సాక్షి, హైదరాబాద్: రెండో విడత రైతుబంధు సొమ్ము పంపిణీకి సన్నాహాలు మొదలయ్యాయి. వచ్చే సెప్టెంబర్ లేదా అక్టోబర్ మొదటి వారంలోగా పెట్టుబడి సొమ్ము పంపిణీ చేసేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ మొదటి వారం నుంచి రబీ సీజన్ మొదలు కానుండటంతో ఆ లోగానే పెట్టుబడి సాయం రైతులకు ఇస్తామని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. రబీలోనూ పట్టాదారు పాసుపుస్తకం ఉన్న ప్రతీ రైతుకూ పెట్టు బడి సొమ్ము ఇస్తారు. ఆయా రైతులు సాగు చేసి నా, చేయకపోయినా పెట్టుబడి సొమ్ము అందనుంది. ఖరీఫ్‌లో సాధారణ సాగు 1.08 కోట్ల ఎకరాలై తే, రబీలో 31.92 లక్షల ఎకరాలే. పంటల సాగు విస్తీర్ణంతో సంబంధం లేకుండా రబీలోనూ ఖరీఫ్ లో ఇచ్చిన రైతులందరికీ పెట్టుబడి సాయం చేయాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే.
కార్డులా? చెక్కులా?
ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద ప్రతీ రైతుకు ఎకరాకు రూ.4 వేలు అందజేసిన సంగతి తెలిసిం దే. ఆ ప్రకారం రాష్ట్రంలో 58.33 లక్షల మంది రైతులకు ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభానికి ముందే చెక్కులను గ్రామాలకు సరఫరా చేసింది. ఇప్పటివరకు 49 లక్షల చెక్కులను రైతులకు అందజేశారు. 9 లక్షలకు పైగా చెక్కులు మిగిలిపోయాయి. వాటి ల్లో దాదాపు లక్షన్నర చెక్కులకు చెందిన రైతులు చనిపోయారు. మరో లక్ష చెక్కులు ఎన్‌ఆర్‌ఐలకు సంబంధించినవి. మిగిలినవి ఇతరత్రా కారణాల తో తీసుకోలేదు. రెండో విడత రైతుబంధు సొమ్ము ను రైతులకు ఎలా పంపిణీ చేయాలన్న దానిపై సర్కారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
రబీలో చెక్కులకు బదులు బ్యాంకు కార్డుల వంటి వాటిని ఇవ్వాలని గతంలో సర్కారు నిర్ణయించింది. అయితే చెక్కుల పంపిణీపై సర్కారుకు భారీ ప్రశంసలు వచ్చాయి. దీంతో బ్యాంకు కార్డులు ఇస్తే అంత ప్రచారం వచ్చే అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది. చెక్కులను ఇస్తేనే బాగుంటుందని పలువురు ప్రజాప్రతినిధులు సీఎం వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. దీంతో చెక్కులవైపే సర్కారు మొగ్గు చూపుతుందని అనుకుంటున్నారు. కాగా, జిల్లాల్లో మిగిలిపోయిన చెక్కులను వెనక్కు పంపా లని వ్యవసాయశాఖ ఆదేశించింది. అందుకు కారణాలు వివరిస్తూ నివేదిక పంపాలని పేర్కొంది.
రెండో విడత రైతుబంధుకు సన్నాహాలు
Published Sun, Jul 22 2018 2:37 AM | Last Updated on Mon, Oct 1 2018 2:24 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment