Can Fin Homes
-
నిధుల సమీకరణలో కెన్ ఫిన్ హోమ్స్
న్యూఢిల్లీ: గృహ రుణ రంగంలో ఉన్న కెన్ ఫిన్ హోమ్స్ రూ.4,000 కోట్ల నిధుల సమీకరణలో ఉంది. నాన్ కన్వర్టబుల్ రిడీమేబుల్ డిబెంచర్ల జారీ ద్వారా ఈ మొత్తాన్ని అందుకోనున్నట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. కెనరా బ్యాంకును ప్రమోట్ చేస్తున్న ఈ సంస్థ అక్టోబర్ 17న జరిగే సమావేశంలో ఈ మేరకు బోర్డ్ అంగీకారం కోరనుంది. రుణాల పెంపు ప్రణాళికకు 2022 సెప్టెంబర్ 7న జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో వాటాదారులు ఆమోదం తెలిపారని కెన్ ఫిన్ హోమ్స్ వెల్లడించింది. కెన్ ఫిన్ హోమ్స్‌లో కెనరా బ్యాంక్‌నకు 29.99 శాతం వాటా ఉంది. -
జేఎంసీ ప్రాజెక్ట్స్- కేన్ ఫిన్ హోమ్ జూమ్
వరుసగా మూడో రోజు సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్ప ఒడిదొడుకుల మధ్య కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్డర్లు పొందిన వార్తలతో మౌలిక సదుపాయాల కంపెనీ జేఎంసీ ప్రాజెక్ట్స్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో మార్టిగేజ్ సంస్థ కేన్ ఫిన్ హోమ్ ఫైనాన్స్ కౌంటర్ సైతం వెలుగులో నిలుస్తోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. జేఎంసీ ప్రాజెక్ట్స్ దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్ర నుంచి తాజాగా రూ. 554 కోట్ల విలువైన ఆర్డర్లు పొందినట్లు వెల్లడించడంతో జేఎంసీ ప్రాజెక్ట్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. ఎన్ఎస్ఈలో తొలుత 16 శాతం దూసుకెళ్లి రూ. 62ను అధిగమించింది. ప్రస్తుతం 13 శాతం ఎగసి రూ. 60.5 వద్ద ట్రేడవుతోంది. బిల్డింగ్ నిర్మాణాలకు దక్షిణాది నుంచి రూ. 315 కోట్ల కాంట్రాక్టు లభించగా.. మహారాష్ట్ర నుంచి ఫ్యాక్టరీ ఏర్పాటుకుగాను రూ. 239 కోట్ల ఆర్డర్ దక్కినట్లు జేఎంసీ తెలియజేసింది. ఫలితంగా ఆర్డర్ బుక్ విలువ తాజాగా రూ. 4,000 కోట్లకు చేరినట్లు మౌలిక సదుపాయాల దిగ్గజం కల్పతరు పవర్ ట్రాన్స్మిషన్కు అనుబంధ సంస్థ జేఎంసీ ప్రాజెక్ట్స్ వెల్లడించింది. కేన్ ఫిన్ హోమ్ ఫైనాన్స్ కెనరా బ్యాంక్ అనుబంధ సంస్థ కేన్ ఫిన్ హోమ్ ఫైనాన్స్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో రూ. 93 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ1తో పోలిస్తే ఇది 15 శాతం వృద్ధికాగా.. నికర వడ్డీ ఆదాయం 8 శాతం పుంజుకుని రూ. 522 కోట్లను అధిగమించింది. వాటాదారులకు షేరుకి రూ. 2 చొప్పున డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో తొలుత కేన్ ఫిన్ హోమ్ షేరు ఎన్ఎస్ఈలో 9 శాతం జంప్‌చేసి రూ. 420కు చేరింది. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 398 వద్ద ట్రేడవుతోంది. -
Q4 ఎఫెక్ట్- కేన్ ఫిన్ జూమ్- టామో డౌన్
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాల ఆధారంగా గృహ రుణ సంస్థ కేన్ ఫిన్ హోమ్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క ఇదే కాలంలో భారీ నష్టాలు ప్రకటించడంతో ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి కేన్ ఫిన్ హోమ్స్ కౌంటర్ లాభాలతో సందడి చేస్తుంటే.. టాటా మోటార్స్ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. కేన్ ఫిన్ హోమ్స్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో కేన్ ఫిన్ హోమ్స్ నికర లాభం 36 శాతం పెరిగి రూ. 91 కోట్లకు చేరింది. ఇందుకు వడ్డీ ఆదాయం సహకరించగా.. నికర వడ్డీ ఆదాయం 35 శాతం ఎగసి రూ. 186 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 3.29 శాతం నుంచి 3.52 శాతానికి బలపడ్డాయి. ఈ కాలంలో స్థూల మొండి బకాయిలు 0.8 శాతం నుంచి 0.76 శాతానికి తగ్గినట్లు కేన్ ఫిన్ హోమ్స్ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో కేన్ ఫిన్ హోమ్స్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 8 శాతం దూసుకెళ్లి రూ. 327 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 339 వరకూ ఎగసింది. టాటా మోటార్స్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ రూ. 9,894 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ.1,117 కోట్ల నికర లాభం ఆర్జించింది. తాజా క్వార్టర్లో నికర అమ్మకాలు 28 శాతం క్షీణించి రూ. 61,949 కోట్లకు చేరాయి. ఈ కాలంలో రూ. 9313 కోట్లమేర పన్నుకు ముందు నష్టం నమోదైంది. అంతక్రితం క్యూ4లో రూ. 1265 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించింది. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 4.25 శాతం పతనమై రూ. 96 వద్ద ట్రేడవుతోంది. -
కెన్ ఫిన్ హోమ్స్‌లో 13.5% వాటా విక్రయించిన కెనరా బ్యాంక్
డీల్ విలువ రూ.759 కోట్లు ముంబై: ప్రభుత్వ రంగ కంపెనీ కెనరా బ్యాంక్, తన అనుబంద సంస్థ, కెన్ ఫిన్ హోమ్స్‌లో 13.45 శాతం వాటాను విక్రయించింది. సింగపూర్ జీఐసీకి ఈ వాటాను రూ.758.8 కోట్లకు విక్రయించామని కెనరా బ్యాంక్ స్టాక్ ఎక్సే్చంజ్‌లకు నివేదించింది. ఒక్కో షేర్‌ను రూ.2,105 చొప్పున మొత్తం 35,80,849 షేర్లను జిఐసీ సింగపూర్ అనుబంధ సంస్థ కలాడియమ్ ఇన్వెస్ట్మెంట్(సింగపూర్ సావరిన్ హెల్త్ఫం డ్)కు అమ్మేశామని పేర్కొంది. ఈ ధర గురువారం కెన్ ఫిన్ హోమ్స్ ముగింపు ధరకు 9 శాతం అధికమని జేఎమ్ ఫైనాన్షియల్ తెలిపింది. ఈ వాటా విక్రయంలో కెనరా బ్యాంక్‌కు సలహాదారుగా ఈ సంస్థే వ్యవహరించింది. ఈ వాటా విక్రయ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో కెన్‌ఫిన్ హోమ్స్ షేర్ 2.1%లాభపడి రూ.1,978 వద్ద ముగిసింది. గతేడాది డిసెంబర్ నాటికి కెన్ ఫిన్ హోమ్స్‌లో కెనరా బ్యాంక్‌కు 44.1% వాటా ఉంది. కాగా స్టాక్ మార్కెట్లో లిస్ట్‌కాని అనుబంధ కంపెనీ కెనరా ఫ్యాక్టర్స్‌లో వాటా విక్రయం నిమిత్తం మర్చంట్ బ్యాంకర్లను నియమించామని గత నెలలోనే కెనరా బ్యాంక్ వెల్లడించిది. -
కెన్ ఫిన్ హోమ్స్ లాభం 56 శాతం అప్
న్యూఢిల్లీ: కెనరా బ్యాంక్‌కు చెందిన హౌసింగ్ ైఫైనాన్స్ కంపెనీ, కెన్‌ఫిన్ హోమ్స్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 56% వృద్ధి చెందింది. గత క్యూ2లో రూ.35 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.55 కోట్లకు పెరిగిందని కెన్‌ఫిన్ హోమ్స్ పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.263 కోట్ల నుంచి 26 శాతం పెరుగుదలతో రూ.332 కోట్లకు చేరిందని తెలిపింది. ఈ కంపెనీ గృహాల కొనుగోళ్లు, నిర్మాణాలకు రుణాలందజేస్తోంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్ ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయి, రూ.1,887ను తాకింది. చివరకు 1.1% నష్టంతో రూ.1,825 వద్ద ముగిసింది.