కెన్ ఫిన్ హోమ్స్ లాభం 56 శాతం అప్ | CanFin Homes net grows 56% to Rs 55 cr in Jul-Sep | Sakshi
Sakshi News home page

కెన్ ఫిన్ హోమ్స్ లాభం 56 శాతం అప్

Published Wed, Oct 19 2016 1:13 AM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM

కెన్ ఫిన్ హోమ్స్ లాభం 56 శాతం అప్

కెన్ ఫిన్ హోమ్స్ లాభం 56 శాతం అప్

న్యూఢిల్లీ: కెనరా బ్యాంక్‌కు చెందిన హౌసింగ్ ైఫైనాన్స్ కంపెనీ, కెన్‌ఫిన్ హోమ్స్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 56% వృద్ధి చెందింది. గత క్యూ2లో రూ.35 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.55 కోట్లకు పెరిగిందని కెన్‌ఫిన్ హోమ్స్ పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.263 కోట్ల నుంచి 26 శాతం పెరుగుదలతో రూ.332 కోట్లకు చేరిందని తెలిపింది. ఈ కంపెనీ గృహాల కొనుగోళ్లు, నిర్మాణాలకు రుణాలందజేస్తోంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్ ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయి, రూ.1,887ను తాకింది. చివరకు 1.1% నష్టంతో రూ.1,825 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement