ఎల్రక్టానిక్ వస్తువులపైనా చలి ప్రభావం ఎక్కువే
విపరీతమైన చలిలో ఫోను ఎక్కువ సమయం ఉంటే షట్‌డౌన్ అయ్యే ఛాన్స్
పెళుసుగా ఉండే ఫోను స్క్రీన్లపై పగుళ్లకు అవకాశం
స్మార్ట్‌వాచ్‌లు, ల్యాప్‌టాప్, కెమెరాలపైనా చలి ప్రభావం
అతి చలిలో స్మార్ట్ ఫోన్లలో తగ్గిపోనున్న సెన్సార్ సామర్థ్యం
చలికాలంలో ఫోన్ బ్యాటరీ మన్నిక కావాలంటే తరుచూ చార్జింగ్ పెట్టాలంటున్న నిపుణులు
ఎండలకు రాళ్లు కూడా పగులుతాయని విన్నాం. కానీ.. చలికి ఫోన్లు సైతం పగిలిపోతాయట. వేసవితో పోలిస్తే శీతాకాలంలో స్మార్ట్‌ఫోన్లు కిందపడితే స్క్రీన్‌లు అత్యంత సులభంగా పగిలిపోతాయని ఎలక్ట్రానిక్ నిపుణులు చెబుతున్నారు. ఫోన్లతో పాటు స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల పనితీరుపై చలి తీవ్ర ప్రభావాన్నే చూపుతాయని పేర్కొంటున్నారు.
చలికాలం వచ్చిందంటే చాలామంది ఆరోగ్య విషయాల్లో అనేక జాగ్రత్తలు తీసుకుంటారని.. ఇకపై చలికాలంలో స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, అమరావతి
విలువైన డేటా కోల్పోయే అవకాశం
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఏ సమాచారమైనా పేపర్ డాక్యుమెంట్ల రూపంలో భద్రపరుచుకోవడం కంటే.. వాటిని ఫోన్లు లేదా వ్యక్తిగత కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో సేవ్ చేసుకుని భద్రపరచుకుంటుంటాం.
అయితే ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో ఉండే హార్డ్ డ్రైÐవ్‌లు కొన్ని సందర్భాల్లో విపరీతమైన చలికి ప్రభావితమై పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది. దీంతో హార్డ్ డ్రైవ్‌లలో మాత్రమే నిక్షిప్తమై ఉండే మన విలువైన సమాచారం, డాక్యుమెంట్లను పూర్తిగా తిరిగి చూడడానికి వీలులేని విధంగా నష్టపోయే అవకాశం ఉంటుంది.
ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఉపయోగించేవారు తాము వాడేవి కొత్తవి కదా అని అజాగ్రత్త ఉండొచ్చు. కానీ, కొత్తవి అయినంత మాత్రాన చలికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకోవడం కేవలం అపోహేనట. కొత్త ఎల్రక్టానిక్ పరికరాలు కూడా విపరీతమైన చలి పరిస్థితుల్లో వాటి పనితీరు తగ్గుముఖం పట్టవచ్చని నిఫుణులు పేర్కొంటున్నారు.
చలి విపరీతంగా ఉంటే ఫోను ఆగిపోయే ఛాన్స్
» ఫోన్‌లు, స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌ల ఎల్‌సీడీ, ఓఎల్‌ఈడీ స్కీన్లు నిదానంగా పనిచేయడం వల్ల ఆ సమయంలో వాటిని ఉపయోగిస్తున్నప్పుడు ఆ పరికరాల స్కీన్లపై కనిపించే బొమ్మలు, అక్షరాల నాణ్యత, స్పష్టత సరిగా ఉండకపోయే అవకాశం ఉంది.
» ప్రమాదవశాత్తు స్మార్ట్ ఫోను వంటివి కిందపడితే వేసవి కాలంలో కంటే శీతాకాలంలో వాటి స్క్రీన్‌లు అత్యంత సులభంగా పగిలిపోతాయి.
» ఎలక్ట్రానిక్ పరికరాలను వేలిముద్రల గుర్తింపు, ముఖ గుర్తింపు ద్వారానే త్వరగా అన్, ఆఫ్ అయ్యేలా పెట్టుకుంటాం. కానీ.. ఎక్కువ చలి సమయంలో సెన్సార్ విధానం సరిగా పనిచేయక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌లు వంటి ధరించగలిగేవి విపరీతమైన చలిలో కచి్చతమైన రీడింగ్‌లను తెలపలేవు.
» కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లో ఉపయోగించే హార్డ్ డ్రైవ్‌లు చలి ప్రభావంతో ఆలస్యంగా ఓపెన్ కావడం వంటి పరిస్థితులు తలెత్తుతాయి.
» ఎల్రక్టానిక్ వస్తువులలో ఉండే సున్నితమైన, అతి సున్నితమైన సర్క్యూట్లు చలికి తుప్పు పట్టే అవకాశం ఉండటంతో ఆయా వస్తువులు పూర్తిగా పనిచేయకుండా పోయే అవకాశం ఏర్పడుతుంది.
» కెమెరాలు సైతం చలి తగ్గి ఎండ పెరిగే కొద్దీ వాటి అద్దాలపై పొరగా ఏర్పడే పొగమంచు ఫొటోల్లోని బొమ్మ నాణ్యతను ప్రభావితం చేస్తుంది.
» ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లలో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీలు చల్లని ఉష్ణోగ్రతలలో పేలవంగా పనిచేస్తాయని, విపరీతమైన చలిలో బ్యాటరీ తాత్కాలికంగా పనిచేయడం ఆగిపోవచ్చు లేదా శాశ్వతంగా దెబ్బతినే అవకాశం ఉంది.
» స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్ బడ్‌లు వేగంగా బ్యాటరీ నష్టానికి గురికావడంతో అవి పనిచేయడంలో ఎక్కువగా అవాంతరాలు ఏర్పడే వీలుంది.
» ఎలక్రానిక్ పరిరకాలకు ఉపయోగించే గాజు, ప్లాస్టిక్ వంటివి చలికి పెళుసుబారి చిన్న ఒత్తిడికే పగుళ్లు లేదా విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఇలా చేయడం బెటర్
» చలికి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వ్యక్తిగతంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో.. ఎల్రక్టానిక్ పరికరాల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని నిఫుణులు సూచిస్తున్నారు.
» శీతాకాలంలో ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లకు సాధారణ కన్నా ఎక్కువసార్లు చార్జింగ్ పెడుతూ ఉండాలి. ఎక్కువ కాలం పాటు గడ్డకట్టే చలికి పరికరాలను బహిర్గతం చేయకుండా ఉంచాలి. తప్పనిసరిగా బయటకు తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు చలి సోకని కవర్లలో వాటిని ఉంచాలి.
» చలికాలంలో స్మార్ట్ ఫోన్లు సహా అన్ని ఎల్రక్టానిక్ వస్తువులను ఆరుబయట చలిలో ఎక్కువ సమయం వినియోగించాల్సి వస్తే.. ఇంటికి చేరుకోగానే వాటిని శుభ్రం చేయడం మంచిదని సూచిస్తున్నారు.
» చల్లటి పరిస్థితులను తట్టుకునేలా రూపొందించిన ఎల్రక్టానిక్ పరికరాలను కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment