మహిళా కానిస్టేబుల్పై మోడళ్ల దాడి | models assault woman constable in police station | Sakshi
Sakshi News home page

మహిళా కానిస్టేబుల్పై మోడళ్ల దాడి

Published Thu, May 28 2015 8:18 PM | Last Updated on Sun, Sep 3 2017 2:50 AM

మహిళా కానిస్టేబుల్పై మోడళ్ల దాడి

మహిళా కానిస్టేబుల్పై మోడళ్ల దాడి

ఒక వ్యక్తి తమను వేధించాడని ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్కు వచ్చిన ఇద్దరు మహిళా మోడళ్లు.. అక్కడ మహిళా కానిస్టేబుల్ మీద దాడిచేసి.. బుక్కైపోయారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆదివారం రాత్రి ముంబై నగరంలో టీవీలలో నటించే ఇద్దరు మోడళ్లు పోలీసు స్టేషన్కు వచ్చారు.

సరిగ్గా అప్పుడే అక్కడ హైడ్రామా మొదలైంది. అక్కడ ఉన్న మహిళా కానిస్టేబుల్తో చాలాసేపు తీవ్ర వాగ్వాదానికి దిగిన ఆ ఇద్దరు మోడళ్లు.. ఆ తర్వాత ఆమెపై దాడి చేశారని పోలీసులు అంటున్నారు. దాంతో.. పోలీసు స్టేషన్లోనే పోలీసులపై దాడి చేసినందుకు వాళ్లపై కేసు నమోదైంది. ఎవరో వ్యక్తి తమను వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మోడళ్లు.. చివరకు తామే కేసులో ఇరుక్కున్నారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement