రైతుల ఖాతాలో బీమా సొమ్ము వేయండి | C.Partarathi bankers and insurance companies have conducted a review. | Sakshi
Sakshi News home page

రైతుల ఖాతాలో బీమా సొమ్ము వేయండి

Published Thu, Oct 26 2017 3:18 AM | Last Updated on Thu, Oct 26 2017 3:18 AM

C.Partarathi bankers and insurance companies have conducted a review.

సాక్షి, హైదరాబాద్‌: రైతుల ఖాతాలోకి బీమా సొమ్ము మొత్తాన్ని వెంటనే జమ చేయాలని వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం ఆయన బ్యాంకర్లు, బీమా కంపెనీలతో సమీక్ష నిర్వహించారు. రైతులకు త్వరితగతిన బీమా సొమ్ము అందేట్లు చూడాలని, దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్లను కోరినట్లు పార్థసారథి తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు, బ్యాంకుల విలీనం వల్ల తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని బ్యాంకర్లు మరింత గడువును కోరారు. కొత్త జిల్లాల సమాచారం వీలైనంత త్వరగా నవీకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పలు బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement