పాతికేళ్లుగా ఓటీ ఎగ్గొట్టారు | Trump Former Driver Sues over Overtime Pay | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 10 2018 11:47 AM | Last Updated on Thu, Apr 4 2019 4:25 PM

Trump Former Driver Sues over Overtime Pay - Sakshi

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ట్రంప్‌పై ఆయన మాజీ డ్రైవర్‌ సోమవారం ఓ దావా వేశాడు. వెట్టిచాకిరీ చేయించుకుని తనకు సరైన వేతనం చెల్లించలేదని పిటిషన్‌లో సదరు వ్యక్తి ఆరోపించాడు.  పైగా ఓటీ వేతనం ఎగ్గొట్టారని ఆరోపిస్తూ... 2 లక్షల డాలర్లు చెల్లించాల్సిందేనని ట్రంప్‌ను డిమాండ్‌ చేస్తు‍న్నాడు.

వాషింగ్టన్‌:  ట్రంప్‌ దగ్గర నోయెల్‌ సింట్రోన్‌(59) ఇరవై ఏళ్లుగా డ్రైవర్‌గా విధులు నిర్వహించారు. 2016లో ట్రంప్‌ అధ్యక్షుడిగా నామినేషన్‌ వేశాక.. ఆయన దగ్గర నోయెల్‌ పని మానేశారు. అయితే ఆ ఇరవై ఏళ్ల కాలంలో ట్రంప్‌ తనకు ఏనాడూ ఓటీ సొమ్మును చెల్లించలేదని, ట్రంప్‌ కుటుంబం మొత్తం తనతో వెట్టిచాకిరీ చేయించుకుందని ఆరోపిస్తున్నారు. పైగా న్యూయార్క్‌ చట్టాలను ఉల్లంఘించి అధిక గంటలు పని చేయించుకున్నారని.. ఓటీ జీతం చెల్లించలేదని నోయెల్‌ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఓటీ వేతనం కింద 2 లక్షల డాలర్లు..  కోర్టు ఖర్చులు, అటార్నీ ఫీజు అన్నీ కలుపుకుని మొత్తం 3,50,000 డాలర్లు చెల్లించాలంటూ ట్రంప్‌పై నోయెల్‌ దావా వేశారు. ఈ వ్యవహారంపై ట్రంప్‌ కంపెనీల కార్యదర్శి ఒకరు స్పందిస్తూ.. ఆ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. కోర్టులోనే వ్యవహారం తేల్చుకుంటామని వారు చెబుతున్నారు.

తెలంగాణలో ట్రంప్‌ ఫ్యాన్‌..  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement