mumbai models
-
ట్విట్టర్లో రామ్ గోపాల్ వర్మ సందడి
ముంబై : వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్ వేదికగా సందడి చేశాడు. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌తో కలసి ముంబై మోడల్స్‌తో ఎంజాయ్ చేసిన ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. వీటికి డిఫరెంట్ ట్యాగ్ లైన్ పెట్టి హల్ చల్ చేశాడు. రామ్... గోపాల్ కాదు. గోపాల్... రామ్ కాదంటూ సరదాగా సంభాషించాడు. ఇక పూరిపై కూడా చలోక్తులు విసిరాడు. పూరి ముంబైలో లేడు...ముంబై ఇన్ పూరి అంటూ ట్విట్ చేశాడు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రామ్ ఈ సారి పంథా మార్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. It's not Puri in Mumbai,it's Mumbai in Puri pic.twitter.com/bfxGU3WaPb — Ram Gopal Varma (@RGVzoomin) 4 April 2016 Gopal is not Ram pic.twitter.com/5RkMygJHJz — Ram Gopal Varma (@RGVzoomin) 4 April 2016 -
పెళ్లి విందులో అశ్లీల నృత్యాలు: 15 మంది అరెస్ట్
హైదరాబాద్: నగర శివారులో మరో అసాంఘిక చర్య వెలుగులోకి వచ్చింది. వివాహ రిసెప్షన్ అంటూ వేడుక జరుపుకున్న కొందరు.. అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించి, తాము కూడా చిందులేశారు. పోలీసులు చెప్పిన వివరాలనుబట్టి.. రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని జొన్నగడ్డ వద్ద రవి ఫామ్ హౌస్ లో ఆదివారం రాత్రి ఓ పెళ్లి రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకలో భాగంగా హైదరాబాద్, ముంబై నుంచి రప్పించిన మోడల్స్ అశ్లీల నృత్యాలు చేశారు. సమాచారం అందుకున్న స్పెషల్ ఆపరేషన్ టీమ్(ఎస్ఓటీ) పోలీసులు ఫామ్ హౌస్ పై దాడిచేశారు. అయితే నృత్యాలు చేసిన అమ్మాయిలు తమ బంధువులేనని వేడుక నిర్వాహకులు బుకాయించారు. చివరికి ఆరుగురు అమ్మాయిలతోపాటు 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
ముంబయి మోడల్స్‌తోపాటు యువకులు అరెస్ట్
హైదరాబాద్ : నగరంలోని మాదాపూర్ పీఎస్ పరిధిలోని ఖానామెట్‌లో ముజ్రాపార్టీపై ఎస్వోటీ పోలీసులు శనివారం దాడి చేశారు. ఈ సందర్భంగా అశ్లీల నృత్యాలు చేస్తున్న యువతి, యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి వద్ద నుంచి మద్యం, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. పట్టుబడిన వారిలో ముంబయికి చెందిన నలుగురు మోడల్స్‌తోపాటు 17 మంది యువకులు ఉన్నారని... వారిలో పలువురు ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారని పోలీసులు చెప్పారు. వారందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
మహిళా కానిస్టేబుల్‌పై మోడళ్ల దాడి
ఒక వ్యక్తి తమను వేధించాడని ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్‌కు వచ్చిన ఇద్దరు మహిళా మోడళ్లు.. అక్కడ మహిళా కానిస్టేబుల్ మీద దాడిచేసి.. బుక్కైపోయారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆదివారం రాత్రి ముంబై నగరంలో టీవీలలో నటించే ఇద్దరు మోడళ్లు పోలీసు స్టేషన్‌కు వచ్చారు. సరిగ్గా అప్పుడే అక్కడ హైడ్రామా మొదలైంది. అక్కడ ఉన్న మహిళా కానిస్టేబుల్‌తో చాలాసేపు తీవ్ర వాగ్వాదానికి దిగిన ఆ ఇద్దరు మోడళ్లు.. ఆ తర్వాత ఆమెపై దాడి చేశారని పోలీసులు అంటున్నారు. దాంతో.. పోలీసు స్టేషన్లోనే పోలీసులపై దాడి చేసినందుకు వాళ్లపై కేసు నమోదైంది. ఎవరో వ్యక్తి తమను వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మోడళ్లు.. చివరకు తామే కేసులో ఇరుక్కున్నారు!