సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగి తేనే రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముఖ్య కార్య దర్శి నర్సింగ్‌రావు పేర్కొన్నారు. నాబార్డు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌ల ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు’ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడు తూ రైతులు పంటలను ఎక్కడైనా అమ్ముకు నేలా మార్కెట్లు అందుబాటులో ఉండాల న్నారు.
సామాన్యులకు అవసరమైన ఆహారో త్పత్తులను ప్రభుత్వం కొనివ్వాలని, పం టల ధరలతో వాటిని ముడిపెట్టరాదన్నారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి మాట్లాడుతూ భారీగా పంట రుణాలిస్తున్నట్లు తాము చెబుతుంటే రైతులు మా త్రం ఇంకా ప్రైవేటు వడ్డీ వ్యాపా రుల నుంచే తీసుకుంటున్నట్లు చెబుతున్నారన్నారు. రైతులకు పెట్టుబడి నిధుల సమస్య తీర్చేందుకు ఎకరానికి రూ. 4 వేల పథకాన్ని తెస్తున్నట్లు చెప్పారు. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ వై.ఆర్.రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల కనీస వేతనం రూ. 18 వేలు ఉండాలని 7వ వేతన సంఘం చెప్పిందని, దీనినైనా కనీసం రైతులకు వర్తింపజేసి వారి ఆదాయాన్ని పెం చాలన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కందా, మేనేజ్ సంస్థ డైరెక్టర్ జనరల్ వి.ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment