9నుంచి కుర్తాళంలో విశిష్ట ఆధ్యాత్మిక జాతీయ సదస్సు
9నుంచి కుర్తాళంలో విశిష్ట ఆధ్యాత్మిక జాతీయ సదస్సు
Published Fri, Oct 7 2016 10:17 PM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM
కంకిపాడు : తమిళనాడు రాష్ట్రంలోని కుర్తాళంలో శ్రీసిద్ధేశ్వరీ పీఠం శతాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకుని 9, 10, 11 తేదీల్లో విశిష్ట ఆధ్యాత్మిక భక్తి వాఙ్మయ జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు తుమ్మలపల్లి పరమేశ్వరరావు చారిటబుల్ ట్రస్టు చైర్మన్, దస్తావేజు లేఖరుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మలపల్లి హరికృష్ణ తెలిపారు. పట్టణంలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సిద్ధేశ్వరీ పీఠం, తిరుమల తిరుపతి దేవస్థానముల సంయుక్త నిర్వహణలో భక్తి అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించాలని పీఠాథిపతి సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి నిర్ణయించారన్నారు. జాతీయ సదస్సుకు తాను సహకారం అందించే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆధ్యాత్మిక పీఠాలు, భక్తి, ఆలయాలు, భక్తి సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలు అనేక అంశాలపై ఈ సదస్సులో మేధావులు, పండితులు ప్రసంగిస్తారన్నారు.
Advertisement
Advertisement