Siddhartha College
-
విజయవాడ : సిద్ధార్థ కళాశాలలో ఉత్సాహంగా నృత్యోత్సవం 2024 (ఫొటోలు)
-
విజయవాడలోని పీబీ సిద్ధార్థ కాలేజీలో సంక్రాంతి సంబరాలు
-
విజయవాడ : సిద్ధార్థ కళాశాలలో ఉత్సాహంగా బ్లిట్జ్ క్రీగ్–2023 (ఫొటోలు)
-
విజయవాడ : ఉత్సాహంగా సిద్ధార్థ ఫెట్–2022 (ఫొటోలు)
-
హ్యాండ్‌బాల్ టోర్నీ ప్రారంభం
విజయవాడ స్పోర్ట్స్ : కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల పురుషుల హ్యాండ్‌బాల్ టోర్నీ స్థానిక పీబీ సిద్ధార్థ కళాశాలలో ఆదివారం ప్రారంభమైంది. ఈ పోటీలను సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటగాళ్లు గెలవాలన్న తపనతోపాటు క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలన్నారు. లక్ష్యాలను నిర్దేశించుకుని నిత్యం సాధన చేసి రాణించాలన్నారు. పీబీ సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రమేష్, కళాశాల డైరెక్టర్ వేమూర్తి బాబురావు, ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.రవి, కృష్ణా యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎన్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తొలి రోజు ఫలితాలు : నాకౌట్ మ్యాచ్‌లో సప్తగిరి కళాశాల జట్టుపై 6-24 తేడాతో పీబీ సిద్ధార్థ కళాశాల జట్టు గెలుపొందింది. లీగ్ మ్యాచ్‌ల్లో శాతవాహన కళాశాల జట్టుపై 18-35 తేడాతో కేబీఎన్ కళాశాల జట్టు విజయం సాధించింది. ఎస్ఆర్ఆర్ కళాశాల–పీబీ సిద్ధార్థ కళాశాల జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా, లైట్ ఫెయిల్ కావడంతో రేపటికి వాయిదా వేశారు. -
చిన్నతనం నుంచే దేశభక్తిని పెంపొందించుకోవాలి
విజయవాడ (మొగల్రాజపురం) : చిన్నతనం నుంచే ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని భారత్lవికాస్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు జీడీవీ ప్రసాదరావు అన్నారు. శుక్రవారం పీబీ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో భారత్∙వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో జాతీయ బృందగాన పోటీలు జరిగాయి. ప్రసాదరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడానికి తమ పరిషత్ ఆధ్వర్యంలో 1967 నుంచి ఈ విధంగా విద్యార్థులకు దేశభక్తి గీతాల పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశ ప్రజలంతా ఐకమత్యం, సోదరభావంతో మెలగాలనే ఉద్దేశంతోనే స్వచ్ఛందంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్షీ్మనారాయణ మాట్లాడుతూ నగరంలోని సుమారు 25 పాఠశాలల నుంచి 250 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారన్నారు. ఈ పోటీల్లో విజేతలైన వారు ఈ నెల 23వ తేదీ వైజాగ్‌లో జరిగే రాష్ట్ర స్థాయి బృందగాన పోటీల్లో పాల్గొంటారని వివరించారు. త్వరలో పూనేలో జాతీయ స్థాయిలో ఈ బృందగాన పోటీలు జరుగుతాయని తెలిపారు. హిందీ, తెలుగు భాషల్లో విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించారు. కార్యక్రమంలో పరిషత్ సభ్యులు వి.సన్యాసిరాజు, పేర్ల భీమారావు, శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
సాఫ్ట్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక పూర్తి
ఉయ్యూరు : సాఫ్ట్‌బాల్ బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక పూర్తయిందని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.పురుషోత్తమ్ తెలిపారు. స్థానిక ఏజీఅండ్‌ఎస్‌జీ సిద్ధార్థ కళాశాల క్రీడా మైదానంలో 2016–17 సంవత్సరానికి ఎస్జీఎఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్ సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపిక శనివారం నిర్వహించారు. అండర్ 14, 17 విభాగాల్లో జట్ల వివరాలను పురుషోత్తమ్ వెల్లడించారు. అండర్ 14లో.. బాలుర విభాగంలో : జి.గోపీకృష్ణ, కె.హేమంత్, ఎ.మణికంఠ, ఎం.శశికుమార్, ఎస్.వంశీ, బి.రమేష్, సీహెచ్ వీరనారాయణ, కె.సురేంద్రబాబు, బి.నాగవరప్రసాద్, జె.భరత్, ఎస్.మహేష్, డి.అశ్విత్, జీఆర్‌వీ సుభాష్, బి.జాష్వ, పి.గోపి, బి.సాల్మన్ విక్టర్, స్టాండ్‌బైగా డి.యశ్వంత్ కుమార్, కె.భాస్కర్ ఎంపికయ్యారు. బాలికల విభాగంలో : కె.పల్లవి, డి.గౌతమి, ఎస్.మానస, ఆర్.నాగలక్ష్మి, కె.పవత్రి, కె.కనకదుర్గ, ఎన్.సారిక, కె.సింధుజ, టి.నాగలక్ష్మి, కె.సింధు, ఎస్.పూర్ణిమ, జి.షీభారాణి, కె.లక్ష్మి, వి.శివపార్వతి, ఎస్.శ్రీచైతన్య, వి.నందిని, ఎస్.లిఖిత, జి.రమ్య, కె.పావనిని ఎంపిక చేశారు. అండర్ 17లో.. బాలుర విభాగంలో : కేవీవీ నాగమల్లేశ్వరరావు, కేవీవీఎన్వై ప్రసాద్, డీఎన్టీ గణేష్, పి.ప్రవీణ్‌బాబు, టి.రవితేజ, టి.లక్ష్మణ్‌రాజు, కె.సురేష్, జి.నందకుమార్, వి.శ్రీనివాసరావు, డి.ఆకాష్, పి.మహేష్, ఎన్.హరికృష్ణ, ఎస్.వినయ్, ఎ.శివరామకృష్ణ, జె.రవితేజ, పూర్ణగణేష్, స్టాండ్‌బైగా బి.లక్ష్మీనరసింహ, ఎస్.రాహుల్, వి.రవికుమార్ స్థానం సాధించారు. బాలికల విభాగంలో : కె.మనీషా, యు.శిరీషా, ఎన్.సాహితీ, కె.నళిని, ఎన్.నందిని, సీహెచ్ మానస, పి.మాధురిశ్రీ, పి.పద్మప్రణిత, బి.కోమలి, టి.ప్రత్యూష, టి.రాజేశ్వరి, ఆర్.కళ్యాణి, ఎల్.నాగమాధురి, వి.నవ్య, ఎస్.దేవిశ్రీ, టి.జయశ్రీ, స్టాండ్‌బైగా సీహెచ్ లావణ్య, టి.కనకదుర్గ, పి.సునీత ఎంపికయ్యారు. -
కులాల్లేని అంబేడ్కరిజం రావాలి
విజయవాడ (మొగల్రాజపురం): కులతత్వం పోయి అందరిని సమానంగా చూసే అంబేడ్కరిజం రావాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం అన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 125వ జయంత్సోవాల సందర్భంగా గురువారం సాయంత్రం మొగల్రాజపురం పి.బి.సిద్ధార్ధ కళాశాల ఆవరణలోని ఆడిటోరియంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమి ఆధ్వర్యంలో ‘సంఘం శరణం గఛ్చామి’ పేరుతో కళా రూపకం ప్రదర్శించారు. అంబేడ్కర్ జీవితం, ఆశయాలను కళాకారులు ప్రదర్శించారు. అంబేడ్కర్ జీవితాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపారు. సమరం మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను నేటి తరం నాయకులు ఆచరించాలన్నారు. ఇలాంటి సందేశాత్మక రూపకాలు ప్రతి చోట ప్రదర్శించాలని, అప్పుడు విద్యార్థులు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ కావాలని కోరుకుంటారని అన్నారు. ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి మాట్లాడుతూ అంబేడ్కర్ ఆ కాలంలో ఎదుర్కొన్న సంఘటనలే నేటి సమాజంలోనూ దర్శనమివ్వడం చాలా దురదృష్టకరమన్నారు. -
చిన్న పరిశ్రమలపై దృష్టి పెట్టండి
విజయవాడ (లబ్బీపేట) : విద్యార్థులు చదువు పూర్తవగానే ఉద్యోగాల కోసం చూడకుండా చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ న్యూ ఢిల్లీలోని ఎన్ఎస్ఐసీ రిసోర్స్ పర్సన్ జి.సుదర్శన్ సూచించారు. స్థానిక మహాత్మా గాంధీ రోడ్డులోని శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో ఎన్ఎస్ఐసీ ఆధ్వర్యాన బుధవారం కామర్స్ విద్యార్థులకు బుధవారం ఎంటర్ప్రెన్యూర్ ఓరియెంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న తరహా పరిశ్రమలను ఏ విధంగా ప్రారంభించాలి, ఫైనాన్స్‌ను ఏ విధంగా పొందాలి, ముద్ర, బ్యాంకులు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎన్ఎస్ఐసీ నుంచి సహాయ సహకారాలు పొందే విధానం గురించి సుదర్శన్ వివరించారు. ఎంఎస్ఎంఈ, టీసీవో, డీఐసీ, ఎన్జీవోల నుంచి శిక్షణ కూడా పొందవచ్చని తెలిపారు. విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా పరిశ్రమలు స్థాపించి సొంతగా అభివృద్ధి సాధించాలని, పది మందికి ఉపాధి కల్పించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ టి.విజయలక్ష్మి, కామర్స్ విభాగాధిపతి టి.రమాదేవి, ఇతర అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. -
భక్తులకు ఇబ్బందులు లేకుండా చూద్దాం
విజయవాడ (లబ్బీపేట) : పుష్కరాల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని, భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడటం మన బాద్యత అని నగర జాయింట్ పోలీస్ కమిషనర్ ఏ.శ్రీహరికుమార్ అన్నారు. బందరురోడ్డులోని శ్రీదుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో గురువారం తెలుగు, హింధీ విభాగాల ఆధ్వర్యంలో ‘తెలుగు, హిందీ సాహిత్యాలు – నదీ ప్రాశస్త్యం – పర్యావరణ చైతన్యం’ అనే అంశంపై జాతీయ సదస్సు జరిగింది. ప్రిన్సిపాల్ టి.విజయలక్ష్మి అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రీహరికుమార్ జ్యోతి వెలిగించి సదస్సు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత విద్యార్థులదేనన్నారు. అతిథి, ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ ప్రతినిధి గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయం ఎంతో గొప్పదన్నారు. మరో అతిథి జె.ఆత్మారామ్ మాట్లాడుతూ ఒక అశ్వమేధ యాగం చేస్తే ఎంత ఫలితం వస్తుందో.. పుష్కర స్నానం చేయడం వల్ల అంతే ఫలితం వస్తుందని చెప్పారు. సదస్సులో సిద్ధార్థ అకాడమీ జాయింట్ సెక్రటరీ ఎన్.లలితప్రసాద్, రాజగోపాల్ చ్రM] వర్తి, వై.పూర్ణచంద్రరావు, వలివేలి వెంకటేశ్వరరావు తదితరులు ప్రసంగించారు. తెలుగు, హిందీ విభాగాధిపతులు డాక్టర్ ఎ.నాగజ్యోతి, రామలక్ష్మి పాల్గొన్నారు. -
సిద్ధార్థ ఫ్రెషర్స్ డే వేడుకలు
-
రూ.25 లక్షలతో శాటిలైట్ బస్‌స్టేషన్
కానూరు (పెనమలూరు) : పుష్కరాలను పురస్కరించుకుని కానూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో రూ.25 లక్షలతో శాటిలైట్ బస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులను ఆర్టీసీ ఉన్నతాధికారులు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సాపురం, భీమవరం, అవనిగడ్డ, మచిలీపట్నం, గుడివాడ తదితర ప్రాంతాల నుంచి పుష్కరాలకు వచ్చే యాత్రికులు ఇక్కడ బస్సు దిగాల్సి ఉంటుందన్నారు. ఇక్కడి నుంచి విజయవాడ పుష్కర ఘాట్లకు ప్రత్యేకంగా సిటీ బస్సులు నడుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్.వెంకటేశ్వరరావు, ఈడీ ఆపరేషన్స్ జయరావు, కృష్ణా రీజినల్ మేనేజర్ పీవీ రామారావు, సీఎంఈవో ప్రసాద్, డివిజనల్ మేనేజర్ శ్రీరాములు, సివిల్ ఇంజినీర్ శాస్త్రి, గవర్నర్‌పేట డిపో వన్ మేనేజర్ చరణ్ పాల్గొన్నారు. -
లలిత కళలను పోషిస్తేనే గుర్తింపు
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ విజయవాడ కల్చరల్ : ప్రజా సంక్షేమ పథకాల అమలుతోపాటు, లలిత కళలను పోషించినప్పుడే పాలకులు చరిత్రలో మిగిలిపోతారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్ర కుమార్ అన్నారు. తెలుగు ప్రపంచ చిత్రకారుల సమాఖ్య (ట్యాప్) ఆదివారం సిద్ధార్థ కళాశాలలో నిర్వహించిన చిత్రకళా ప్రదర్శన, ఉగాది పురస్కార సభలో ఆయన ముఖ్యఅతి థిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రకుమార్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ జీవించే కళను నేర్చుకోవాలని సూచించారు. ఇవ్వడంలో ఉన్న ఆనందం తీసుకోవడంలో ఉండదన్నారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజా సంక్షేమ పథకాల అమలుతోపాటు, లలిత కళలను పోషించినప్పుడే పాలకులు చరిత్రలో మిగిలిపోతారని పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవరాయలు, అశోకుడు కళలను, కళాకారులను గౌరవించడం వల్లే చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. పాలకులు ఆదిశగా అడుగులు వేయాలని కోరారు. చిత్రకారులు, కవులు ప్రతి సమాజిక సమస్యపైనా స్పందించి దానికి ఒక రూపం ఇస్తారని, అదే చరిత్రలో మిగిలిపోతుందని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకూ ప్రత్యేకంగా లలితకళా అకాడమీలు ఉండాలని ఆకాంక్షించారు. ఆంధ్రరాష్ట్రంలో ఏర్పడిన లలితకళా అకాడమీని సీమాంధ్రకు తరలించాలని, అప్పుడే కళాకారులకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. సీనియర్ పాత్రకేయుడు తుర్లపాటి కుటుంబరావు మాట్లాడుతూ 1993లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ అకాడమీలను రద్దుచేసిందని గుర్తుచేశారు. వాటిని పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల తరుఫున కోరుతున్నానని అన్నారు. బీసీ సంక్షేమం, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాల్లాడుతూ కళలు, కళాకారులను ప్రతి ఒక్కరూ గౌరవిం చాలని కోరారు. తెలుగు ప్రపంచ చిత్ర కళాకారుల సమాఖ్య నిర్వహణలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు, ప్రసిద్ధ చిత్రకారుడు తోట వైకుంఠం, సి.ఎస్.ఎన్.పట్నాయక్, ఎస్.ఎం. పీరన్కు ఈ సందర్భంగా ఉగాది పురస్కారాలు అందజేశారు. ఆకట్టుకున్న చిత్రకళా ప్రదర్శన సీమాంధ్రలోని 13 జిల్లాల నుంచి వచ్చిన చిత్రకారుల తాము రూపొందించిన వందలాది చిత్రాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. రాష్ట్రవిభజన నేపథ్యంలో ఆళ్లగడ్డకు చెందిన విజయ్ చిత్రించిన దగాపడ్డ తమ్ముడు చిత్రం పలువురి ప్రశంశలు అందుకుంది. సాయంత్రం జరిగిన కళాకారుల సదస్సులో పలుకీలకమైన నిర్ణమాలు తీసుకున్నారు. లలిత కళాల అకాడమీని పుననుద్ధరించాలని, కళాకారులకు సముచితమైన స్థానం ఇవ్వాలని, 13 జిల్లాప్రతినిధులతో కమిటీ ఏర్పాటుచేసి, కళాకారుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.