనాలు, జొన్న, మొక్కజొన్న, కొర్ర, మినుము, శనగ, పెసర, వేరుశనగ తదితర విత్తనాల ఉత్పత్తి జరిగేది. నంద్యాల ప్రాంతం వరి విత్తనోత్పత్తికి పెట్టింది పేరు. జాతీయస్థాయి విత్తన సంస్థలు కూడ ఇక్కడ ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేసుకొని విత్తనాలను ఉత్పత్తి చేసి దేశ, విదేశాలకు ఎగుమతి చేసేవి. ఏటా రూ.850 కోట్ల విలువైన హైబ్రిడ్ పత్తి, రూ.150 కోట్ల విలువగల కూరగాయలు, ఇతర పంటల విత్తనాల ఉత్పత్తి చేసేవారు. ఏటా రూ.100 కోట్ల విలువ చేసే విత్తనాలు విదేశాలకు ఎగుమతి అయ్యేవి. బీటీ దెబ్బ– కంపెనీలు మూత ముఖ్యంగా పత్తిలో బీటీ రకాలు వచ్చిన తర్వాత హైబ్రిడ్ పత్తి విత్తనోత్పత్తి మనుగడ కోల్పోయింది. ప్రఖ్యాతి గాంచిన దేశీయ కంపెనీలు జిల్లాలో విత్తన పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని విత్తనోత్పత్తితో రైతులకు, వేలాది మంది కూలీలకు పనులు కలి్పంచేవి. బీటీ పత్తి రాకతో పెద్ద కంపెనీలు వెళ్లిపోగా.. అనేక చిన్న కంపెనీలు మనుగడను కోల్పోయాయి. నిర్వీర్యమైన ఏపీ విత్తన ధ్రువీకరణ అథారిటీ ... దశాబ్దాల క్రితం ఇక్కడ ఏర్పాటయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తన ధ్రువీకరణ అథారిటీ కూడా నేడు నిర్వీర్యమైంది. గతంలో రైతులు, చిన్న విత్తన కంపెనీలు, యూనివర్శిటీల నుంచి బ్రీడర్ సీడ్ తెచ్చుకొని ఫౌండేషన్ సీడ్‌ను ఉత్పత్తి చేసేవి. విత్తన నాణ్యతను ఈ అథారిటీ ధ్రువీకరించిన తర్వాతనే మార్కెట్లోకి విడుదల చేసేవారు. రైతులు విత్తనాలను సరి్టఫై చేసేవారు. బీటీ రకాలు వచి్చన తర్వాత జిల్లాలో విత్తనోత్పత్తి లక్ష ఎకరాల నుంచి కేవలం 10వేల ఎకరాలకు పడిపోయింది. పూర్వవైభవం పొందాలంటే.... విత్తనోత్పత్తికి జిల్లా భూములు, వాతావరణం అనుకూలంగా ఉన్నాయి. రైతులకు పలు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలి. కర్నూలును పత్తి విత్తన కేంద్రంగా, నంద్యాల వరి విత్తన కేంద్రంగా, తంగడంచె ఫాంను కూరగాయల విత్తనాలు, ఇతర విత్తనాల ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ది చేయవచ్చు. విత్తనోత్పత్తి తగ్గిపోయింది పత్తి విత్తనోత్పత్తి రైతులకు లాభసాటిగా ఉండేది. విత్తన కంపెనీలు రైతులకు బ్రీడర్ సీడ్, ఫౌండేషన్ సీడ్ ఇచ్చి ప్రోత్సహించేవి. బీటీ దెబ్బతో ఆ కంపెనీలు మూతపడ్డాయి. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే మళ్లీ హైబ్రిడ్ విత్తన ఉత్పత్తిని చేపట్టి రైతాంగం అభివృద్ధి చెందుతుంది. – పి.నరసింహారావు, రైతు, చెరుకులపాడు, కర్నూలు జిల్లా చంద్రబాబు దెబ్బ–రైతులు కుదేలు టీడీపీ ప్రభుత్వం కో–మార్కెటింగ్ వ్యవస్థను రద్దు చేయడంతో విత్తన ఉత్పత్తి దెబ్బతింది. గతంలో బడా కంపెనీలు స్థానిక కంపెనీలకు ఫౌండేషన్ విత్తనాలు ఇచ్చేవి. స్థానిక కంపెనీలు రైతులతో విత్తనాల ఉత్పత్తి చేయించి సొంత బ్రాండ్స్‌తో (కో–మార్కెటింగ్) అమ్ముకునేవి. రైతులకూ లాభదాయకంగా ఉండేది. బహుళ జాతి కంపెనీల ఒత్తిడితో చంద్రబాబు సర్కారు కో–మార్కెటింగ్ వ్యవస్థను ఏక పక్షంగా రద్దు చేసింది. దాంతో స్థానిక కంపెనీలు మూతపడ్డాయి. రైతులతో విత్తనాలు ఉత్పత్తి చేయించే వారే లేరు. చిన్నచిన్న కంపెనీలను బహుళజాతి కంపెనీలు అణగతొక్కాయి. హైబ్రిడ్ విత్తనోత్పత్తి చేసే రైతులకు, విత్తన కంపెనీలకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తే కర్నూలు జిల్లా మళ్లీ సీడ్ హబ్‌గా మారుతుంది. – ఎంవీ రెడ్డి, వైస్ చైర్మన్, సీడ్ మెన్ అసోసియేషన్, కర్నూలు జిల్లా విత్తన పరిశ్రమ అభివృద్ధికి చేయూత విత్తనోత్పత్తికి కర్నూలు జిల్లా భూములు, వాతావరణం అనుకూలం. అందువల్ల నూతన ప్రభుత్వం కర్నూలు జిల్లాలో విత్తన ఉత్పత్తికి పలు చర్యలు చేపట్టబోతోంది. జూపాడు బంగ్లా మండలంలోని తంగడంచె ఫాంను అత్యాధునికంగా తీర్చిదిద్ది రైతులు విత్తనాలు ఉత్పత్తి చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. పత్తితో పాటు వరి, కూరగాయలు, ఇతర విత్తనోత్పత్తికి ప్రభుత్వ పరంగా ప్రోత్సహిస్తాం. – పి.విల్సన్,జేడీఏ, కర్నూలు -
నాణ్యమైన విత్తనోత్పత్తే ‘ఇస్టా’ లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: నాణ్యమైన విత్తనోత్పత్తిని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘం (ఇస్టా) సెక్రటరీ జనరల్ డాక్టర్ ఆండ్రియాస్ వాయస్ అన్నారు. స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ఆండ్రియాస్ ఇస్టా సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా నోవాటెల్ లో తనను కలిసిన విలేకరులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగడంలో విత్తన నాణ్యతే ప్రధానమని ఆయన అన్నారు. అధిక దిగుబడులు సాధించడానికి మెరుగైన విత్తనాలు అందిం చేలా నాణ్యత పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్ అందించడమే తమ బాధ్యత అని చెప్పారు. ఇది ఒకరకంగా సీడ్ పాస్‌పోర్టు లాంటిదన్నారు. అంతర్జాతీయ విత్తన వ్యాపారంలో ఇస్టా సర్టిఫికేషన్ కీలకమని చెప్పారు. అమెరికా, యూరప్ తదితర 80 దేశాల్లో విత్తన రవాణా, అంతర్జాతీయ విత్తన వ్యాపారానికి ఇస్టా సర్టిఫికెట్ అవసరమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ల్యాబ్‌లలో విత్తనాల నాణ్యతను గుర్తించి అవి సరైన ప్రమాణాలతో ఉన్నాయని తేలితేనే వాటికి సర్టిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ప్రతి ఏటా 2 లక్షల సర్టిఫికెట్లను జారీ చేయడం జరుగుతుందని వివరించారు. ఇస్టా అధ్యక్ష ఎన్నికలు ప్రతి మూడేళ్లకోసారి వార్షిక సమావేశాల్లో మాత్రమే జరుగుతాయన్నారు. అలాగే కార్యవర్గాన్ని ఎన్నుకుంటామన్నారు. అంతర్జాతీయం గా సభ్యత్వం ఉన్న దేశాల సభ్యులు ఇస్టా ఎన్నికల్లో పాల్గొంటారన్నారు. ఈ ఎన్నికల్లో భారతదేశానికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఇప్పటికే ఇస్టాలో కీలకస్థానంలో ఉన్న తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులుకు సముచిత స్థానం ఇస్తారా అని ప్రశ్నించగా, వచ్చే నెల మూడున జరిగే ఎన్నికల వరకు ఆగాలని ఆయన బదులిచ్చారు. సరైన విత్తనాలులేకే ఆత్మహత్యలు నాణ్యత, విత్తన జెర్మినేషన్ ఉండే హైక్వాలిటీ విత్తనా లకే అనుమతిస్తామని, ప్రభుత్వ ల్యాబ్‌లు, ప్రైవేటు ల్యాబుల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. ఏ దేశానికైనా వాతావరణం అనుకూలించడంతో పాటు విత్తన పరీక్షలు నిర్వహించే ల్యాబొరేటరీలు అవసరమన్నారు. 150 ఏళ్ల క్రితమే జర్మనీలో విత్తనాల పరీక్షల కోసం ల్యాబ్ ఏర్పాటు చేశారన్నారు. మంచి నాణ్యమైన విత్తనాలు వినియోగిస్తేనే పంట దిగుబడి వస్తుంది. సరైన విత్తనాలు వినియోగించక పోవడం వల్ల ఇండియాలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వాటిని అరికట్టాలంటే నాణ్యమైన విత్తనాలు అందించాలి. విత్తనాలు మొలకెత్తే సామర్థ్యాన్ని పరీక్షల ద్వారా నిర్ధారించాల్సి ఉంటుంది. ఎక్కువ దిగుబడి వచ్చే విత్తనాలు అందించడం ద్వారా రైతులను రక్షించుకోవాలి. కొత్త వంగడాలు అందించాలి. వాతావరణ, పర్యావరణ మార్పులు ఇక్కడి రైతుల జీవన విధానంపై ప్రభా వం చూపుతాయన్నారు. రైతులు ఎక్కువ పెట్టుబడులు పెట్టి పండించినా సరైన దిగుబడులు రాక నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇది ప్రభుత్వాలకు సవాల్‌గా మారిందన్నారు. ప్రత్యేక వ్యవసాయ విధానం అవసరం... ‘విత్తనాల ఉత్పత్తిలో ప్రత్యేక విధానాలను అవలంబించాలి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను పండించాలి. నీటి వినియోగం, వనరులు, భూసార పరీక్షలు అందుబాటులో ఉండాలి. వర్సిటీలు, పరిశోధన సంస్థలు ఎక్కువ దిగుబడి వచ్చే వంగడాలను రూపొందించాలి. నాణ్యమైన హైబ్రిడ్ విత్తనాలతో అధిక దిగుబడి సాధించవచ్చు. రెట్టింపు దిగుబడి సాధించే విత్తనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక్కడి రైతులు పంట పండించడానికి కష్టపడుతున్నారు. హైక్వాలిటీ విత్తనాల ద్వారానే దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ దిశలో ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలు అందించి రైతులకు తోడ్పడా లి. విత్తన రంగంలో ఏ విత్తనాల ద్వారా ఎలాంటి లబ్ధి చేకూరుతుందో ప్రభుత్వాలకు, రైతులకు వివరించి ఆహార భద్రతపై అవగాహన కల్పించడమే తమ లక్ష్యం’ అని ఆండ్రియాస్ అన్నారు. -
జూన్, జూలై నెలల్లో ఇస్టా కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: జూన్ 26 నుంచి జూలై 3 వరకు హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగే 32వ అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘం (ఇస్టా) సభలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఆదేశించారు. ఇస్టా కాంగ్రెస్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారం సచివాలయంలో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అంతర్జాతీయ విత్తన ఎగ్జిబిషన్‌పై రూపొందించిన బ్రోచర్‌ను సీఎస్ ఆవిష్కరించారు. జూన్ 26న ప్రారంభోత్సవ కార్యక్రమం, 26 నుంచి 28 వరకు విత్తన సింపోజియం, అంతర్జాతీయ విత్తన ప్రదర్శ న, 28న విత్తన వ్యవసాయదారుల సమావేశం, జూన్ 29 నుంచి జూలై 3 వరకు ఇస్టా వార్షిక సమావేశాలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో 400 మంది విదేశీ ప్రతినిధులు పాల్గొంటారన్నారు. వీరికి వసతి, భద్రత, రవాణా సదుపాయాలు కల్పించాల ని అధికారులను ఆదేశించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 200 విత్తన కంపెనీలు పాల్గొంటాయన్నారు. కొత్త ఉత్పత్తులు, సీడ్ ప్రాసెసింగ్, ప్యాకింగ్ ఎక్విప్మెంట్స్, సీడ్ ట్రీట్మెంట్, నూతన టెక్నాలజీపై ప్రదర్శన ఉంటుందని చెప్పారు. విత్తన ఉత్పత్తి, నాణ్యతపై సింపోజియం ఉంటుందన్నారు. ప్రపంచ వ్యవసాయ ఆహార సంస్థ సహకారంతో ఈ కాంగ్రెస్ జరుగుతుందన్నారు. రైతులకు అవగాహన సమావేశాలు.. రైతులకు విత్తన ఉత్పత్తిలో అమలవుతున్న నూతన పద్ధతులు, నాణ్యతపై అవగాహన కల్పించడానికి ఈ సమావేశాలు జరుగుతాయని సీఎస్ తెలిపారు. ఇస్టా కాంగ్రెస్‌కు ప్రచారాన్ని నిర్వహించాలని ఆదేశించారు. విదేశీ ప్రతినిధులు తెలంగాణలో పర్యాటక ప్రాంతాలను సందర్శించే ప్యా కేజీ వివరాలను వారికి తెలపాలన్నారు. ఈ సమా వేశంలో ఇస్టా సెక్రటరీ జనరల్ డాక్టర్ ఆండ్రియాస్ వియాస్, స్విట్జర్లాండ్‌కు చెందిన ఇస్టా ప్రతినిధి ఓల్గా స్టోకీ, ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ పీటర్ కార్ బెర్రీ, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, టూరిజం శాఖ కార్యదర్శి బి. వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. -
60 శాతం రాష్ట్రం నుంచే...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వాతావరణం, భూములు విత్తనోత్పత్తికి అత్యంత అనుకూలమని.. ప్రస్తుతం దేశ విత్తన అవసరాల్లో 60 శాతం రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విత్తనోత్పత్తికి ప్రాముఖ్యమిస్తూ రాష్ట్రాన్ని ‘సీడ్ బౌల్ ఆఫ్ వరల్డ్‘గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోందన్నారు. ఇండో–జర్మనీ కో–ఆపరేషన్ ఆన్ సీడ్ సెక్టార్ డెవలప్మెంట్ కింద చేపట్టిన రెండో ప్రాజెక్టుపై గురువారం మంత్రి నివాసంలో ప్రాజెక్టు స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర రైతులు సహజంగా కష్టపడి, నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నారని, వారికి జర్మనీ దేశ సాంకేతికత తోడైతే మంచి హైబ్రిడ్ వంగడాలు ఉత్పత్తి అవుతాయని అభిప్రాయపడ్డారు. విత్తనోత్పత్తికి రాష్ట్రం అన్ని విధాలా అనుకూలం కావడంతో దేశ, విదేశాలకు చెందిన 400 కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయన్నారు. రూ. 1.5 లక్షల కోట్లతో ప్రాజెక్టులు రాష్ట్రంలో సీడ్ విలేజ్ కార్యక్రమం ద్వారా 69,950 మంది రైతులు 26,380 హెక్టార్లలో 68,000 క్వింటాళ్ల నాణ్యమైన ఫౌండేషన్ విత్తనాలు ఉత్పత్తి చేశారని మంత్రి చెప్పారు. గతేడాది 7 లక్షలకు పైగా క్వింటాళ్ల సర్టిఫైడ్ విత్తనాలను రైతుల ద్వారా ఉత్పత్తి చేయించామన్నారు. వ్యవసాయ శాఖకు చెందిన 10 విత్తనోత్పత్తి కేంద్రాల్లో బ్రీడ్ సీడ్‌ను ఉత్పత్తి చేయిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కోటి యాబై లక్షల ఎకరాల సాగుభూమిలో 20 లక్షలకే సాగునీటి వసతి ఉందని, కోటి ఎకరాలకు నీరు అందించడానికి రూ.లక్షా యాబై వేల కోట్లతో కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తున్నామని తెలిపారు. రైతుల కష్టాలు తెలిసిన కేసీఆర్ సీఎంగా ఉండటం ప్రజల అదృష్టమన్నారు. పంటలకు పెట్టుబడిగా ఎకరాకు రూ. 8 వేలు ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని జర్మనీ ప్రతినిధులకు వివరించారు. ప్రతి రైతుకు రూ. 2,271 తో రూ. 5 లక్షల ఉచిత బీమా కూడా తెలంగాణ ప్రభుత్వం ఇస్తోందన్నారు. ప్రస్తు త ఇండో–జర్మన్ విత్తన సహకార ఒప్పందం మరో మూడేళ్ల పొడగింపునకు భేటీలో అంగీకరించినట్లు మంత్రి తెలిపారు. ఈ ఏడాది 25,000 క్వింటాళ్ల లక్ష్యం రాష్ట్రంలో విత్తనోత్పత్తి ఏటా 12.15 శాతం వృద్ధి చెందుతోందని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి చెప్పారు. 2016–17లో 17,000 క్వింటాళ్ల ధ్రువీకరించిన విత్తనాలను రాష్ట్రం నుంచి ఎగుమతి చేశామని, ఈ ఏడాది 25,000 క్వింటాళ్లు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. జాతీయ స్థాయిలో విత్తన నాణ్యత, ఉత్పత్తి, చట్టాలు ధ్రువీకరణ, ప్రస్తుత అవసరాలకు అనుగు ణంగా విత్తనోత్పత్తి, తెలంగాణలో విత్తనోత్పత్తికి అవకాశాలపై, మన దేశ విత్తన ధ్రువీకరణ, అంతర్జాతీయ విత్తన ధ్రువీకరణపై రచించిన 3 పుస్తకాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో విత్తనాభి వృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరా వు, వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్, అగ్రికల్చర్ వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రవీ ణ్‌రావు, రాష్ట్ర విత్తన ధ్రువీకరణ డైరెక్టర్ కేశ వులు, జర్మన్ దేశ ప్రతినిధులు ఉల్రిక్ క్లేయిన్ విచర్, నదీన్ కోహన్లే, ఉల్రిక్ ముల్లర్, ఎక్కా ర్డ్ శ్రోడర్(టీం లీడర్–ఇండో జర్మన్ కో–ఆపరేషన్ ప్రాజెక్టు, జర్మన్) పాల్గొన్నారు. -
ప్రభుత్వ సంస్థలే విత్తనోత్పత్తి చేయాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆధ్వర్యంలోని విత్తన సంస్థల ద్వారానే విత్తనోత్పత్తి చేపట్టాలని జాతీయ సదస్సు సిఫార్సు చేసింది. ఈ నెల 6, 7వ తేదీల్లో హైదరాబాద్‌లో జరిగిన విత్తనోత్పత్తి, నాణ్యత నియంత్రణ, మార్కెటింగ్ అంశాలపై జరిగిన జాతీయ సదస్సులో అనేక సిఫార్సులు చేసినట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో విత్తన కార్పొరేషన్లు టెండర్లు లేదా ఇతర మార్గాల ద్వారా విత్తనాలు సేకరించుకుంటు న్నాయన్నారు. అయితే అనేక సందర్భాల్లో అవి నాసిరకంగా ఉంటున్నట్లు చెప్పారు. అందువల్ల ప్రభుత్వ విత్తన సంస్థే విత్తనోత్పత్తి చేయాలని సిఫార్సు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రాల విత్తన సంస్థలతో ఒప్పందం చేసుకొని నాణ్యమైన విత్తనాన్ని కొనుగోలు చేయాలన్నారు. -
పత్తి విత్తన మాయ..!
- విత్తనోత్పత్తి కంపెనీల ముసుగుతో భారీగా రాయల్టీ ఎగవేత - రెండు నెలల్లో రూ.20 కోట్ల విలువ గల పత్తి విత్తనాల విక్రయాలు సాక్షి, మహబూబ్‌నగర్: పత్తి విత్తనోత్పత్తి కంపెనీల ముసుగులో కొందరు అక్రమార్కులు మాయ చేస్తున్నారు. అమాయక రైతులను ఆసరా చేసుకొని కల్తీ విత్తనాలను అంటగడుతున్నారు. విత్తన ఉత్పత్తి కంపెనీల వద్ద వ్యవసాయా«ధికారుల పర్యవేక్షణ కొరవడడంతో సీడ్స్ జిన్నింగ్ సమయంలో నాన్‌సీడ్ పత్తి విత్తనాల్ని సైతం జిన్నింగ్ చేసి కలుపుతున్నారు. అలాగే కంపెనీల ముసుగులో ప్రభుత్వానికి భారీగా రాయల్టీ ఎగవేస్తున్నారు. దీంతో తక్కువ ధరకే ‘కంపెనీ’విత్తనాలు లభిస్తున్నాయనే ఆశతో రైతులు మోసపోతున్నారు. ఈ నేపథ్యంలో పత్తి రైతులు కంపెనీల వద్ద తక్కువ ధరకు విత్తనాలు విక్రయిస్తున్నారని మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రానికి వచ్చి కొనుగోలు చేసుకుని వెళ్తున్నారు. ఇలా ఉమ్మడి పాలమూరు ప్రాంతంతోపాటు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు చెందిన రైతులు భారీగా వచ్చి తీసుకెళ్తున్నారు. ఈ మే, జూన్ రెండు నెలల్లోనే దాదాపు రూ.20 కోట్ల మేర అమ్మకాలు జరిపినట్లు సమాచారం. ఒక ప్యాకెట్‌ను దాదాపు 450 గ్రాముల విత్తనాల తో తయారు చేస్తున్నారు. ఒక ప్యాకెట్ విత్తనాలలో నాన్‌సీడ్ విత్తనాలు దాదాపు 50 నుంచి 100 గ్రాములు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. రాయల్టీ ముసుగులో విత్తనాల విక్రయాలు కేంద్ర ప్రభుత్వ అనుమతి పొందిన పెద్ద కంపెనీల నుంచి కొన్ని చిన్న కంపెనీలు విత్తనోత్పత్తి కోసం అగ్రిమెంట్ చేసుకుం టున్నాయి. అందుకోసం రాయల్టీ రుసుము కింద ఒక్కొక్క ప్యాకెట్‌కు గాను రూ.100 నుంచి 250 వరకు చెల్లిస్తున్నాయి. అగ్రిమెంట్ ప్రకారం విక్రయించాల్సి ఉండగా... చిన్న కంపెనీలు అంతకు మించి వేలాది పత్తి విత్తనాల ప్యాకెట్లను అమ్ముతున్నాయి. ఎవరైనా అధికారులు దాడులు చేస్తే కొంత మొత్తానికి తీసుకున్న అనుమతి పత్రాలే చూపుతుంటారు. ఇలా ప్రతి కంపెనీకి చెందిన దుకాణాలు అగ్రిమెంట్ అధికంగా పత్తి విత్తనాలను విక్రయించి సొమ్ము చేసుకుం టున్నాయి. తద్వారా ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో రావాల్సిన ఆదాయానికి భారీగా గండిపడుతోంది. -
విత్తనోత్పత్తికి జర్మనీ సహకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, ప్రపంచ దేశాలకు ఎగుమతి విషయంలో సహ కరించేందుకు జర్మనీ ముందు కొచ్చింది. సాంకేతిక సలహా లతోపాటు, మార్కెటింగ్ సర్వే వివరాలు అందించేం దుకు సిద్ధమని ఆ దేశ ప్రతనిధులు ప్రకటించా రు.ఇండో జర్మన్ కో–ఆపరేష న్ ఆన్ సీడ్ సెక్టార్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జర్మనీ ప్రతినిధులు గురువారం సచివాలయంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితోభేటీ అయ్యారు. ‘సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ’ ప్రాజెక్టుకు సంపూర్ణ సహకారం అందిస్తామని వారు మంత్రికి హామీ ఇచ్చారు. నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేయటానికి అవసరమైన సాంకేతిక సలహాలతోపాటు, మార్కెటింగ్‌లో కూడా సహకరిస్తామని వెల్లడించారు. తెలంగాణకు చెందిన సీడ్ కార్పొరేషన్, సీడ్ సర్టిఫికెట్ ఏజెన్సీ, వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలసి పనిచేయటానికి సిద్ధమని ప్రకటించారు. విత్తనోత్పత్తి, పరిశోధన, నిల్వ, రవాణా, ప్యాకింగ్, మార్కెటింగ్ తదితర రంగాల్లో సహకారం అందిస్తామని తెలిపారు. ఇందుకోసం నగరంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నాణ్యమైన విత్తనోత్పత్తికి తెలంగాణ అనుకూల ప్రాంతమని మంత్రి పోచారం వారికి వివరించారు. సమావేశంలో జర్మనీ ప్రాజెక్టు టీమ్ లీడర్ ఎక్కార్డ్ ష్రోడర్, ఇండో–జర్మన్ నేషనల్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ సౌమిని సుంకర, వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి, కమిషనర్ జగన్ మోహన్ పాల్గొన్నారు. -
‘శ్రీ సత్య సీడ్స్’కు అంతర్జాతీయ పురస్కారం
హైదరాబాద్: విత్తన ఉత్పత్తి రంగంలో విశిష్ట ప్రతిభ కనబరచినందుకు గానూ శ్రీ సత్య సీడ్స్ కంపెనీ ‘వేగంగా పురోగతి సాధిస్తున్న భారతీయ కంపెనీ ఎక్సలెన్స్ అవార్డు’ను కైవసం చేసుకుంది. ఇటీవల బ్యాంకాక్‌లో ఏడవ అంతర్జాతీయ విజయ సాధకుల సదస్సు జరిగింది. ఇందులో పలు రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన వివిధ దేశాల సంస్థలకు పురస్కారాలను అందిచారు. ఇందులో భాగంగా శ్రీ సత్య సీడ్స్ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ కొసనా రామకోటేశ్వరరావు థాయ్‌లాండ్ దేశ మాజీ ఉప ప్రధాని హెచ్.ఈ. ఖూన్ కోర్న్ దబ్బరాన్సి చేతుల మీదుగా ఎక్స్‌లెన్స్ అవార్డును అందుకున్నారు. -
విత్తన భాండాగారంపై సర్కారు ప్రత్యేక దృష్టి
* అక్టోబర్‌లో హైదరాబాద్‌లో మూడు రోజుల జాతీయ విత్తన కాంగ్రెస్ * దేశ విదేశాల నుంచి 400 మంది శాస్త్రవేత్తలు, ఇతర ప్రతినిధులు హాజరు సాక్షి, హైదరాబాద్: విత్తన ఉత్పత్తి, ఎగుమతిలో రాష్ట్రాన్ని దేశానికే విత్తన భాండాగారంగా తీర్చిదిద్దాలని తెలంగాణ సర్కారు సంకల్పించింది. అందుకు కసరత్తు మొదలుపెట్టింది. విత్తన ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, దాన్ని రైతులకు మరింత లాభసాటిగా తయారుచేయాలని సర్కారు ఆలోచన. ప్రస్తుతం ప్రైవేటు, బహుళజాతి కంపెనీలతో కలుపుకొని దేశంలో ఉత్పత్తి అయ్యే విత్తనంలో 70% తెలంగాణలోనే తయారవుతోంది. అందులో 62% 11 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 58 లక్షల క్వింటాళ్ల విత్తన ఉత్పత్తి జరి గింది. 441 ప్రైవేటు కంపెనీలు విత్తన ఉత్పత్తిలో పాలుపంచుకుంటున్నా యి. మొత్తం విత్తన ఉత్పత్తిలో ప్రైవేటు వాటా 88% ఉండగా... ప్రభుత్వ సీడ్ కార్పొరేషన్ వాటా 12%. 98% బీటీ పత్తి విత్తనాల ఉత్పత్తి మోన్శాంటో కంపెనీ చేతుల్లోనే ఉంది. పప్పుధాన్యాలు, శనగ విత్తనాల్లో మాత్రమే సీడ్ కార్పొరేషన్ తయారుచేస్తుంది. ఏటా హైబ్రీడ్ రకాలకు చెందిన వరి విత్తనం 75 వేల ఎకరాల్లో సాగవుతుంది. కూరగాయలు, సోయాబీన్ విత్తనాల ఉత్పత్తి మాత్రం రాష్ట్రం లో జరగడం లేదు. తెలంగాణకున్న నేల, వాతావరణ పరిస్థితి విత్తనతయారీకి అనుకూలమైనందున దీన్ని రైతుకు అనుగుణంగా మలచాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో జాతీయ విత్తన కాంగ్రెస్ విత్తన భాండాగారంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు శాస్త్రవేత్తలు, బడా విత్తన కంపెనీలు, ఆ రంగంలోని దేశవిదేశీ ప్రముఖులను ఒక చోట చేర్చి ప్రణాళిక రచించాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే అక్టోబర్‌లో హైదరాబాద్‌లో జాతీయ విత్తన కాంగ్రెస్‌ను నిర్వహించాలని నిర్ణయించిం ది. ఈ అంశం ఇటీవల ఢిల్లీలో జాతీయ వ్యవసాయ విత్తన సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో చర్చకు వచ్చింది. దీనికి హాజరైన రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి విత్తన కాంగ్రెస్‌కు ఏర్పాట్లు చేయాలని కేంద్రం సూచించిందని ‘సాక్షి’కి చెప్పారు. తేదీలు ఖరారు చేయలేదన్నారు. 3 రోజులు జరిగే ఈ కాంగ్రెస్‌కు దేశవిదేశాల నుంచి 400మంది శాస్త్రవేత్తలు, పలు కంపెనీల ప్రతినిధులు, అధికారులు హాజరవుతారన్నారు. -
ప్రభుత్వ సొమ్మంటే లెక్కేలేదా?
బీర్కూర్ : ‘‘ప్రభుత్వ సొమ్మంటే లెక్కలేకుండా పోయింది. నాణ్యమైన సీడ్‌ను అందించాల్సిన సీడ్ ఫాంను భ్రష్టు పట్టించేశారు. పని చేయడం ఇష్టం లేకపోతే ఇంట్లో కూర్చోండి’’ అంటూ బొప్పాస్పల్లి విత్తనోత్పత్తి క్షేత్రం జేడీఏ నర్సింహ, ఏడీఏ సైదులులపై వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విరుచుకుపడ్డారు. గురువారం సాయంత్రం ఆయన బొప్పాస్పల్లి విత్తన ఉత్పత్తి క్షేత్రాన్ని తనిఖీ చేశారు. సీడ్ ఫాంలో చేస్తున్న పనులను పరిశీలించారు. లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న వాటర్ పాండ్లను పరిశీలించి పనులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాలువ కంటే ఎత్తు ఎక్కువగా ఉంటే నీళ్లు ఎలా నిలువ ఉంటాయని ఆయన ఏడీఏను ప్రశ్నించారు. అనంతరం కాలువ నిర్మాణ పనులతో పాటు సీడ్‌ఫాంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విత్తన ఉత్పత్తి క్షేత్రానికి సంబంధించి అభివృద్ధి పనుల కోసం కార్యాలయం నుంచి సుమారు రూ. 2 కోట్ల నిధులు కావాలంటూ తన కార్యాలయానికి ప్రతిపాదనలు వచ్చాయన్నారు. అయితే ఈ ప్రతిపాదనలు దేనికోసం పంపించారని ఆయన ఏడీఏను ప్రశ్నించారు. 475 ఎకరాలు ఉన్న సీడ్ ఫాం భూమికి కంచె నిర్మాణం కోసం రూ. 60 లక్షలతో ప్రతిపాదనలు పంపించారని అయితే ఈ రూ. 60 లక్షలు ఎందుకు కావాలో తనకు తెలియాలని ప్రశ్నించారు. ప్రతిపాదనలు పంపిన విషయం తన దృష్టికి రాలేదని జేడీఏ సమాధానమిచ్చారు. కింది స్థాయి అధికారులు ఏ ప్రతిపాదనలు పంపుతున్నారో తెలియకపోతే మీరంతా ఎందుకు ఉన్నారంటూ మంత్రి మండిపడ్డారు. పంట భూమిని నాశనం చేశారు బ్రహ్మాండంగా పంటలు పండే భూమిని గుంతలు తవ్వి నాశనం చేశారని, పని చేయడం ఇష్టం లేకపోతే ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలని మంత్రి పోచారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సందర్భంలో తన చేతిలో ఉన్న ఫైల్‌ను సైతం ఆయన విసిరి కొట్టారు.. ఇప్పటికే భూమి మొత్తం నాశనం అయిందని మరో రూ. 20 లక్షలు కావాలని ప్రతిపాదనలు పంపించారని, ఈ డబ్బులు ఇస్తే ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. మంత్రి అడిగిన ఏ ప్రశ్నకూ ఏడీఏ వద్ద సమాధానం లేకపోవడంతో.. ఏం చేస్తే మీరు మారతారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీడ్‌ఫాంలో ఉన్న బోర్లు పూర్తిగా ఎత్తిపోయాయని, వాటిని బాగు చేయించే దిక్కు లేదు కాని మరికొన్ని బోర్లు వేయడానికి నిధులు కావాలా అని నిలదీశారు. పని చేయకుండానే జీతం తీసుకునే అలవాటు అధికారుల్లో ఎక్కువ అయ్యిందని, ఇది మంచి పద్ధతి కాదని మంత్రి పేర్కొన్నారు. గతంలో వచ్చిన నిధులతో ఏ ఏ పనులు చేశారని ఆయన ఏడీఏను అడిగారు. వంతుల వారీగా డబ్బులు పంచుకుంటూ ప్రభుత్వ సొమ్మును దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీడ్‌ఫాంకు సంబంధించిన 475 ఎకరాల్లో సుమారు 225 ఎకరాల్లో పంటలు పండించవ చ్చని, అయితే ఇంత వరకు ఒక్క ఎకరంలో అరుునా పంటలు పండించిన దాఖలాలు కనిపించడం లేదని పేర్కొన్నారు. ఈ సీడ్ఫాం భూమి ద్వారా రెండు జిల్లాలకు సోయా విత్తనాలు అందించవచ్చన్నారు. అయితే అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా సోయా విత్తనాలు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఏడీఏను వెంటనే మార్చండి ప్రస్తుతం ఉన్న ఏడీఏ సైదులును వెంటనే ఇక్కడి నుంచి పంపించివేయాలని, ఆయన స్థానంలో మరో రెగ్యులర్ ఏడీఏను, ఇతర సిబ్బందిని నియమించాలని జేడీఏ నిర్సింహను మంత్రి ఆదేశించారు. సిబ్బంది స్థానికంగా ఉండేలా క్వార్టర్లకు సైతం మరమ్మతులు చేయించాలని సూచించారు. మంత్రి కాలికి గాయం సీడ్ఫాంను పరిశీలించేందుకు వచ్చిన మంత్రి పోచారం కాలికి కర్ర గుచ్చుకోవడంతో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే స్థానిక నాయకులు ఆయనకు ప్రథమ చికిత్స చేరుుంచారు. ఆయన వెంట స్థానిక సర్పంచ్ రాములు, జడ్పీటీసీ సభ్యుడు కిషన్ నాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యుడు కంది మల్లేశ్, నాయకులు సతీశ్, బస్వరాజ్, హన్మంతు తదితరులున్నారు.