national seminar
-
మీడియాలో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యమేదీ?
బంజారాహిల్స్: మీడియాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యం ఉండటం లేదని.. అలాంటప్పుడు సమాజంలో ఎక్కువ శాతం జనాభా ఉన్న కులాల సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ప్రముఖ విశ్లేషకుడు, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ ప్రశ్నించారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ‘తెలంగాణలో మీడియా: గతం, వర్తమానం, భవిష్యత్తు అనే అంశంపై రెండో రోజైన ఆదివారం జాతీయ సెమినార్ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య వక్తగా ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పౌర సమాజం బలంగా ప్రశ్నించడం వల్లే మీడియాలో ఆ మాత్రమైనా వార్తలు వచ్చాయని... కొందరు ఆంధ్ర పాలకులు అడ్డుపడినా రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్–3 ఉండటం వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యపడిందన్నారు. తక్కువ శాతం జనాభా ఉన్న అగ్రకులాల్లోని పేదలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడంపై మీడియాలో ఎక్కడా ఎక్కువ చర్చ జరగలేదని నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ జర్నలిజంపై ఇంకా లోతైన పరిశోధన జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సాక్షి మీడియా గ్రూప్ సంపాదకుడు వర్ధెల్లి మురళి మాట్లాడుతూ మీడియా సంస్థలు ప్రజాప్రయోజనాల కోసం పని చేయాలని సూచించారు. ‘మీడియా తన ప్రయోజనాలను కాపాడుకుంటూ పెట్టుబడిదారులకు ఉపయోగకారిగా నిలుస్తోంది. ఈ పరిస్థితి మారి పాత్రికేయ స్వేచ్ఛను ఉపయోగిస్తూ ప్రజాప్రయోజనాలకు వాడాలి’అని కోరారు. గ్రామీణ, దళిత, మహిళా జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చాం: అల్లం నారాయణ ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ తెలంగాణ గడ్డ నుంచి ప్రఖ్యాత పాత్రికేయులు ఉన్నారన్నారు. తమ అకాడమీ ఆధ్వర్యంలో గ్రామీణ పాత్రికేయులకు, దళిత జర్నలిస్టులకు, మహిళా పాత్రికేయులకు శిక్షణ ఇచ్చామన్నారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ కె.సీతారామారావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రెండు రోజుల సదస్సుపై నివేదిక సమర్పించారు. కార్యక్రమంలో టిశాట్ సీఈవో ఆర్. శైలేశ్‌రెడ్డి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జర్నలిజం–న్యూ మీడియా (బెంగళూరు) డీన్ డా. కంచన్ కౌర్, రాష్ట్ర ఐటీ (డిజిటల్ మీడియా) డైరెక్టర్ కొణతం దిలీప్, సీఈవో రాకేష్ దుబ్బుడు, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇన్వెస్టిగేటివ్ సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్ సుధాకర్‌రెడ్డి, ఉడుముల, సీనియర్ జర్నలిస్టు ఎ. కృష్ణారావు, వర్సిటీ సామాజిక శాస్త్రాల డీన్ ప్రొఫెసర్ వడ్దానం శ్రీనివాస్, ప్రొఫెసర్ సత్తిరెడ్డి, సమన్వయకర్తలు యాదగిరి కంభంపాటి, సునీల్ కుమార్ పోతన, ఓయూ జర్నలిజం విభాగ విశ్రాంత అధ్యాపకురాలు పద్మజా షా, మాజీ సంపాదకుడు, ప్రభుత్వ సలహాదారు టంకశాల అశోక్, వీక్షణం ఎడిటర్, ఎన్. వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
అసమానతలున్నంత వరకు రిజర్వేషన్లు
సాక్షి, హైదరాబాద్: సమాజంలో అసమానతలు ఉన్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ స్పష్టంచేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ను సవరించి మరింత సమర్థవంతంగా అమలు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వమేనని, దళితుల పట్ల చిత్తశుద్ధి ఉన్న పార్టీ బీజేపీయేనని వాఖ్యానించారు. మంగళవారం రవీంద్రభారతిలో జాతీయ ఎస్సీ కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన నేషనల్ సెమినార్ ఆఫ్ రిజర్వేషన్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్స్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడంలో బీజేపీ ముందుంటుందని, దేశానికి రాష్ట్రపతిగా తొలిసారి మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తిని అప్పటి ప్రధాని వాజ్‌పేయి నిలిపారని గుర్తుచేశారు. వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తి దేశానికి ప్రధాని అయ్యారని, దళిత వ్యక్తిని రాష్ట్రపతిగా చేసింది కూడా బీజేపీ అని తెలిపారు. సమాజంలో దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని, వీటిని అరికట్టేందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మరింత కఠినతరం చేసినట్లు చెప్పారు. దళితుల రిజర్వేషన్లు మరో పదేళ్లు పొడిగించి ప్రధాని మోదీ సాహసం చేశారన్నారు. అనంతరం ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మాట్లాడుతూ దళితులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్యానిధి లాంటి పథాకాలను మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అట్రాసిటీ కేసులు పెరుగుతున్నాయని, కానీ పోలీసులు నిందితులకు స్టేషన్ బెయిల్ ఇస్తూ వారికి పరోక్షంగా సహకరిస్తున్నారని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు అన్నారు. -
ప్రభుత్వ సంస్థలే విత్తనోత్పత్తి చేయాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆధ్వర్యంలోని విత్తన సంస్థల ద్వారానే విత్తనోత్పత్తి చేపట్టాలని జాతీయ సదస్సు సిఫార్సు చేసింది. ఈ నెల 6, 7వ తేదీల్లో హైదరాబాద్‌లో జరిగిన విత్తనోత్పత్తి, నాణ్యత నియంత్రణ, మార్కెటింగ్ అంశాలపై జరిగిన జాతీయ సదస్సులో అనేక సిఫార్సులు చేసినట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో విత్తన కార్పొరేషన్లు టెండర్లు లేదా ఇతర మార్గాల ద్వారా విత్తనాలు సేకరించుకుంటు న్నాయన్నారు. అయితే అనేక సందర్భాల్లో అవి నాసిరకంగా ఉంటున్నట్లు చెప్పారు. అందువల్ల ప్రభుత్వ విత్తన సంస్థే విత్తనోత్పత్తి చేయాలని సిఫార్సు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రాల విత్తన సంస్థలతో ఒప్పందం చేసుకొని నాణ్యమైన విత్తనాన్ని కొనుగోలు చేయాలన్నారు. -
కమ్యూనికేషన్ టెక్నాలజీపై జాతీయ సదస్సు
సాగర్‌నగర్ (విశాఖ తూర్పు) : సమాచార, సాంకేతిక రంగంలో వస్తున్న ఆధునాతన మార్పులపై గీతం విశ్వవిద్యాలయం ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో రెండ్రోజుల జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఎన్ఎస్టీఎల్ అసోసియేషన్ డైరెక్టర్ డాక్టర్ అబ్రహం వర్గీస్ ముఖ్యఅతిథిగా హాజరై సదస్సును ప్రారంభిస్తూ సమాచార, సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రీ ఇన్ఫోర్స్డ్, ఫైబర్ టెక్నాలజీ, కాగ్నిటివ్ రేడియో వంటివి సమాచార వ్యవస్థను కొత్త పుంతలు తొక్కిస్తున్నాయని పేర్కొన్నారు. ఆకాశావాణి విశాఖ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ బి. రామకృష్ణ ప్రసాద్ 1970 నుంచి సమాచార వ్యవస్థలో కాలానుగుణంగా వచ్చిన మార్పులను తన ప్రసంగంలో వివరించారు. గీతం వీసీ ప్రొఫెసర్ ఎం.ఎస్.ప్రసాదరావు మాట్లాడుతూ సమాచార, సాంకేతిక విప్లవం గత దశాబ్దకాలంలో ఏ విధంగా మార్పులకు గురైందీ వివరించారు. ఇస్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. లక్ష్మీప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్ సి.ధర్మరాజు, ఈసీఈ విభాగాధిపతి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ టి. మాధవి, కో–కన్వీనర్ డాక్టర్ జి. కరుణాకర్ సదస్సు వివరాలను తెలియజేశారు. జాతీయ సదస్సుకు నలుమూలల నుంచి సాంకేతిక రంగ నిపుణులు హాజరయ్యారు. సమాచార రంగంలో చోటు చేసుకున్న మార్పులపై సీడీ ఆవిష్కరించారు. -
నేడు ఆర్ట్స్ కళాశాలలో జాతీయ సదస్సు
అనంతపురం ఎడ్యుకేషన్ : స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో ‘భారతదేశంలోని మహిళా నిష్ణాతులు - దేశాభివృద్ధిలో వారి పాత్ర’ అనే అంశంపై రెండురోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ సదస్సు గురువారం ప్రారంభం కానుంది. వివిధ రాష్ట్రాల నుంచి ఆచార్యులు, మేధావులు హాజవుతారని ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.రంగస్వామి, సదస్సు కన్వీనర్ బి.జమీలాబీబీ, కో-ఆర్డినేటర్ టి.శైలజారాణి తెలిపారు. వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు ఈ సదస్సును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
భారతీయ నృత్య సంప్రదాయం ఆదర్శం
విజయవాడ కల్చరల్ : భారతీయ నృత్య సంప్రదాయం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని నటరాజ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ వ్యవస్థాపకుడు విక్రమ్‌కుమార్ అన్నారు. శారదా జూనియర్ కళాశాల, మ్యూజిక్ అకాడమీ సంస్థలు సంయుక్తంగా సత్యనారాయణపురంలోని శారదా కళాశాల సెమినార్‌హాల్‌లో శనివారం భారతీయ నృత్య సంప్రదాయం అంశంగా జాతీయ సెమినార్ నిర్వహించింది. విక్రమ్ కుమార్ మాట్లాడుతూ మన నృత్య సంప్రదాయలను ప్రపంచం అంతా ఆసక్తిగా గమనిస్తోందని, వాటి విలువలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. చదువైనా, కళాప్రదర్శనలైనా ఇష్టపడి చేయాలని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎల్. శ్రీధర్ మాట్లాడుతూ విద్యార్థులకు భారతీయ నృత్యాలపై ప్రాథమిక పరిజ్ఞానం కోసం సెమినార్ ఏర్పాటు చేశామన్నారు. బెంగుళూరుకు చెందిన కథక్ బృందం ఆ నృత్యంలోని వివిధ భంగిమలు ప్రదరించారు. బృంద నాయకురాలు శ్వేతా వెంకటేష్ కథక్ నృత్య విశేషాలను తెలిపారు. అంతర్జాతీయ ఒడిస్సీ కళాకారుడు బి. చిత్రానందస్వైన్ సంప్రదాయ ఒడిస్సీ నృత్య కళ విస్తరణను వివరించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు నృత్యభంగిమల ద్వారా సమాధానమిచ్చారు. -
9నుంచి కుర్తాళంలో విశిష్ట ఆధ్యాత్మిక జాతీయ సదస్సు
కంకిపాడు : తమిళనాడు రాష్ట్రంలోని కుర్తాళంలో శ్రీసిద్ధేశ్వరీ పీఠం శతాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకుని 9, 10, 11 తేదీల్లో విశిష్ట ఆధ్యాత్మిక భక్తి వాఙ్మయ జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు తుమ్మలపల్లి పరమేశ్వరరావు చారిటబుల్ ట్రస్టు చైర్మన్, దస్తావేజు లేఖరుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మలపల్లి హరికృష్ణ తెలిపారు. పట్టణంలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సిద్ధేశ్వరీ పీఠం, తిరుమల తిరుపతి దేవస్థానముల సంయుక్త నిర్వహణలో భక్తి అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించాలని పీఠాథిపతి సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి నిర్ణయించారన్నారు. జాతీయ సదస్సుకు తాను సహకారం అందించే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆధ్యాత్మిక పీఠాలు, భక్తి, ఆలయాలు, భక్తి సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలు అనేక అంశాలపై ఈ సదస్సులో మేధావులు, పండితులు ప్రసంగిస్తారన్నారు. -
అనంతలక్ష్మిలో జాతీయ సదస్సు
ఎస్కేయూ : అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో ‘ఎలక్ట్రో–ప్యాడ్ 2కే16’ పేరుతో గురువారంlజాతీయ సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్టీయూ పులివెందుల ప్రొఫెసర్ గణేష్ హాజరై మాట్లాడారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో వస్తున్న మార్పుల గురించి పరిశోధనలకు గల అవకాశాల గురించి వివరించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ ప్రాజెక్టుల ప్రొటో టైప్ మోడల్స్‌ను పరిశీలించి అభినందించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ అనంతరాముడు, డైరెక్టర్ రమేష్‌నాయుడు, ప్రిన్సిపాల్ డాక్టర్ బండి రమేష్‌బాబు, ఎలక్ట్రికల్ విభాగాధిపతి మహేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
భక్తులకు ఇబ్బందులు లేకుండా చూద్దాం
విజయవాడ (లబ్బీపేట) : పుష్కరాల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని, భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడటం మన బాద్యత అని నగర జాయింట్ పోలీస్ కమిషనర్ ఏ.శ్రీహరికుమార్ అన్నారు. బందరురోడ్డులోని శ్రీదుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో గురువారం తెలుగు, హింధీ విభాగాల ఆధ్వర్యంలో ‘తెలుగు, హిందీ సాహిత్యాలు – నదీ ప్రాశస్త్యం – పర్యావరణ చైతన్యం’ అనే అంశంపై జాతీయ సదస్సు జరిగింది. ప్రిన్సిపాల్ టి.విజయలక్ష్మి అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రీహరికుమార్ జ్యోతి వెలిగించి సదస్సు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత విద్యార్థులదేనన్నారు. అతిథి, ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ ప్రతినిధి గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయం ఎంతో గొప్పదన్నారు. మరో అతిథి జె.ఆత్మారామ్ మాట్లాడుతూ ఒక అశ్వమేధ యాగం చేస్తే ఎంత ఫలితం వస్తుందో.. పుష్కర స్నానం చేయడం వల్ల అంతే ఫలితం వస్తుందని చెప్పారు. సదస్సులో సిద్ధార్థ అకాడమీ జాయింట్ సెక్రటరీ ఎన్.లలితప్రసాద్, రాజగోపాల్ చ్రM] వర్తి, వై.పూర్ణచంద్రరావు, వలివేలి వెంకటేశ్వరరావు తదితరులు ప్రసంగించారు. తెలుగు, హిందీ విభాగాధిపతులు డాక్టర్ ఎ.నాగజ్యోతి, రామలక్ష్మి పాల్గొన్నారు. -
24న జిల్లాస్థాయి జాతీయ సైన్స్ సెమినార్
విద్యారణ్యపురి : రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (ఎస్సీఈఆర్టీ) ఆదేశానుసారం సుస్థి ర ఆహార భద్రతలో పప్పు ధాన్యాలు – అవకాశాలు సవాళ్లు అనే అంశంపై జిల్లా స్థాయి జాతీయ సైన్స్ సెమినార్‌ను ఈనెల 24న హన్మకొండ డైట్ కళాశాలలో నిర్వహించనున్నట్లు డీఈఓ పి. రాజీవ్ తెలిపారు. ఈ సెమినార్లో పాల్గొనేందుకు 8, 9, 10 తరగతుల విద్యార్థులే అర్హులన్నారు. పాఠశాల స్థాయిలో ఈసైన్స్ సెమినార్‌ను ఈనెల 11 లోగా, డివి జన్ స్థాయిలో ఈనెల 18 లోగా నిర్వహించుకోవాలన్నారు. పాఠశాల స్థాయిలో హెచ్ఎం లు, ప్రిన్సిపాల్స్, డివిజన్ స్థాయిలో డిప్యూటీ ఈఓల ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉంటుం దన్నారు. పాఠశాల స్థాయిలో ప్రథమ బహుమతి సాధించిన వారు డివిజన్ స్థాయికి అర్హులని, డివిజన్ స్థాయిలో మొదటి ఐదు స్థానా ల్లో నిలిచిన వారు జిల్లాస్థాయికి అర్హులని వివరించారు. జిల్లాస్థాయి సె మినార్‌లో మొదటి, రెండు స్థానాలు లభించి న విద్యార్థులను ఈనెల 30న నిర్వహించే రాష్ట్ర స్థాయి జాతీయ సెమినార్‌కు పంపిస్తామని, ఒక్కో విద్యార్థి ఆరు నిమిషాలు మాట్లాడాలని, నిపుణులు ప్రశ్నలు అడుగుతారని తెలిపారు. -
భాషను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం
మధురానగర్: మన భాషను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని భాషను నిర్లక్ష్యం చేస్తే సంస్కృతికి ప్రమాదమని ఏఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంకర్ పేర్కొన్నారు. మాచవరం ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాలలో సోమవారం తెలుగు, ఇంగ్లిషు, సంస్కృతం, హిందీ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ వల్లూరుపల్లి రవి అధ్యక్షతన భాషాబోధనలో సవాళ్ళు అనే అంశంపై జాతీయ సదస్సు జరిగింది. కార్యక్రమంలో డాక్టర్ ఎస్. శంకర్ పాల్గొని కీలకోపన్యాసం చేశారు. భాషాబోధనలో ఉండే సవాళ్ళు, పరిష్కార మార్గాలను అందరికీ అర్థమయ్యేరీతిలో వివరించారు. తెలంగాణకు చెందిన డాక్టర్ కోయి కోటేశ్వరరావు మాట్లాడుతూ భాష అనే చెట్టు ఫలాలను భక్షించటం కాదు దాని తల్లివేరును పరిరక్షించాలని అన్నారు. హిందీ భాషా నిపుణులు డాక్టర్ డి. నాగేశ్వరరావు, డాక్టర్ పి. శ్రీనివాసరావు హిందీభాషలోని తమ అనుభవాలను వివరించారు. అనంతరం తెలుగు, ఇంగ్లిషు, హిందీ , సంస్కృతం విభాగాలు వేర్వేరుగా నిర్వహించిన సాంకేతిక సదస్సులు ఆలోచింపచేసే విధంగా సాగాయి. సదస్సులో రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఆచార్యులు, అధ్యాపకులు పత్రాలను సమర్పించారు. అలాగే విద్యార్థులు భార్గవ్, మనీషా, ఇందిరాదేవి సమర్పించిన పత్రాలను పలువురు పెద్దలు ప్రశంసించారు. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో కృష్ణాజిల్లా రచయితల సంఘం కార్యదర్శి డాక్టర్ జీ వీ పూర్ణచంద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన భాషా చరిత్రలోని విశేషాలను వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ వి. శంకరరావు (చెన్నై), డాక్టర్ పి. శ్రీనివాసరావు , డాక్టర్ పలపర్తి శ్యామలానంద ప్రసాద్, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, తదితరులు పాల్గొని మాట్లాడారు. -
‘సోషల్ మీడియా’ బలమైన సాధనం
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్ : సామాజిక మాధ్యమాలు (సోషల్ మీడియా) కేవలం సమాచార ప్రసారం కోసం మాత్రమే కాకుండా ప్రపంచగతిని మార్చే శక్తిమంత సాధనాలుగా ఎదిగాయని ప్రముఖ జర్నలిజం అధ్యాపకులు పీఎల్ విశ్వేశ్వరరావు అన్నారు. తెలంగాణ యూ నివర్సిటీ మాస్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ‘సామాజిక మాధ్యమాలు-సవాళ్లు, సమస్యలు’ అనే అంశంపై రెండు రోజుల జాతీ య స్థాయి సెమినార్ ను ప్రారంభించారు. సెమినార్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సమాజంలో సోషల్ మీడియా రాజకీయ, ఆర్థిక, సామాజిక సాంస్కృతిక రంగాలపై బలమైన ప్రభావాన్ని చూపుతోందన్నారు. దేశంలో 92 వేల పత్రికలు, 825 టెలివిజన్ చానళ్లు ఉన్నాయని, అయితే ఈ ప్రసార మాధ్యమాలు కొద్దిమంది బలవంతులు,ధనవంతుల గుప్పిట్లోనే ఉండటం విచారకమన్నారు. బాధితులు, సామాన్యులకు అండ గా ఉండాల్సిన మీడియా... కొన్ని ఒత్తిడిల కారణంగా వారి పక్షా న్ని విస్మరించడం తగదన్నారు. సంప్రదాయబద్ధమైన మీడియా నిర్వహించని కొన్ని బాధ్యతల్ని సోషల్ మీడియా నిర్వహిస్తుందన్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా వార్త వేగవంతంగా ప్రపంచమంతా చేరుకోగలిన శక్తి ఉండటం వల్లే సోషల్‌మీడియా బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందన్నారు. సోషల్ మీడియాకు సామాజిక బాధ్యతలు ఉన్నాయని, వీటిని గుర్తించకపోతే సమాజంలో విపరీత పరిణామాలు తప్పవన్నారు. దుర్వినియోగం కాకుండా చూడాలి సీనియర్ పాత్రికేయురాలు, హక్కుల కార్యకర్త డాక్టర్ అఖిలేశ్వరి ఈ సదస్సులో కీలకోపాన్యాసం చేశారు. సైబర్ సాంకేతిక రంగంలోని అనివార్యతల కారణంగా సోషల్ మీడియా దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. సోషల్ మీడియా ద్వారా కూడా మహిళలపై వివక్ష, వేధింపులు కొనసాగుతుండడం విచారకరం అన్నారు. విద్యార్థులు, యువత సోషల్ మీడియాను వివేకంతో సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని ఆమె సూచించారు. బలపడుతోంది.. సమాచార రంగంలో సంప్రదాయ మీడియాకు ప్రత్యామ్నాయంగా సోషల్ మీడియా బలపడుతోందని సమాచార హ క్కు చట్టం రాష్ట్ర మాజీ కమిషనర్, ‘సాక్షి’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి అన్నారు. సోషల్ మీడియా ద్వారా లభ్యమయ్యే మంచి ఫలితాలను మాత్రమే స్వీకరించాలని ఆయన సూచించారు. గల్ఫ్ దేశాల్లో వచ్చిన విప్లవాల్లో సోషల్ మీడియా పాత్ర ఎంతో ఉందన్నారు. తెయూ ప్రిన్సిపాల్ ధర్మరాజు ఈ సెమినార్‌కు అధ్యక్షత వహించారు. మాస్ కమ్యూనికేషన్ విభాగం అధ్యక్షుడు,సెమినార్ డెరైక్టర్ ప్రొఫెసర్ కే.శివశంకర్ సదస్సు లక్ష్యాల్ని వివరించారు. సదస్సులో పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పలువురు తమ పరిశోధనా పత్రాల్ని సమర్పించారు. -
కాకతీయుల పరిజ్ఞానం అద్భుతం
=ఆర్ఈసీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ {పొఫెసర్ పీజీ శాస్త్రి =నిట్‌లో ‘కాకతీయుల నీటిపారుదల వ్యవస్థ-సాంకేతికత’ అంశంపై సదస్సు నిట్ క్యాంపస్, న్యూస్‌లైన్ : కాకతీయులు ప్రజాసంక్షేమ పాలకులు.. వారి ఇరిగేషన్ టెక్నాలజీ ప్రపంచ నీటిపారుదల రంగంలో ఒక అద్భుతమని రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపా ల్ ప్రొఫెసర్ పీజీ శాస్త్రీ అన్నారు. శనివారం వరంగల్‌లోని నేషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ)లో ‘కాకతీ యుల నీటిపారుదల వ్యవస్థ-సాంకేతికత’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సెమినార్‌ను మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా కాకతీయుల నీటిపారుదల వ్యవస్థను.. సాంకేతిక విధానాన్ని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం పీజీ శాస్త్రీ మాట్లాడుతూ కాకతీయుల నీటిపారుదల రంగం.. అతి తక్కువ ఖర్చుతో పర్యావరణ రంగానికి దోహ దం చేసే విధానమని పేర్కొన్నారు. కాకతీయులు అప్పట్లోనే విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గొలుసుకట్టు చెరువులు నిర్మించారని చెప్పారు. కరువు సమయాల్లోనూ నీటి సంక్షోభం ఎదుర్కోకపోవడానికి కార ణం పటిష్టమైన నీటిపారుదల వ్యవస్థే అని అన్నారు. వెయ్యి సంవత్సరాలైనప్పటికీ కాకతీయులు నిర్మించిన చెరువులు, కుంటలు వరంగల్‌లో ఇప్పటికీ ప్రధాన జలాశయాలుగా ఉన్నాయని, వ్యవసాయరంగానికి ఉపకరించే సాగునీటి వనరులు అవేనని చెప్పారు. రాజ్యసభ సభ్యు డు రాపోలు ఆనంద భాస్కర్ మాట్లాడుతూ కాకతీయుల ఇరిగేషన్ టెక్నాలజీని ఎన్ఐటీలో సిలబస్‌గా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వారి టెక్నాలజీకి తగిన ప్రాధాన్యం ఇస్తామన్నా రు. కాకతీయుల నీటిపారుదల వ్యవస్థ భవిష్యత్ తరాల కు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించిందన్నారు. కలెక్టర్ కిషన్ మాట్లాడుతూ వర్షాధార నీటిని నిలువచేసి నదీ జలాలపై ఆధారపడకుండా కాకతీయులు చెరువులు నిర్మించి నీటిపారుదల రంగానికి ఆధ్యులుగా నిలిచారని అన్నారు. వారి నిర్మించిన వ్యవస్థను డాక్యుమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉందని, దానితో భవి ష్యత్ తరాలకు అవగాహన కల్పించవచ్చని అభిప్రాయపడ్డారు. వరంగల్ రేంజ్ డీఐజీ కాంతారావు మాట్లాడుతూ కాకతీయుల చెరువులను శ్రీకృష్ణదేవరాయలు మార్గదర్శకంగా తీసుకున్నారని, రాయలసీమలో కూడా చెరువులు, కుంటలు కనపడుతాయన్నారు. అనంతపురంలో కాకతీ యుల నీటిపారుదల టెక్నాలజీ కనపడుతుందని చెప్పారు. సదస్సులో ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, నిట్ ఇన్చార్జ్ డెరైక్టర్ రమేష్, ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావు, సెమినార్ కన్వీనర్ ప్రొపెసర్ కేవీ.జయకుమార్, సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ హెడ్ దేవప్రతాప్, రిటైర్డ్ ఇంజినీర్లు, చరిత్రకారులు పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా పరిశోధన పత్రాల పుస్తకాన్ని ఆవిష్కరించారు.