మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్
ఇల్లందకుంట(హుజూరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం రైతులకు కాదని, ముఖ్యమంత్రి బంధువుల పథకమని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. మండల కేంద్రంతోపాటు సిరిసేడు, చిన్నకోమటిపల్లి తదితర గ్రామాల్లో శనివారం బూత్‌లెవల్ సమావేశా లు నిర్వహించారు. పొన్నం మాట్లాడుతూ తెలంగాణ వస్తే మా నీళ్లు, మా ఉద్యోగులు మాకు వ స్తాయని గొప్పలు చెప్పిన కేసీఆర్.. తర్వాత మాట మార్చారన్నారు. తెలంగాణ అమరుల కుటుంబాలను పట్టించుకోవడం లేదన్నారు.
ఆర్థికశాఖ మం త్రి ఈటల రాజేందర్ ఇలాఖలోనే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పూర్తికాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. దళితులకు మూడెకరాలు భూమి పంపిణీ చేస్తామని చెప్పి మాట తప్పారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వరికి రూ.2 వేలు, మొక్కజొన్నకు రూ.2 వేలు, పత్తికి రూ.7 వేలు, మిర్చికి రూ.10 వేల మద్దతు ధర చెల్లిస్తుందన్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధులు తుమ్మేటి సమ్మిరెడ్డి, ప్యాట రమేశ్, పాడి కౌశిక్‌రెడ్డి, పరిపాటి రవీందర్‌రెడ్డి, జిల్లెల తిరుపతిరెడ్డి, సర్పంచ్ పెద్ది స్వరూపకుమార్, పర్లపల్లి రమేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment