
న్యూఢిల్లీ: గృహ రుణ రంగంలో ఉన్న కెన్ ఫిన్ హోమ్స్ రూ.4,000 కోట్ల నిధుల సమీకరణలో ఉంది. నాన్ కన్వర్టబుల్ రిడీమేబుల్ డిబెంచర్ల జారీ ద్వారా ఈ మొత్తాన్ని అందుకోనున్నట్టు కంపెనీ గురువారం ప్రకటించింది.
కెనరా బ్యాంకును ప్రమోట్ చేస్తున్న ఈ సంస్థ అక్టోబర్ 17న జరిగే సమావేశంలో ఈ మేరకు బోర్డ్ అంగీకారం కోరనుంది.
రుణాల పెంపు ప్రణాళికకు 2022 సెప్టెంబర్ 7న జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో వాటాదారులు ఆమోదం తెలిపారని కెన్ ఫిన్ హోమ్స్ వెల్లడించింది. కెన్ ఫిన్ హోమ్స్‌లో కెనరా బ్యాంక్‌నకు 29.99 శాతం వాటా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment