
సాక్షి, హైదరాబాద్: పట్టాదారు పాసు పుస్తకం పొందని రైతుల చెక్కులను తహసీల్దార్ ధ్రువీకరణ పత్రం తీసుకొస్తే క్లియర్ చేయాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి బ్యాంకర్లను ఆదేశించారు. సోమవారం ఆయన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించి రైతుబంధు పథకాన్ని సమీక్షించారు. దీనికి ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, జాయింట్ సెక్రటరీ సాయిప్రసాద్, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ మణికందన్, ఆంధ్రాబ్యాంకు, కెనరా, కార్పొరేషన్, సిండికేట్, ఐవోబీ, ఏపీ జీవీబీ, టీజీబీ బ్యాంకు అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అన్ని బ్యాంకుల్లోనూ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని బ్యాంకర్లు వివరించారు. శని, ఆదివారాల్లో జరిగిన చెక్కుల పంపిణీతో సోమవారం బ్యాంకుల వద్ద రైతులు సులువుగా నగదు మార్చుకున్నట్లు వారు వివరించారు. పార్థసారథి మాట్లాడుతూ తాజాగా అందజేసిన అదనపు రైతు డేటా కు అనుగుణంగా బ్యాంకర్లు 17 నాటికి చెక్కులు ముద్రించి అందజేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment