over turns
-
టిప్పర్ బోల్తా: ఇద్దరు దుర్మరణం
రామకుప్పం: చిత్తూరుజిల్లా చెల్దిగానిపల్లె రహదారిలో ఆదివారం రాత్రి టిప్పర్ బోల్తా పడడంతో మధ్యప్రదేశ్‌లోని బీజాపుర్కు చెందిన ఇద్దరు మృతిచెందారు. చెల్దిగానిపల్లె వద్ద జరుగుతున్న రోడ్డు పనుల్లో బీజాపూర్‌కు చెందిన టిప్పర్ డ్రైవర్ ఇమామ్ (35), క్లీనర్ శ్రీశైలం (39) పాల్గొన్నారు. వీరు ఆదివారం టిప్పర్‌లో కర్ణాటక ప్రాంతం మాలూరు నుంచి కంకర తీసుకొని బయలుదేరారు. చెల్దిగానిపల్లె వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో టిప్పర్ రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి బోల్తా పడింది. ఈ సంఘటనలో టిప్పర్ ముందు భాగంలోని అద్దాలు పగిలి ఇమామ్, శ్రీశైలంల శరీరంలోకి గుచ్చుకోవడంతోపాటు తలకు బలమైన గాయాలై, అక్కడిక్కడే మృతిచెందారు. వర్షం వస్తుండడంతో గ్రామస్తులు ఆలస్యగంగా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని టిప్పర్‌లో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికితీశారు. -
శీతలపానీయాల లారీ బోల్తా
నకిరేకల్ (నల్గొండ) : నకిరేకల్ మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డు వద్ద గురువారం సాయంత్రం శీతలపానీయాలతో వెళ్తున్న లారీ పల్టీ కొట్టింది. లారీ ముందు టైరు పంక్చర్ కావడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఎవరికీ పెద్ద గాయాలు కాలేదు. లారీలో ఉన్న ఇద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే లారీలో ఉన్న సగం కూల్ డ్రింక్స్ సీసాలన్నీ పగిలిపోయాయి. లారీ హైదరాబాద్ నుంచి కోదాడ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు
మహబూబ్ నగర్ : జిల్లాలోని అడ్డాకుల మండలం కొమ్మిరెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తాపడిన ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 35 మంది ప్రయాణికులతో సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి తాడిపత్రికి బయలు దేరింది. ఈ క్రమంలోనే అర్ధరాత్రి తరువాత కొమ్మిరెడ్డిపల్లి గ్రామంలోని బ్రిడ్జి వద్దకు రాగానే బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షత గాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. -
ట్రాలీ లారీ బోల్తా - భారీగా ఆగిన ట్రాఫిక్
గొల్లప్రోలు (తూర్పుగోదావరి జిల్లా) : తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం పెందుర్తి జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున పెద్ద ట్రాలీ లారీ బోల్తాపడింది. ట్రాలీ రహదారికి అడ్డంగా పడడంతో కిలోమేటర్లమేర వాహనాలు ఆగిపోయాయి. పోలీసులకు సమాచారం అందించినా ఉదయం ఏడుగంటల వరకూ వారు రాకపోవడంతో వాహనాలు ముందుకు కదలలేకపోయాయి. క్రేన్ తెప్పిస్తే తప్ప ట్రాలీని రోడ్డుపై నుంచి తొలగించడం సాధ్యం కాదు. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.