భారతీయ నృత్య సంప్రదాయం ఆదర్శం | national seminar on indian dance | Sakshi
Sakshi News home page

భారతీయ నృత్య సంప్రదాయం ఆదర్శం

Published Sat, Dec 17 2016 9:21 PM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM

భారతీయ నృత్య సంప్రదాయం ఆదర్శం

భారతీయ నృత్య సంప్రదాయం ఆదర్శం

 విజయవాడ కల్చరల్‌ : భారతీయ నృత్య సంప్రదాయం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని నటరాజ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ అకాడమీ వ్యవస్థాపకుడు విక్రమ్‌కుమార్‌ అన్నారు. శారదా జూనియర్‌ కళాశాల, మ్యూజిక్‌ అకాడమీ సంస్థలు సంయుక్తంగా సత్యనారాయణపురంలోని శారదా కళాశాల సెమినార్‌హాల్‌లో శనివారం భారతీయ నృత్య సంప్రదాయం అంశంగా జాతీయ సెమినార్‌ నిర్వహించింది. విక్రమ్‌ కుమార్‌ మాట్లాడుతూ మన నృత్య సంప్రదాయలను ప్రపంచం అంతా ఆసక్తిగా గమనిస్తోందని, వాటి విలువలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.  చదువైనా, కళాప్రదర్శనలైనా ఇష్టపడి చేయాలని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్‌ ఎల్‌. శ్రీధర్‌ మాట్లాడుతూ విద్యార్థులకు భారతీయ నృత్యాలపై ప్రాథమిక పరిజ్ఞానం కోసం సెమినార్‌ ఏర్పాటు చేశామన్నారు. బెంగుళూరుకు చెందిన కథక్‌ బృందం ఆ నృత్యంలోని వివిధ భంగిమలు ప్రదరించారు. బృంద నాయకురాలు శ్వేతా వెంకటేష్‌ కథక్‌ నృత్య విశేషాలను తెలిపారు. అంతర్జాతీయ ఒడిస్సీ కళాకారుడు బి. చిత్రానందస్వైన్‌ సంప్రదాయ ఒడిస్సీ నృత్య కళ విస్తరణను వివరించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు నృత్యభంగిమల ద్వారా సమాధానమిచ్చారు.


 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement