నకిరేకల్ సమీపంలోని మామిడాల స్టేజ్ వద్ద ఈ రోజు ఉదయం అదుపు తప్పి ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఆ ఘటనలో 10 మంది విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి విద్యార్థులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు. అయితే డ్రైవర్ వేగమే ఆ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపించారు. బస్సు బోల్తాపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.