
సాక్షి, అబ్దుల్లాపూర్‌మెట్: కూల్‌డ్రింక్స్ లోడుతో వెళ్తున్న ఓ లారీ బోల్తా పడిన సంఘటన ఔటర్ రింగ్‌రోడ్డుపై చోటుచేసుకుంది. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కానప్పటికీ లారీలోంచి పడిన కూల్‌డ్రింక్స్ బాటిళ్లను ఎత్తుకెళ్లేందుకు జనం ఎగపడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కూల్‌డ్రింక్స్ లోడుతో ఉన్న భారీ లారీ తుర్కయాంజాల్ వైపు నుంచి పెద్దఅంబర్‌పేట ఔటర్ మీదుగా ఘట్‌కేసర్ వైపుకు వెళ్తున్న క్రమంలో లారీ ముందు టైర్లు ప్రమాదవశాత్తు పేలగా లారీ బోల్తా పడింది.
ఈ ఘటనలో లారీలో ఉన్న కూల్‌డ్రింక్ బాటిళ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ సమయంలో ఔటర్‌పై ప్రయాణిస్తున్న వాహనదారులు అక్కడ ఆగి రోడ్డుపై పడిన కూల్‌డ్రింక్స్ బాటిళ్లను ఎత్తుకెళ్లేందుకు ఎగబడ్డారు. దీంతో ఔటర్‌పై వాహనాలు భారీగా నిలిచిపోగా విషయం తెలుసుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. లారీలో ప్రయాణిస్తున్న డ్రైవర్ సురక్షితంగా బయటపడినట్లు తెలిపారు.
చదవండి: ఈనెల 24న యువతి నిశ్చితార్థం.. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని
Comments
Please login to add a commentAdd a comment