
శ్రీనగర్ : కథువా ఘటనకు సంబంధించిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో కశ్మీర్ ప్రభుత్వం ఆ సంభాషణపై విచారణ జరపాల్సిందిగా దర్యాప్తు సంస్థలను ఆదేశించింది. అత్యంత పాశవికంగా అత్యాచారానికి గురై, హత్య గావించబడిన ఎనిమిదేళ్ల చిన్నారి కుటుంబానికి సాయం చేసేందుకు కొంత మంది వ్యక్తులు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ‘పెద్ద మొత్తంలో సేకరించిన డబ్బు ఆమె కుటుంబానికి చేరడంలేదని.. దుర్వినియోగం అవుతుందనేది’ ఆ సంభాషణలోని సారాంశం.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆడియో క్లిప్ విన్న వెంటనే, దర్యాప్తు సంస్థలకు పంపించానని కశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ తెలిపారు. అత్యంత హేయమైన మృగాళ‍్ల చర్య వల్ల కశ్మీర్ పరువు పోవడంతో పాటు ప్రపంచ దేశాల్లో దేశ ప్రతిష్ట దిగజారిందని ఆయన పేర్కొన్నారు. దోషులకు కచ్చితంగా శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. హేయమైన ఈ చర్యను ఖండిస్తున్నట్లు తెలిపారు. మానవతా దృక్పథంతో చూడాల్సిన ఈ ఘటనకు కొందరు మత రంగు పులుముతున్నారని విమర్శించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని, వారి కుట్రల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువాకు చెందిన ఎనిమిదేళ్ళ చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన గురించి గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment