విత్తనోత్పత్తికి జర్మనీ సహకారం | Germany cooperation for Seed production: Pocharam Srinivasa Reddy | Sakshi
Sakshi News home page

విత్తనోత్పత్తికి జర్మనీ సహకారం

Published Fri, Feb 3 2017 2:20 AM | Last Updated on Mon, Sep 17 2018 8:21 PM

జర్మనీ ప్రతినిధికి జ్ఞాపిక అందిస్తున్న పోచారం - Sakshi

జర్మనీ ప్రతినిధికి జ్ఞాపిక అందిస్తున్న పోచారం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, ప్రపంచ దేశాలకు ఎగుమతి విషయంలో సహ కరించేందుకు జర్మనీ ముందు కొచ్చింది. సాంకేతిక సలహా లతోపాటు, మార్కెటింగ్‌ సర్వే వివరాలు అందించేం దుకు సిద్ధమని ఆ దేశ ప్రతనిధులు ప్రకటించా రు.ఇండో జర్మన్‌ కో–ఆపరేష న్‌ ఆన్‌ సీడ్‌ సెక్టార్‌ డెవలప్‌మెంట్‌ ఆధ్వర్యంలో జర్మనీ ప్రతినిధులు గురువారం సచివాలయంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితోభేటీ అయ్యారు. ‘సీడ్‌ బౌల్‌ ఆఫ్‌ తెలంగాణ’ ప్రాజెక్టుకు సంపూర్ణ సహకారం అందిస్తామని వారు మంత్రికి హామీ ఇచ్చారు.

నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేయటానికి అవసరమైన సాంకేతిక సలహాలతోపాటు, మార్కెటింగ్‌లో కూడా సహకరిస్తామని వెల్లడించారు. తెలంగాణకు చెందిన సీడ్‌ కార్పొరేషన్, సీడ్‌ సర్టిఫికెట్‌ ఏజెన్సీ, వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలసి పనిచేయటానికి సిద్ధమని ప్రకటించారు.  విత్తనోత్పత్తి, పరిశోధన, నిల్వ, రవాణా, ప్యాకింగ్, మార్కెటింగ్‌ తదితర రంగాల్లో సహకారం అందిస్తామని తెలిపారు.

ఇందుకోసం నగరంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నాణ్యమైన విత్తనోత్పత్తికి తెలంగాణ అనుకూల ప్రాంతమని మంత్రి పోచారం వారికి వివరించారు. సమావేశంలో జర్మనీ ప్రాజెక్టు టీమ్‌ లీడర్‌ ఎక్కార్డ్‌ ష్రోడర్, ఇండో–జర్మన్‌ నేషనల్‌ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్‌ సౌమిని సుంకర, వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి, కమిషనర్‌ జగన్‌ మోహన్‌ పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement