
శ్రీనగర్: కశ్మీర్‌లో ఫిబ్రవరిలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కళ్లల్లో యాసిడ్ పోయాలంటూ హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు మాట్లాడుకుంటున్నట్లుగా విడుదలైన ఓ ఆడియో క్లిప్ కలకలం రేపుతోంది. దీన్ని హిజ్బుల్ కమాండర్ రియాజ్ నైకూ, సమీర్ టైగర్ అనే మరో మిలిటెంట్ మధ్య జరుగుతున్న సంభాషణగా గుర్తించారు. ‘పంచాయతీ ఎన్నికల్లో పోటీచేస్తే వారిని మనం చంపొద్దు.
కళ్లల్లో గాఢమైన సల్ఫ్యూరిక్ యాసిడ్ లేదా హైడ్రోక్లోరిక్ యాసిడ్ పోద్దాం. 28 ఏళ్లుగా బెదిరిస్తున్నా వారు భయపడటం లేదు. ఆయా కుటుంబాలు పనికిరారని అనుకున్న వాళ్లే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మన చేతిలో చస్తే రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని కుటుంబీకులు భావిస్తున్నారు. అలాంటి వారి కళ్లల్లో యాసిడ్ పోస్తే కుటుంబాలకు భారమవుతారు’ అని ఆ ఆడియో క్లిప్‌లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment