సెల్‌ టవరెక్కి మహిళ హల్‌చల్‌ | In Nakrekal Woman Climbs Cell Tower Due To Land Dispute | Sakshi
Sakshi News home page

తనకు న్యాయం చేయాలంటూ మహిళ ఆందోళన

Published Sat, Aug 31 2019 10:24 AM | Last Updated on Sat, Aug 31 2019 10:54 AM

In Nakrekal Woman Climbs Cell Tower Due To Land Dispute - Sakshi

సాక్షి, నల్లగొండ: భూ వివాదం పరిష్కరించాలంటూ ఓ మహిళ సెల్‌ టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేసింది. వివరాలు.. జిల్లాలోని నకిరేకల్‌ మండలం కడపర్థికి చెందిన సోమయ్యకు ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్యకు పిల్లలు లేకపోవడంతో అంజమ్మ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం సోమయ్య మరణించాడు. అయితే చనిపోవడానికి ముందే సోమయ్య తనకున్న రెండెకరాల భూమిని ఇద్దరి భార్యలకు సమంగా పంచాడు. ఈ ఏడాది అంజమ్మ తన పొలంతో పాటు పక్కనే ఉన్న మొదటి భార్య పొలాన్ని కూడా దున్నింది. దాంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమయ్యింది. ఈ వివాదం ఎంతకి తెగకపోవడంతో తనకు న్యాయం చేయాలంటూ అంజమ్మ సెల్‌ టవర్‌ ఎక్కింది. విషయం తెలుసుకున్న పోలీసులు కడపర్థి చేరుకుని అంజమ్మను కిందకు దించడానికి ప్రయత్నం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement