చిన్నతనం నుంచే దేశభక్తిని పెంపొందించుకోవాలి
విజయవాడ (మొగల్రాజపురం) : చిన్నతనం నుంచే ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని భారత్lవికాస్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు జీడీవీ ప్రసాదరావు అన్నారు. శుక్రవారం పీబీ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో భారత్∙వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో జాతీయ బృందగాన పోటీలు జరిగాయి. ప్రసాదరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడానికి తమ పరిషత్ ఆధ్వర్యంలో 1967 నుంచి ఈ విధంగా విద్యార్థులకు దేశభక్తి గీతాల పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశ ప్రజలంతా ఐకమత్యం, సోదరభావంతో మెలగాలనే ఉద్దేశంతోనే స్వచ్ఛందంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్షీ్మనారాయణ మాట్లాడుతూ నగరంలోని సుమారు 25 పాఠశాలల నుంచి 250 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారన్నారు. ఈ పోటీల్లో విజేతలైన వారు ఈ నెల 23వ తేదీ వైజాగ్‌లో జరిగే రాష్ట్ర స్థాయి బృందగాన పోటీల్లో పాల్గొంటారని వివరించారు. త్వరలో పూనేలో జాతీయ స్థాయిలో ఈ బృందగాన పోటీలు జరుగుతాయని తెలిపారు. హిందీ, తెలుగు భాషల్లో విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించారు. కార్యక్రమంలో పరిషత్ సభ్యులు వి.సన్యాసిరాజు, పేర్ల భీమారావు, శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.