కులాల్లేని అంబేడ్కరిజం రావాలి
కులాల్లేని అంబేడ్కరిజం రావాలి
Published Fri, Sep 9 2016 5:27 PM | Last Updated on Tue, Jun 4 2019 6:28 PM
విజయవాడ (మొగల్రాజపురం): కులతత్వం పోయి అందరిని సమానంగా చూసే అంబేడ్కరిజం రావాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం అన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 125వ జయంత్సోవాల సందర్భంగా గురువారం సాయంత్రం మొగల్రాజపురం పి.బి.సిద్ధార్ధ కళాశాల ఆవరణలోని ఆడిటోరియంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమి ఆధ్వర్యంలో ‘సంఘం శరణం గఛ్చామి’ పేరుతో కళా రూపకం ప్రదర్శించారు. అంబేడ్కర్ జీవితం, ఆశయాలను కళాకారులు ప్రదర్శించారు. అంబేడ్కర్ జీవితాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపారు. సమరం మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను నేటి తరం నాయకులు ఆచరించాలన్నారు. ఇలాంటి సందేశాత్మక రూపకాలు ప్రతి చోట ప్రదర్శించాలని, అప్పుడు విద్యార్థులు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ కావాలని కోరుకుంటారని అన్నారు. ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి మాట్లాడుతూ అంబేడ్కర్ ఆ కాలంలో ఎదుర్కొన్న సంఘటనలే నేటి సమాజంలోనూ దర్శనమివ్వడం చాలా దురదృష్టకరమన్నారు.
Advertisement
Advertisement