bankers meet
-
రైతుల ఖాతాలో బీమా సొమ్ము వేయండి
సాక్షి, హైదరాబాద్: రైతుల ఖాతాలోకి బీమా సొమ్ము మొత్తాన్ని వెంటనే జమ చేయాలని వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం ఆయన బ్యాంకర్లు, బీమా కంపెనీలతో సమీక్ష నిర్వహించారు. రైతులకు త్వరితగతిన బీమా సొమ్ము అందేట్లు చూడాలని, దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్లను కోరినట్లు పార్థసారథి తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు, బ్యాంకుల విలీనం వల్ల తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని బ్యాంకర్లు మరింత గడువును కోరారు. కొత్త జిల్లాల సమాచారం వీలైనంత త్వరగా నవీకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పలు బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. -
రుణమాఫీపై నేడే నిర్ణయం?
ఆంధ్రప్రదేశ్లో రైతుల రుణమాఫీపై సోమవారం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సాయంత్రం బ్యాంకర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అవుతారు. ముందుగా రైతుల బకాయిలలో కొంత మొత్తం చెల్లించడానికి బ్యాంకర్లను ఆయన అనుమతి కోరే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందుబాటులో కేవలం 6వేల కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి. విడతల వారీగా రైతుల రుణాలకు సంబంధించిన మొత్తాలను తాము చెల్లిస్తామని, అందువల్ల చెప్పినంత మేరకు రుణాలు మాఫీ చేయాలని ఏపీ సర్కారు కోరుతోంది. అయితే బ్యాంకర్లు మాత్రం దానికి ఎంతవరకు సానుకూలంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. నెలాఖరులోగా రుణాలు చెల్లించకపోతే 14 శాతం వడ్డీ తప్పదని ఇప్పటికే బ్యాంకు అధికారులు అల్టిమేటం జారీచేశారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం నిర్వహించే బ్యాంకర్ల సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు వస్తాయో చూడాల్సి ఉంది.