శీతలపానీయాల లారీ బోల్తా | Cool drinks Lorry over turns | Sakshi
Sakshi News home page

శీతలపానీయాల లారీ బోల్తా

Published Thu, Aug 20 2015 6:25 PM | Last Updated on Sun, Sep 3 2017 7:48 AM

Cool drinks Lorry over turns

నకిరేకల్ (నల్గొండ) : నకిరేకల్ మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డు వద్ద గురువారం సాయంత్రం శీతలపానీయాలతో వెళ్తున్న లారీ పల్టీ కొట్టింది. లారీ ముందు టైరు పంక్చర్ కావడంతో అదుపు తప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఎవరికీ పెద్ద గాయాలు కాలేదు. లారీలో ఉన్న ఇద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే లారీలో ఉన్న సగం కూల్‌ డ్రింక్స్ సీసాలన్నీ పగిలిపోయాయి. లారీ హైదరాబాద్ నుంచి కోదాడ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement