సాక్షి, హైరాబాద్: పోలీస్ అకాడమీలో నవీన అనే ట్రైనీ కానిస్టేబుల్ ఆదివారం ఉదయం చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన నవీన, మిర్యాలగూడకు చెందిన మాధవి స్నేహితురాళ్లు. అయితే... ఇష్టంలేని పెళ్లి కుదిర్చారని నవీన స్నేహితురాలు మాధవి మిర్యాలగూడలో శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో మనస్థాపానికి గురైన నవీన పోలీస్ అకాడమీలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 2016లో పోలీస్ శాఖకు ఎంపికైన నవీన ప్రస్తుతం నార్సింగిలోని తెలంగాణ పోలీసు అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది.
నవీన తండ్రి నర్సింహ కూతురు ఆత్మహత్యపై స్పందించాడు. నవీన, మాధవిలు ప్రాణస్నేహితులని, ఒకే రకమైన దుస్తులు, చెప్పులు ధరించేవారని, ఎప్పుడు ఒకేలా ఉండేవారని చెప్పాడు. మాధవి ఆత్మహత్యతో మనస్తాపం చెందే నవీన ఈ దారుణానికి పాల్పడి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. దసరా పండుగకు ఇంటికి వచ్చిన నవీన తమతో చాలా సంతోషంగా గడిపిన నవీన ఇకలేదంటూ రోదించాడు. అయితే నవీన ఆత్మహత్యలో పోలీసు అధికారులపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతదేహాన్ని నార్సింగ్ పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా రాత్రి 2.45 గంటల ప్రాంతంలో ఉస్మానియా మార్చురీకి తరలించారు. అంతేకాదు మృతికి గల కారణాలపై టీఎస్‌పీఏ అధికారులు పెదవి విప్పడంలేదు.
Comments
Please login to add a commentAdd a comment