=ఆర్‌ఈసీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ {పొఫెసర్ పీజీ శాస్త్రి
=నిట్‌లో ‘కాకతీయుల నీటిపారుదల వ్యవస్థ-సాంకేతికత’ అంశంపై సదస్సు
నిట్ క్యాంపస్, న్యూస్‌లైన్ : కాకతీయులు ప్రజాసంక్షేమ పాలకులు.. వారి ఇరిగేషన్ టెక్నాలజీ ప్రపంచ నీటిపారుదల రంగంలో ఒక అద్భుతమని రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపా ల్ ప్రొఫెసర్ పీజీ శాస్త్రీ అన్నారు. శనివారం వరంగల్‌లోని నేషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్‌ఐటీ)లో ‘కాకతీ యుల నీటిపారుదల వ్యవస్థ-సాంకేతికత’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సెమినార్‌ను మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రారంభించారు.
ఈ సందర్భంగా కాకతీయుల నీటిపారుదల వ్యవస్థను.. సాంకేతిక విధానాన్ని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం పీజీ శాస్త్రీ మాట్లాడుతూ కాకతీయుల నీటిపారుదల రంగం.. అతి తక్కువ ఖర్చుతో పర్యావరణ రంగానికి దోహ దం చేసే విధానమని పేర్కొన్నారు. కాకతీయులు అప్పట్లోనే విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గొలుసుకట్టు చెరువులు నిర్మించారని చెప్పారు. కరువు సమయాల్లోనూ నీటి సంక్షోభం ఎదుర్కోకపోవడానికి కార ణం పటిష్టమైన నీటిపారుదల వ్యవస్థే అని అన్నారు.
వెయ్యి సంవత్సరాలైనప్పటికీ కాకతీయులు నిర్మించిన చెరువులు, కుంటలు వరంగల్‌లో ఇప్పటికీ ప్రధాన జలాశయాలుగా ఉన్నాయని, వ్యవసాయరంగానికి ఉపకరించే సాగునీటి వనరులు అవేనని చెప్పారు. రాజ్యసభ సభ్యు డు రాపోలు ఆనంద భాస్కర్ మాట్లాడుతూ కాకతీయుల ఇరిగేషన్ టెక్నాలజీని ఎన్‌ఐటీలో సిలబస్‌గా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వారి టెక్నాలజీకి తగిన ప్రాధాన్యం ఇస్తామన్నా రు. కాకతీయుల నీటిపారుదల వ్యవస్థ భవిష్యత్ తరాల కు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించిందన్నారు.
కలెక్టర్ కిషన్ మాట్లాడుతూ వర్షాధార నీటిని నిలువచేసి నదీ జలాలపై ఆధారపడకుండా కాకతీయులు చెరువులు నిర్మించి నీటిపారుదల రంగానికి ఆధ్యులుగా నిలిచారని అన్నారు. వారి నిర్మించిన వ్యవస్థను డాక్యుమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉందని, దానితో భవి ష్యత్ తరాలకు అవగాహన కల్పించవచ్చని అభిప్రాయపడ్డారు. వరంగల్ రేంజ్ డీఐజీ కాంతారావు మాట్లాడుతూ కాకతీయుల చెరువులను శ్రీకృష్ణదేవరాయలు మార్గదర్శకంగా తీసుకున్నారని, రాయలసీమలో కూడా చెరువులు, కుంటలు కనపడుతాయన్నారు.
అనంతపురంలో కాకతీ యుల నీటిపారుదల టెక్నాలజీ కనపడుతుందని చెప్పారు. సదస్సులో ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, నిట్ ఇన్‌చార్జ్ డెరైక్టర్ రమేష్, ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావు, సెమినార్ కన్వీనర్ ప్రొపెసర్ కేవీ.జయకుమార్, సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ హెడ్ దేవప్రతాప్, రిటైర్డ్ ఇంజినీర్లు, చరిత్రకారులు పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా పరిశోధన పత్రాల పుస్తకాన్ని ఆవిష్కరించారు.