భక్తులకు ఇబ్బందులు లేకుండా చూద్దాం
భక్తులకు ఇబ్బందులు లేకుండా చూద్దాం
Published Thu, Aug 4 2016 9:36 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
విజయవాడ (లబ్బీపేట) : పుష్కరాల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని, భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడటం మన బాద్యత అని నగర జాయింట్ పోలీస్ కమిషనర్ ఏ.శ్రీహరికుమార్ అన్నారు. బందరురోడ్డులోని శ్రీదుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో గురువారం తెలుగు, హింధీ విభాగాల ఆధ్వర్యంలో ‘తెలుగు, హిందీ సాహిత్యాలు – నదీ ప్రాశస్త్యం – పర్యావరణ చైతన్యం’ అనే అంశంపై జాతీయ సదస్సు జరిగింది. ప్రిన్సిపాల్ టి.విజయలక్ష్మి అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రీహరికుమార్ జ్యోతి వెలిగించి సదస్సు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత విద్యార్థులదేనన్నారు. అతిథి, ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ ప్రతినిధి గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయం ఎంతో గొప్పదన్నారు. మరో అతిథి జె.ఆత్మారామ్ మాట్లాడుతూ ఒక అశ్వమేధ యాగం చేస్తే ఎంత ఫలితం వస్తుందో.. పుష్కర స్నానం చేయడం వల్ల అంతే ఫలితం వస్తుందని చెప్పారు. సదస్సులో సిద్ధార్థ అకాడమీ జాయింట్ సెక్రటరీ ఎన్.లలితప్రసాద్, రాజగోపాల్ చ్రM] వర్తి, వై.పూర్ణచంద్రరావు, వలివేలి వెంకటేశ్వరరావు తదితరులు ప్రసంగించారు. తెలుగు, హిందీ విభాగాధిపతులు డాక్టర్ ఎ.నాగజ్యోతి, రామలక్ష్మి పాల్గొన్నారు.
Advertisement