raising
-
ఆ రాష్ట్రంలో యువతుల వివాహ వయస్సు పెంపు
దేశంలో యువతుల వివాహ వయస్సు 18గా ఉంది. అంటే వారికి చట్టప్రకారం 18 ఏళ్లు నిండిన తర్వాతనే వివాహం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సవరించింది.హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో 21 ఏళ్ల వయస్సు వచ్చాకనే ఆడపిల్లలకు వివాహం చేయాలనే నిబంధనను తీసుకురానుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర అసెంబ్లీ తాజాగా యువతుల వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ రూపొందించిన బిల్లుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర అసెంబ్లీ బాల్య వివాహాల నిషేధాన్ని (హిమాచల్ ప్రదేశ్ సవరణ బిల్లు 2024) వాయిస్ ఓటు ద్వారా ఆమోదించింది.ఈ సందర్భంగా మహిళా సాధికారత శాఖ మంత్రి ధని రామ్ షాండిల్ మాట్లాడుతూ బాల్య వివాహాలను నిషేధించేందుకు బాల్య వివాహ చట్టం 2006ను రూపొందించామని తెలిపారు. లింగ సమానత్వం, ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు కల్పించేందుకు యువతుల కనీస వివాహ వయస్సును పెంచాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. చిన్న వయస్సులోనే గర్భం దాల్చడం ఆడపిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందన్నారు. రాష్ట్రంలో బాల్య వివాహ చట్టం 2006, సంబంధిత చట్టాలను సవరించి, బాలికల కనీస వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదన చేశామని మంత్రి తెలిపారు. -
నిధుల సమీకరణకు సెబీ దన్ను
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పలు నిబంధనలను సరళతరం చేసేందుకు నిర్ణయించింది. గురువారం నిర్వహించిన సమావేశంలో సెబీ బోర్డు కొన్ని మార్గదర్శకాలలో అవసరానికి అనుగుణమైన సవరణలు చేపట్టేందుకు అంగీకరించింది. దీనిలో భాగంగా నిధుల అవసరాలకుగాను భారీ కార్పొరేషన్లు చేపట్టే రుణ సెక్యూరిటీల జారీ నిబంధనలను సరళీకరించనుంది. అంతేకాకుండా కంపెనీలుకాని లిస్టెడ్ సంస్థలలో ఇన్వెస్టర్లు క్లెయిమ్ చేయని సొమ్మును ఇన్వెస్టర్ల పరిరక్షణ, ఎడ్యుకేషన్ ఫండ్(ఐపీఈఎఫ్)కు బదిలీ చేసే మార్గదర్శకాలనూ క్రమబద్ధీకరించనుంది. రీట్స్, ఇన్విట్స్ నుంచి అన్క్లెయిమ్డ్ నిధులను జమ చేయడంతోపాటు ఐపీఈఎఫ్ నుంచి రిఫండ్ విధానాలనూ సవరించనుంది. ఈ బాటలో నిబంధనల ప్రకారం ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్స్‌కు అర్హతల పెంపు, ఎక్స్పీరియన్స్ సాధించడంలో గడువును సైతం పెంచనుంది. 2025 సెప్టెంబర్‌వరకూ గడువును పెంచేందుకు సెబీ బోర్డ్ నిర్ణయించింది. సెక్యూరిటీల మార్కెట్లో కనిపిస్తున్న టెక్నలాజికల్ ట్రెండ్స్ తదితర విభిన్న ట్రెండ్స్‌పైనా సెబీ బోర్డు చర్చించింది. సెబీ సైతం మరింత ఆధునిక టెక్నాలజీ వినియోగంపై దృష్టి పెట్టనుంది. -
ఆదిత్య–ఎల్1 మూడోసారి కక్ష్య పెంపు విజయవంతం
ఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం మధ్యాహ్నం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగించిన ఆదిత్య –ఎల్1 ఉపగ్రహానికి మూడోసారి కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంపొందించింది. బెంగళూరులోని మిషన్ ఆపరేటర్ కాంఫ్లెక్స్ (ఎంఓఎక్స్), ఇస్రో టెలీమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్(ఇ్రస్టాక్), పోర్టుబ్లెయర్‌లోని స్పేస్ ఏజెన్సీ కేంద్రాల శాస్త్రవేత్తలు కక్ష్య దూరాన్ని మరింత పెంచారు. Aditya-L1 Mission: The third Earth-bound maneuvre (EBN#3) is performed successfully from ISTRAC, Bengaluru. ISRO's ground stations at Mauritius, Bengaluru, SDSC-SHAR and Port Blair tracked the satellite during this operation. The new orbit attained is 296 km x 71767 km.… pic.twitter.com/r9a8xwQ4My — ISRO (@isro) September 9, 2023 కక్ష్య దూరం పెంపుదలతో ఉపగ్రహం భూమికి దగ్గరగా 296 కిలోమీటర్లు, భూమికి దూరంగా 7,1,767 కిలోమీటర్ల దూరానికి చేరుకుంది. ఉపగ్రహాన్ని ఇప్పటికే రెండుసార్లు విజయవంతంగా పెంచారు. లాంగ్రేజ్ పాయింట్ ఎల్1కు చేరేసరికి మరోసారి కక్ష్య పెంపు ఉంటుంది. 125 రోజుల ప్రయాణం తర్వాత ఉపగ్రహం నిర్దేషిత ఎల్1 పాయింట్‌కు చేరుకోనుంది. సూర్యునిలో కరోనా అధ్యయనానికి పంపిన ఆదిత్య ఎల్1 ఉపగ్రహం ఇప్పటికే భూమి, చంద్రునికి సంబందించిన ఫొటోలను పంపించింది. భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరాన ఉన్న ఎల్1 పాయింట్‌కు చేరి సూర్యునిపై పరిశోధనలు చేయనుంది. ఇదీ చదవండి: జీవ ఇంధనాల కూటమి -
రూ. 400 కోట్ల సమీకరణలో ముత్తూట్ ఫిన్‌కార్ప్
హైదరాబాద్: ముత్తూట్ ఫిన్‌కార్ప్ సంస్థ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల (ఎన్సీడీ) ద్వారా రూ. 400 కోట్ల వరకు సమీకరించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా రూ. 300 కోట్ల వరకు గ్రీన్ షూ ఆప్షన్ కింద అట్టే పెట్టుకునే వెసులుబాటుతో రూ. 100 కోట్ల ఎన్సీడీలను జారీ చేసినట్లు సంస్థ తెలిపింది. రూ. 1,000 ముఖ విలువ ఉండే ఎన్సీడీలు సెప్టెంబర్ 14 వరకు అందుబాటులో ఉంటాయి. 24 నెలల నుంచి 96 నెలల వరకు కాలావధి ఉండే ఈ వీటిపై రాబడి రేటు 8.65 శాతం – 9.43 శాతం దాకా ఉంటుందని కంపెనీ సీఈవో షాజీ వర్గీస్ తెలిపారు. రూ. 1,100 కోట్ల వరకు గరిష్ట సమీకరణ పరిమితికి లోబడి తొలి విడతగా ఈ ఎన్సీడీలను జారీ చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
ఈస్ట్ హైదరాబాద్ రయ్ రయ్! ఎందుకో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి నగరం నలువైపులా విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈక్రమంలో మౌలిక వసతులను అన్ని వైపులా విస్తరించింది. ప్రత్యేకంగా ఈస్ట్ హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలు, పరిశ్రమలను ఆకర్షించేందుకు లుక్ ఈస్ట్ పాలసీని తీసుకొచ్చింది. దీంతో ఈ ప్రాంతంలో కంపెనీల ఏర్పాటు వేగవంతమైంది. ఫలితంగా స్థిరాస్తి మార్కెట్‌కు ఊపొచ్చింది. ఇప్పటికే పోచారంలో టెక్ మహీంద్రా, టీసీఎస్, హబ్సిగూడలో జెన్‌ప్యాక్ట్ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇదీ చదవండి: చిన్న ప్రాజెక్ట్‌లు.. పెద్ద లాభాలు! గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈస్ట్ హైదరాబాద్ ప్రాపర్టీ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారి సంఖ్య 91 శాతం మేర పెరిగిందని రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫామ్ నోబ్రోకర్.కామ్ నివేదిక వెల్లడించింది. ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, పోచారం వంటి ప్రాంతాలు హాట్‌స్పాట్‌గా మారాయని తెలిపింది. క్లిక్: మరో 9 వేల మందికి పింక్ స్లిప్స్ సిద్ధం: రూ 2 వేల కోట్ల డీలే కారణమా? మరో సంచలనం: బ్రెయిన్ చిప్, మస్క్‌కు గ్రీన్ సిగ్నల్ మరిన్ని రియల్ ఎస్టేట్ వార్తలు, బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి సాక్షి బిజినెస్ -
నిధుల సమీకరణలో కెన్ ఫిన్ హోమ్స్
న్యూఢిల్లీ: గృహ రుణ రంగంలో ఉన్న కెన్ ఫిన్ హోమ్స్ రూ.4,000 కోట్ల నిధుల సమీకరణలో ఉంది. నాన్ కన్వర్టబుల్ రిడీమేబుల్ డిబెంచర్ల జారీ ద్వారా ఈ మొత్తాన్ని అందుకోనున్నట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. కెనరా బ్యాంకును ప్రమోట్ చేస్తున్న ఈ సంస్థ అక్టోబర్ 17న జరిగే సమావేశంలో ఈ మేరకు బోర్డ్ అంగీకారం కోరనుంది. రుణాల పెంపు ప్రణాళికకు 2022 సెప్టెంబర్ 7న జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో వాటాదారులు ఆమోదం తెలిపారని కెన్ ఫిన్ హోమ్స్ వెల్లడించింది. కెన్ ఫిన్ హోమ్స్‌లో కెనరా బ్యాంక్‌నకు 29.99 శాతం వాటా ఉంది. -
దూసుకుపోతున్న ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ పరిశ్రమ
న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. 2025 నాటికి ఈ పరిశ్రమ నాలుగు రెట్లు పెరిగి రూ.1,100 కోట్లకు చేరుతుందని కన్సల్టెన్సీ సంస్థ ఈవై అంచనా వేసింది. క్రీడాకారుల్లో నైపుణ్యం, కోవిడ్‌తో ఇంటికే ఎక్కువ సమయం పరిమితం అవటం, మొబైల్ వినియోగం పెరగడం వంటివి పరిశ్రమ వృద్ధికి కారణాలని తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఈ–స్పోర్ట్స్ పరిశ్రమ రూ.250 కోట్లుగా ఉంది. వచ్చే నాలుగేళ్ల పాటు ఏటా 46 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుంది. ఆన్లైన్ గేమింగ్ మాదిరిగా కాకుండా ఈ–స్పోర్ట్స్ అనేది నైపుణ్యం కలిగిన ఆన్లైన్ ఆటలుగా పరిగణిస్తారు. జట్లుగా లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీల రూపంలో టోర్నమెంట్లు, లీగ్‌లు ఆడి టైటిల్స్‌ను గెలుచుకుంటారు. 2025 నాటికి దేశీయ ఈ–స్పోర్ట్స్ పరిశ్రమలో క్రీడాకారుల సంఖ్య 15 లక్షలకు, 2.50 లక్షల జట్లకు చేరుతుందని తెలిపింది. ప్రస్తుతం 1.50 లక్షల మంది ప్లేయర్లు, 60 వేల బృందాలున్నాయి. ఇదే సమయంలో భారతీయ ఈ–స్పోర్ట్స్ ప్రైజ్ మనీ ఏటా 66 శాతం వృద్ధి రేటుతో రూ.100 కోట్లకు చేరుతుందని పేర్కొంది. ప్రస్తుతం గ్లోబల్ ప్రైజ్ మనీ భారతీయ ఈ–స్పోర్ట్స్ ప్రైజ్ మనీ 0.6 శాతమే ఉందని.. 2025 నాటికి 2 శాతానికి చేరుతుందని తెలిపింది. ప్రేక్షకులు, ఈ–స్పోర్ట్స్ టోర్నమెంట్ల సం ఖ్య పెరగడంతో ప్రకటనదారులు, ఏజెన్సీలు వ్యూ యర్షిప్ను చేరుకునేందుకు ప్రణాళికలు చేస్తున్నా యని తెలిపారు. ఈ–స్పోర్ట్స్ ఆదాయంలో మెజారిటీ వాటా అయిన ప్రకటనల విభాగం 2025 నాటికి ప్రకటనల ఆదాయం నాలుగు రెట్ల వృద్ధితో రూ.650 కోట్లకు చేరుతుంది. టోర్నమెంట్ స్పాన్సర్షిప్, సిండికేషన్ విభాగాల ఆదాయం ఏటా 45 శాతం వృద్ధి రేటుతో రూ.350 కోట్లకు చేరుతుందని ఈవై ఇండియా పార్టనర్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ లీడర్ ఆశీష్ ఫెర్వానీ తెలిపారు. చదవండి: సరికొత్తగా టాటా టియాగో.. ధర ఎంతంటే..! -
ఎగుమతులు పెరిగితేనే ఆదాయం రెట్టింపు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగి తేనే రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముఖ్య కార్య దర్శి నర్సింగ్‌రావు పేర్కొన్నారు. నాబార్డు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌ల ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు’ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడు తూ రైతులు పంటలను ఎక్కడైనా అమ్ముకు నేలా మార్కెట్లు అందుబాటులో ఉండాల న్నారు. సామాన్యులకు అవసరమైన ఆహారో త్పత్తులను ప్రభుత్వం కొనివ్వాలని, పం టల ధరలతో వాటిని ముడిపెట్టరాదన్నారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి మాట్లాడుతూ భారీగా పంట రుణాలిస్తున్నట్లు తాము చెబుతుంటే రైతులు మా త్రం ఇంకా ప్రైవేటు వడ్డీ వ్యాపా రుల నుంచే తీసుకుంటున్నట్లు చెబుతున్నారన్నారు. రైతులకు పెట్టుబడి నిధుల సమస్య తీర్చేందుకు ఎకరానికి రూ. 4 వేల పథకాన్ని తెస్తున్నట్లు చెప్పారు. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ వై.ఆర్.రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల కనీస వేతనం రూ. 18 వేలు ఉండాలని 7వ వేతన సంఘం చెప్పిందని, దీనినైనా కనీసం రైతులకు వర్తింపజేసి వారి ఆదాయాన్ని పెం చాలన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కందా, మేనేజ్ సంస్థ డైరెక్టర్ జనరల్ వి.ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. -
లిస్టింగ్ అదరగొట్టిన శంకర బిల్డింగ్
ముంబై: బెంగళూరుకు చెందిన హోమ్ ఇంప్రూవ్మెంట్, బిల్డింగ్ ప్రొడక్టుల సంస్థ శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ బధవారం స్టాక్ ఎక్స్ఛేంజీలలో అట్టహాసంగా లిస్ట్ అయింది. ఇష్యూ ప్రైస్ తో పోలిస్తే భారీ ప్రీమియంతో రూ.555 వద్ద డెబ్యూ ఎంట్రీ ఇచ్చింది. అంచనాలకు తగ్గట్టుకుగానే 25 శాతం పైగా ప్రీమియంతో దూసుకుపోతోంది. రూ.ప్రస్తుతం 571 వద్ద పాజిటివ్‌గా ఉంది. కంపెనీ ఎండీ శ్రీ సుకుమార్ శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత నెలలో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన ఈ ఐపీవో 41 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 440-460గా నిర్ణయించింది. ఈఐపివో ద్వారా కంపెనీ రూ. 350 కోట్లు సమీకరించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ దాదాపు 53 లక్షల షేర్లను ఆఫర్ చేయగా.. మొత్తం 22 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి. క్విబ్ కోటా దాదాపు 52 రెట్లు, హెచ్ఎన్ఐల విభాగం నుంచి 91 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలుకాగా... రిటైల్ విభాగం నుంచి ఏకంగా 15 రెట్లకు పైగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. గత నెలలో లిస్టయిన ఎవెన్యూ సూపర్‌మార్ట్స్(డీమార్ట్) ఐపీవో ధరతో పోలిస్తే 110 శాతంపైగా లాభాలను పంచడంతో శంకర బిల్డింగ్ ఇష్యూకి రిటైలర్లు క్యూకట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా దేశవ్యాప్తంగా 103 రిటైల్ స్టోర్లను శంకర రీటైల్ కంపెనీ నిర్వహిస్తోంది. వివిధ రాష్ట్రాలలో మొత్తం 11 ప్రాసెసింగ్ కేంద్రాలున్నాయి. -
వృద్ధాప్య పింఛన్ పెంపునకు కృషి
కొత్తగూడెం, న్యూస్‌లైన్:మన రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్‌ను 1300 రూపాయలకు పెంచేందుకు కృషి చేస్తున్నట్టు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారికత శాఖ సహాయ మంత్రి పోరిక బలరాం నాయక్ చెప్పా రు. రాజస్థాన్ రాష్ట్రంలో ఇప్పటికే వృద్ధాప్య పిం ఛన్ రూ.1300 ఇస్తున్నారని చెప్పారు. ఇదే మొత్తాన్ని మన రాష్ట్రంలో కూడా రానున్న రోజు ల్లో ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. కొత్తగూడెంలో సింగరేణి ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెంట్రల్ కార్యాలయాన్ని మంత్రి ఆదివా రం ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో బలరామ్ నాయక్ మాట్లాడుతూ.. ఉత్పత్తితోపాటు గిరిజనుల సంక్షేమంపై కూడా దృష్టి సారించాలని సింగరేణి సంస్థ అధికారులకు సూ చించారు. కొత్తగూడెంలో సింగరేణి వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రికి వినతిపత్రం ఇచ్చినట్టు తెలిపారు. ఇప్పటికే 300 పడకలతో సింగరేణి ప్రధాన ఆసుపత్రి ఉన్నందున.. వైద్య కళాశాల ఏర్పాటుకు మార్గం తేలికవుతుందని అన్నారు. సింగరేణి కార్మికులకు ఉద్యోగ విరమణ తరువాత కనీసంగా 25లక్షల రూపాయలు అందేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూ చించారు. సింగరేణిలో నాల్గవ తరగతి ఉద్యోగాలకు గిరిజనులను తీసుకునేలా చర్యలు తీసుకోవాలని, దీనిని ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభిం చాలని, గిరిజన విద్యపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి సత్వర చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరా రు. ఇల్లెందులో కొత్త మైనింగ్ గనులను త్వరలో ప్రారంభించనున్నట్టు చెప్పారు. మణుగూరు ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ... గిరిజన ప్రాంతంలోనే సింగరేణి సంస్థ ఎక్కువగా విస్తరించినందున ఇక్కడి అభివృద్ధికి (సింగరేణి) యాజమాన్యం దృష్టి సారించాలని కోరారు. కేంద్ర మంత్రిని ఎస్టీ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సింగరేణి డెరైక్టర్లు బి.రమేష్‌కుమార్, మనోహర్‌రావు, విశ్వనాధరాజు, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి. నాగ్యా, సీఎంఓఐఏ అధ్యక్షుడు మాదాసి మల్లేష్, ఎస్టీ లైజన్ ఆఫీసర్ పి.బాలరాజు, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రమేష్, మాధవ్ నాయక్ పాల్గొన్నారు.