అదిరిపోయే ట్విస్ట్‌: రాసలీలలపై మరో సాక్ష్యం! | Trump Ex Attorney Records Playboy Model Deal Secretly | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 21 2018 8:28 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Trump Ex Attorney Records Playboy Model Deal Secretly - Sakshi

కరెన్‌ మెక్‌డౌగల్‌

ప్లేబాయ్‌ మాజీ మోడల్‌ కరెన్‌ మెక్‌డౌగల్‌(46).. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తనతో రాసలీలలు నడిపారని సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే. ట్రంప్‌ తనతో లైంగిక సంబంధం కొనసాగించినట్లు ఆమె ఆరోపించటమే కాదు.. అందుకు ఆధారాలు ఉన్నాయంటూ పేర్కొని కలకలమే రేపారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించిన ఆడియో టేప్‌ ఒకటి ఇప్పుడు బయటకు రావటం చర్చనీయాంశంగా మారింది. 

వాషింగ్టన్‌: ట్రంప్‌.. తన మాజీ అటార్నీ మైకేల్‌ కోహెన్‌తో జరిపిన సంభాషణ ఆడియో క్లిప్‌ దర్యాప్తు అధికారుల చేతికి చిక్కినట్లు సమాచారం. ఈ మేరకు ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రచురించింది. కరెన్‌ నోరు మూయించేందుకు ఆమెతో తప్పనిసరిగా డీల్‌ కుదుర్చుకోవాలని కోహెన్‌కు ట్రంప్ సూచించినట్లు ఆ కథనం పేర్కొంది. ‘ఈ వ్యవహారం ఓ కొలిక్కి రావాలన్నా.. కరెన్‌ను కట్టడి చేయాలన్నా ఎంతో కొంత చెల్లించి ఆమె నోరు మూయించండి’.. అని ట్రంప్‌ సూచించగా.. ‘వ్యవహారం ఇక్కడే తేల్చేద్దాం’ అని కోహెన్‌ బదులిచ్చినట్లు క్లిప్‌లో ఉన్నట్లు సదరు కథనం సారాంశం. ట్రంప్‌ టవర్‌లోనే ఈ సంభాషణ జరగ్గా.. 90 సెకన్ల ఆ సంభాషణను కోహెన్‌ ముందు జాగ్రత్తగా రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోహెన్‌పై ఎన్నికల అవినీతి, అక్రమాస్థుల కేసులు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫెడరల్‌ ఏజెంట్లు కోహెన్‌ కార్యాలయాల నుంచి ఆ టేపులను స్వాధీనం చేసుకున్నట్లు ఆ కథనం వివరించింది.

నిజమే కానీ... ఇక ఈ వ్యవహారంపై అధ్యక్షుడు ట్రంప్‌ వ్యక్తిగత అటార్నీ రూడీ గిలియానీ స్పందించారు. ఆ సంభాషణ నిజమే అయినప్పటికీ.. ఆమెతో ఎలాంటి ఒప్పందం జరగలేదని రూడీ వెల్లడించారు. ఈ వ్యవహారంలో ప్రెసిడెంట్‌ ట్రంప్‌కు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాబోవని రూడీ చెబుతున్నారు. ఇదిలా ఉంటే 2006లో ట్రంప్‌ తనతో అఫైర్‌ కొనసాగించారని.. ఆదే సమయంలో ట్రంప్‌ భార్య మెలానియా కొడుక్కి జన్మనిచ్చిందని మెక్‌డౌగల్ ఆరోపణలు చేశారు.. తొమ్మిది నెలలపాటు వారి సంబంధం కొనసాగిందన్న ఆమె.. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆ విషయాలను బయటకు పొక్కనీయకుండా ట్రంప్‌ డబ్బుతో ఒప్పందం చేసుకున్నాడంటూ ఆమె పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement