అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో ‘ఎలక్ట్రో–ప్యాడ్ 2కే16’ పేరుతో గురువారంlజాతీయ సదస్సు నిర్వహించారు.
ఎస్కేయూ : అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో ‘ఎలక్ట్రో–ప్యాడ్ 2కే16’ పేరుతో గురువారంlజాతీయ సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్‌టీయూ పులివెందుల ప్రొఫెసర్ గణేష్ హాజరై మాట్లాడారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో వస్తున్న మార్పుల గురించి పరిశోధనలకు గల అవకాశాల గురించి వివరించారు.
విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ ప్రాజెక్టుల ప్రొటో టైప్ మోడల్స్‌ను పరిశీలించి అభినందించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ అనంతరాముడు, డైరెక్టర్ రమేష్‌నాయుడు, ప్రిన్సిపాల్ డాక్టర్ బండి రమేష్‌బాబు, ఎలక్ట్రికల్ విభాగాధిపతి మహేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.