sued
-
ఉద్యోగులకు ట్విటర్ రూ.4 వేల కోట్లు బాకీ.. ఎలాన్ మస్క్‌పై కోర్టులో దావా
ఎలాన్ మస్క్ ఆధీనంలోని ట్విటర్‌కు దావాలు, కోర్టు పిటిషన్ల సెగ తగులుతూనే ఉంది. ట్విటర్‌ను కొనుగోలు చేసి ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగించినప్పటి నుంచి అనేక దావాలు ఆ సంస్థపై దాఖలవుతున్నాయి. తొలగించిన ఉద్యోగులకు చెల్లించాల్సిన 500 మిలియన్ డాలర్లు ( సుమారు రూ. 4,104 కోట్లు) పరిహారం చెల్లింపులో ట్విటర్ విఫలమైందంటూ తాజాగా అమెరికా కోర్టులో పిటిషన్ దాఖలైంది. ట్విటర్ హెచ్ఆర్ విభాగంలో పని చేసిన కోర్ట్నీ మెక్మిలాన్ ఈ ఏడాది జనవరిలో శాన్ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో దావా వేశారు. ఎలాన్ మస్క్ ఆధీనంలోని ట్విటర్ 2022 అక్టోబర్ నుంచి అప్పటి సీఈవో పరాగ్ అగర్వాల్ సహా 80 శాతం మందిని తొలగించిందని, మొత్తంగా 6వేల మందికి పైగానే ఉద్యోగులకు ఉద్వాసన పలికిందని మెక్మిలాన్ తన దావాలో పేర్కొన్నారు. ట్విటర్ సీవెరెన్స్ ప్లాన్ ప్రకారం.. తొలగించే ఉద్యోగికి కనీసం రెండు నెలల జీతం, హెల్త్ ఇన్సూరెన్స్, ఇతర బెనిఫిట్లకు సంబంధించిన నగదు పరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. అలాగే సీనియర్ ఉద్యోగులకు ఆరు నెలల బేస్ శాలరీతోపాటు ఏడాదికి ఒక వారం చొప్పున మూల వేతనం బాకీ ఉందన్నారు. దీని గురించి ఉద్యోగుల తొలగింపునకు ముందే ఎలాన్ మస్క్‌కు తెలుసునని పిటషనర్ ఆరోపించారు. మరోవైపు తొలగించిన ఉద్యోగులకు పరిహారంగా మూడు నెలల వేతనం చెల్లిస్తామని ట్విటర్ అప్పట్లో హామీ ఇచ్చింది. ఇందులో యూఎస్ చట్టాల ప్రకారం చెల్లించాల్సిన రెండు నెలల వేతనంతోపాటు సీవెరన్స్ ప్లాన్ కింద అదనంగా మరో నెల వేతనం ఉంటుంది. ఉద్యోగులకు ఎటువంటి సమాచారం లేకుండా సీవెరన్స్ ప్లాన్‌ను ట్విటర్ మార్చిందని, న్యాయబద్ధంగా తమకు రావాల్సిన ప్రయోజనాలను ట్విటర్ యాజమాన్యం చెల్లించడంలో విఫలమైందంటూ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇదీ చదవండి: ట్విటర్ యూజర్లకు షాకిచ్చిన మస్క్.. ఇక రోజుకు అన్నే ట్వీట్లు.. -
ఆ డాక్టర్ వల్లే నాకు లోపం.. కోర్టు సంచలన తీర్పు
Spina bifida won the landmark legal case over her wrongful conception: ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయిత తర్వాత మహిళలు వైద్యం, నెలవారీ చెకప్‌లకు కోసం డాక్టర్లను సంప్రదించి.. సూచనలు, జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే తాజాగా ఓ యువతి తన తల్లి గర్భంతో ఉన్న సమయంలో సరైన సలహాలు ఇవ్వలేదని డాక్టర్‌ను కోర్టుకు లాగింది. 20 ఏళ్ల యువతి ఈవీ టూంబ్స్.. తన తల్లికి తాను లోపంతో జన్మించడానికి డాక్టర్ కారణమైందని, సరైన సలహా ఇచ్చిఉంటే తాను జన్మించిన ఉండేదాన్ని కాదని పేర్కొంది. అయితే ఈవీ టూంబ్స్.. స్పైనా బిఫిడా అనే లోపంతో పుట్టారు. వెన్నెముక సరిగా ఏర్పకుండా లోపంతో పుట్టడం. దీంతో ఆమె రోజు మెడికల్ ట్యూబ్‌లను అమర్చుకొని వేదన అనుభవిస్తూ ఉన్నారు. ఆమె తన తల్లి ప్రెగ్నెన్సీ సమయంలో సరైన సూచనలు ఇవ్వలేదని డాక్టర్ ఫిలిప్ మిచెల్ ఆరోపణలు చేసింది. అంతటితో ఆగకుండా తనకు నష్టం పరిహారం చెల్లించాలని కోర్టులో దావా వేసింది. తాను పోషక ఆహారం తీసుకుంటే.. ఫోలిక్ యాసిడ్ తీసుకోవాల్సిన అవసరం లేదని డాక్టర్ సలహా ఇచ్చినట్లు ఈవీ తల్లి పేర్కొంది. లండన్ హైకోర్టు న్యాయమూర్తి రోసలిండ్ కో క్యూసి ఈవీ టూంబ్స్ కేసును సమర్థించారు. ఆమె తల్లికి ముందుగానే సరైన సలహా ఇచ్చి ఉంటే ఈవీ టూంబ్స్ .. స్పైనా బిఫిడా వెన్నుముక లోపంతో జన్మించి ఉండేది కాదని తీర్పు నిచ్చారు. టూంబ్స్ కోరిన విధంగా తగిన నష్ట పరిహారం చెల్లించాలని డాక్టర్‌ను కోర్టు ఆదేశించింది.ఇక ఈవీ టూంబ్స్ దివ్యాంగ ‘షో జంపర్’గా పలు పోటీల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. -
'కీచక బాస్' 5 వేల మంది మహిళలపై లైంగిక వేధింపులు..!
ప్రముఖ టెక్ బిలియనీర్ మైఖేల్ గోగున్ మరోసారి చిక్కల్లో పడ్డారు. తన సొంత సంస్థలో పనిచేసే నలుగురు మాజీ ఉద్యోగులు 135 పేజీల ఫిర్యాదుతో కోర్టును ఆశ్రయించారు. మహిళలపై చెప్పుకోలేని విధంగా దారుణాలకు ఒడిగట్టిన మైఖేల్ పై ఫిర్యాదు చేసేందుకు 135పేజీలు సరిపోవని వాపోయారు. తమని వేధించినందుకు కోర్ట్ న్యాయం చేయాలని, 800 మిలియన్ డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ దావా వేశారు. ఈ దావాపై న్యూయార్క్ పోస్ట్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. మైఖేల్ గోగున్ 1996 నుంచి 2016 మధ్య కాలంలో సెక్వోయా క్యాపిటల్‌కు చెందిన నాయకత్వం వహించారు. ఆ సమయంలో మైఖేల్ గోగున్ 54 కంపెనీ పెట్టుబడులను కలిపి 64 బిలియన్ల కంటె ఎక్కువ మార్కెట్ వ్యాల్యూ పెరిగింది. అదే సమయంలో 2016లో ఆయనపై లైంగిక ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆరోపణలపై సెక్వోయా క్యాపిటల్ యాజమాన్యం ఆయన్ని తొలగించింది. ఆ తర్వాత సొంతంగా అమింటర్ గ్రూప్ ను స్థాపించాడు. అహర్నిశలు కష్టపడి కంపెనీకి మంచి ఫలితాల్ని రాబట్టారు. అమింటర్ పనితీరుతో టెక్ కంపెనీలు యాపిల్, సిస్కో, గూగుల్, యూట్యూబ్,పేపాల్,ఇన్స్టాగ్రామ్ వంటి సంస్థలే నిధులు కోసం మైఖేల్ గోగున్ చుట్టూ క్యూ కట్టేవి. అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న గోగున్ మైఖేల్ గోగున్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకునే వారు. ముఖ్యంగా మహిళల్ని వేధిస్తున్నారనే ఆరోపణలు ఆయనకు అప్రతిష్టని తెచ్చి పెట్టాయి. తాజాగా గోగున్ చెందిన సంస్థలో పనిచేసిన నలుగురు మాజీ ఉద్యోగులు అతనిపై $800 మిలియన్ల దావా వేశారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం..135 పేజీల ఫిర్యాదులో మోంటానాలోని వైట్ ఫిష్ పట్టణానికి చెందిన హోటల్స్‌కు తీసుకెళ్లి మహిళల్ని వేధించేవారని బాధితులు పేర్కొన్నారు. గోగున్ 5,000 కంటే ఎక్కువ మంది మహిళల్ని వేధించాడని ఆరోపించారు. ఆ ఆకృత్యాలు జరిగే సమయంలో సైలెంట్‌గా ఉండేందుకు బాధితులకు పెద్ద ఎత్తున బహుమతులు ఇచ్చేవాడని పేర్కొన్నారు. మహిళలపై చెప్పుకోలేని విధంగా దారుణాలకు ఒడిగట్టిన మైఖేల్ పై ఫిర్యాదు చేసేందుకు 135పేజీలు సరిపోవని అన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని కోర్ట్‌కు విన్నవించారు. కాగా, ప్రస్తుతం ఈ దావాపై విచారణ కొనసాగుతుండగా..త్వరలో కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో తీర్పు వెలువడనుంది. చదవండి: క్రికెట్‌కు తప్పని రాసలీలల చెదలు.. సెక్స్ స్కాండల్‌లో నలిగిన ఆటగాళ్లు -
యాపిల్‌కు భారీ షాకిచ్చిన విద్యార్థులు..!
Apple Sued In China For Selling Iphones Without Charger: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కు చైనా విద్యార్థులు భారీ షాకిచ్చారు. ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌తో ఛార్జర్ ఇవ్వనందుకుగాను కంపెనీపై దావా వేసినట్లుగా తెలుస్తోంది. ఐఫోన్ కొనుగోలుపై కంపెనీ ఇచ్చిన యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్ కేబుల్ ఇతర ఛార్జర్లకు అనుకూలంగా లేదంటూ విద్యార్థులు తమ దావాలో వెల్లడించారు. అంతేకాకుండా ఈ ఛార్జింగ్ కేబుల్ ఇతర ఛార్జర్లకు సపోర్ట్ ఇస్తూందనే కంపెనీ చెప్పిన విషయాన్ని దావాలో గుర్తుచేశారు. చదవండి: యాపిల్ నెంబర్ 1 స్థానంపై కన్నేసిన మైక్రోసాఫ్ట్..! మ్యాగ్‌సేఫ్ వైర్లెస్ ఛార్జర్లను ప్రోత్సహించడం కోసం కర్బన్ వెస్ట్ రిడక్షన్ పాలసీను ఒక సాకుగా చూపిస్తోందని విద్యార్థులు పేర్కొన్నారు. తమకు వెంటనే యాపిల్ ఛార్జర్లను సరఫరా చేయాలని అదే విధంగా 100 యువాన్లు నష్టపరిహరాన్ని అందించాలని విద్యార్ధులు దావాలో తెలిపారు. కాగా పలు స్మార్ట్‌ఫోన్ చైనీస్ కంపెనీలు స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై అడాప్టర్ అప్షన్‌ను ఇస్తున్నట్లు కోర్టుకు విద్యార్థులు విన్నవించారు స్పందించిన యాపిల్..! విద్యార్థులు వేసిన దావాపై యాపిల్ ప్రతినిధులు స్పందించారు. స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఛార్జింగ్ అడాప్టర్లను విడిగా విక్రయించడం సర్వసాధారణమని యాపిల్ బీజింగ్ వర్చువల్ కోర్టులో పేర్కొంది. కర్బన్ వెస్ట్ రిడక్షన్ తగ్గించేందుకుగాను ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లకు ఛార్జింగ్ నిలిపివేసినట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఈ పాలసీపై అక్కడి ప్రభుత్వం కూడా మద్దతు తెలిపిందనే విషయాన్ని యాపిల్ గుర్తుచేసింది. కాగా ఈ పిటిషన్‌పై ఇంకా వాదనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: దాతృత్వంలో దేశంలోనే అజీమ్ ప్రేమ్‌జీ టాప్ -
చైనా వైరస్: ట్రంప్‌పై దావా.. ఒక్కొక్కరి మీద 1 డాలర్
బీజింగ్: కోవిడ్ వ్యాప్తి మొదలైనప్పుడు మాజీ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కరోనాను చైనీస్ వైరస్ అని ఆరోపించిన సంగతి తెలిసిందే. అవకాశం దొరికిన ప్రతి సారి కోవిడ్ విషయంలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ చైనాపైనే విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఓ చైనా సంస్థ ట్రంప్‌పై పరువు నష్టం దావా వేసింది. ఆ వివరాలు.. కోవిడ్‌ను “చైనా వైరస్” గా పేర్కొన్నందుకు గాను చైనా-అమెరికన్ పౌర హక్కుల సంఘం (సీఏసీఆర్సీ), డొనాల్డ్ ట్రంప్‌పై దావా వేసినట్లు తెలిపింది. ఈ మేరకు సీఏసీఆర్సీ గురువారం న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టులో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో, ఈ బృందం ట్రంప్ వాడిన "చైనా వైరస్" అనే పదాన్ని "నిరాధారమైనది" గా పేర్కొంది. ఫిర్యాదులో కమిటీ, కరోనా వైరస్ విషయంలో ట్రంప్ ప్రవర్తన “తీవ్రంగా, దారుణమైనదిగా” ఉందని ఆరోపించింది. అంతేకాక ట్రంప్ తన ప్రవర్తనతో చైనా అమెరికన్లకు "మానసిక క్షోభ" కలిగించారని దావాలో పేర్కొన్నారు. గత కొద్ది నెలలుగా అమెరికా అంతటా ఆసియా మూలాలున్న వ్యక్తులపై దాడులు పెరిగాయి. వైరస్ పరంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలే ఈ దాడులకు పరోక్ష కారణమని చాలా మంది కార్యకర్తలు భావిస్తున్నారు. ఈ క్రమంలో మార్చి 17న, అట్లాంటాలో ఆసియా అమెరికన్లకు వ్యతిరేకంగా జరిగిన ఘోరమైన హింసాత్మక సంఘటనలో ఆసియా సంతతికి చెందిన ఆరుగురు మహిళలతో సహా ఎనిమిది మందిని ఉగ్రవాది కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఫిర్యాదులో పేర్కొన్న దాని ప్రకారం, ట్రంప్ తన “వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల” కోసం కరోనాను ‘‘చైనా వైరస్’’ అని “ఉద్దేశపూర్వకంగా” ఉపయోగించారని కమిటీ ఆరోపించింది. ట్రంప్ వ్యాఖ్యల వల్ల ఆసియా అమెరికన్ల మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయని తెలిపింది. ఈ క్రమంలో సీఏసీఆర్సీ అమెరికాలో నివసిస్తున్న ప్రతి ఆసియా అమెరికన్‌కు క్షమాపణగా ట్రంప్ 1 డాలర్ చెల్లించాలని డిమాండ్ చేసింది. అంటే మొత్తంగా 22.9 మిలియన్ డాలర్లు చెల్లించాలని కోరింది. ఈ మొత్తంతో ఆసియా అమెరికన్ మూలాలు కలిగిన వారు అమెరికాకు చేసిన సహకారాన్ని ప్రదర్శించడానికి ఓ మ్యూజియం ఏర్పాటు చేస్తామని కమిటీ తెలిపింది. ఈ దావాపై డోనాల్డ్ ట్రంప్ సీనియర్ సలహాదారు జాసన్ మిల్లెర్ ది హిల్తో మాట్లాడుతూ “ఇది పిచ్చి, మూర్ఖమైన దావా.. ఈ కేసు ఎప్పుడు న్యాయస్థానానికి చేరుకున్నా దాన్ని కొట్టేస్తారు’’ అని మిల్లెర్ తెలిపాడు. చదవండి: ట్రంప్ బుద్ద.. ఎంతైనా చైనోడి తెలివే వేరబ్బా! -
పాతికేళ్లుగా ఓటీ ఎగ్గొట్టారు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఊహించని షాక్ తగిలింది. ట్రంప్‌పై ఆయన మాజీ డ్రైవర్ సోమవారం ఓ దావా వేశాడు. వెట్టిచాకిరీ చేయించుకుని తనకు సరైన వేతనం చెల్లించలేదని పిటిషన్లో సదరు వ్యక్తి ఆరోపించాడు. పైగా ఓటీ వేతనం ఎగ్గొట్టారని ఆరోపిస్తూ... 2 లక్షల డాలర్లు చెల్లించాల్సిందేనని ట్రంప్‌ను డిమాండ్ చేస్తున్నాడు. వాషింగ్టన్: ట్రంప్ దగ్గర నోయెల్ సింట్రోన్(59) ఇరవై ఏళ్లుగా డ్రైవర్‌గా విధులు నిర్వహించారు. 2016లో ట్రంప్ అధ్యక్షుడిగా నామినేషన్ వేశాక.. ఆయన దగ్గర నోయెల్ పని మానేశారు. అయితే ఆ ఇరవై ఏళ్ల కాలంలో ట్రంప్ తనకు ఏనాడూ ఓటీ సొమ్మును చెల్లించలేదని, ట్రంప్ కుటుంబం మొత్తం తనతో వెట్టిచాకిరీ చేయించుకుందని ఆరోపిస్తున్నారు. పైగా న్యూయార్క్ చట్టాలను ఉల్లంఘించి అధిక గంటలు పని చేయించుకున్నారని.. ఓటీ జీతం చెల్లించలేదని నోయెల్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఓటీ వేతనం కింద 2 లక్షల డాలర్లు.. కోర్టు ఖర్చులు, అటార్నీ ఫీజు అన్నీ కలుపుకుని మొత్తం 3,50,000 డాలర్లు చెల్లించాలంటూ ట్రంప్‌పై నోయెల్ దావా వేశారు. ఈ వ్యవహారంపై ట్రంప్ కంపెనీల కార్యదర్శి ఒకరు స్పందిస్తూ.. ఆ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. కోర్టులోనే వ్యవహారం తేల్చుకుంటామని వారు చెబుతున్నారు. తెలంగాణలో ట్రంప్ ఫ్యాన్.. -
లొకేషన్ మేనేజర్‌పై దాడి.. చిక్కుల్లో హీరో
లొకేషన్ మేనేజర్‌పై దాడి చేసిన కేసులో హాలీవుడ్ స్టార్ హీరో జానీ డీప్(55) చిక్కుల్లో పడ్డారు. సెట్స్‌లోనే డీప్ తనను అసభ్యంగా దూషించటంతోపాటు.. భౌతికంగా దాడి చేశాడంటూ లొకేషన్ మేనేజర్ గ్రెగ్ బ్రూక్స్ దావా వేశారు. గతేడాది ఏప్రిల్‌లో లాస్ ఏంజెల్స్‌లోని బార్క్లే హోటల్లో ‘సిటీ లైట్స్’ చిత్ర షూటింగ్ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ‘షూటింగ్‌కు అనుమతి ముగిసింది. సమయం ఎక్కువ లేదు. త్వరగా షాట్ ముగించండి’ అని డీప్కు తాను చెప్పటంతో.. పిచ్చెక్కిపోయిన డీప్ తనపై దాడి చేశాడని బ్రూక్స్ ఆరోపిస్తున్నాడు. ఆ ఘటన తర్వాత ఫిర్యాదు చెయొద్దంటూ చిత్ర నిర్మాతలు, దర్శకుడు తనను వారించారని, అయినా తాను వెనక్కి తగ్గకపోవటంతో ప్రాజెక్టు నుంచి తొలగించారని బ్రూక్స్ వాపోతున్నాడు. అంతేకాదు జానీ డీప్ డ్రగ్స్ తీసుకుని సెట్స్‌లోకి వచ్చేవాడంటూ బ్రూక్స్ సంచలన ఆరోపణలు చేశాడు. అయితే ఈ వ్యవహారంపై స్పందించేందుకు డీప్ అందుబాటులో లేరు. ఇదిలా ఉంటే ఆర్థికంగా తనను సొంత మేనేజర్లు దెబ్బతీయటంతో మానసికంగా కుంగిపోయిన డీప్.. వారిపై దావా వేశారు. కాగా, డిటెక్టివ్ డ్రామాగా తెరకెక్కుతున్న సిటీ లైట్స్ సెప్టెంబర్‌లో రిలీజ్ కానుంది. -
ఆటోడ్రైవర్‌కు మహిళా అభిమానుల బెడద
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల విడుదలైన హీరో రవితేజ ’రాజా ది గ్రేట్’ సినిమాలో చెప్పిన ఓ ఫోన్ నెంబర్ విశాఖకు చెందిన లంకలపల్లి గోపి అనే వ్యక్తిని ముప్పతిప్పలు పెట్టిన విషయం తెలిసిందే. విసుగెత్తిన అతడు చివరకు తన ఫోన్‌ను స్విచ్చాఫ్ చేసుకున్నాడు కూడా. తాజాగా బంగ్లాదేశ్‌లోనూ అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితు... అయన బంగ్లాదేశ్ స్టార్ హీరో ఏమీ కాదు. మామూలు ఆటో డ్రైవర్. అతడికి రోజూ వందల మంది మహిళా అభిమానులు ఫోన్ చేస్తున్నారు. అది భరించలేక అతడు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అతడేమీ స్టార్ హీరో కాకపోయినా అన్ని ఫోన్లు రావడానికి కారణం మాత్రం బంగ్లాదేశ్ టాప్ హీరో షాకిబ్ ఖాన్. దాంతో తన జీవితాన్ని దుర్భరం చేసిన షాకిబ్ ఖాన్‌పై 50వేల పౌండ్లకు దావా వేయాలని నిర్ణయించుకున్నాడు ఆటోడ్రైవర్ ఇలాజుల్ మియా. హీరో ఖాన్‌కు, ఇలాజుల్ మియాకు ఎలాంటి సంబంధం లేదు. అయినా ఇదంతా ఎందుకు జరిగిందంటే.... షాకిబ్ ఖాన్ నటించిన ‘రాజనీతి’ సినిమా ఇటీవల విడుదలయింది. ఈ సినిమాలో హీరోయిన్‌కు షాకిబ్ ఖాన్ ఓ ఫోన్ నెంబర్ తనదంటూ ఇస్తాడు. అది నిజంగా హీరో ఫోన్ నెంబర్ అని హీరో మహిళా అభిమానులు భావించారు. యాదృశ్చికంగా ఆ ఫోన్ నెంబర్ మన ఆటోరిక్షా డ్రైవర్ ఇలాజుల్ మియాది. వందలాది మంది మహిళా ఫ్యాన్... ఆ ఫోన్ నెంబర్ హీరోది అనుకొని ఇలాజుల్ ఫోన్‌కు ఫోన్లు చేస్తూ వస్తున్నారు. అస్తమానం ఫోన్లు రావడంతో అతడికి.. ఇతర మహిళలతో అక్రమ సంబంధం ఉందని ఇలాజుల్ భార్య అనుమానించింది. అంతేకాకుండా ఇంటి నుంచి వెళ్లిపోతానంటూ బెదిరిస్తూ వచ్చింది. ఆమెకే ఫోన్ ఇచ్చి చివరకు ఆ ఫోన్లు హీరోకు వస్తున్న ఫోన్లుగా తెలిసేలా చేసేడు. ప్రస్తుతానికి కొత్తగా పెళ్లయిన వారి మధ్య గొడవ సద్దు మణగింది. ఆయితే ఫోన్లు మాత్రం ఆగడం లేదని ఇలాజుల్ మియా వాపోతున్నాడు. ఓ మహిళా అభిమాని అయితే తానుంటున్న చోటును కనుక్కొని 300 మైళ్ల దూరం నుంచి హీరో కోసం వచ్చిందని అతడు చెప్పుకొచ్చాడు. ఓ దశలో తాను ఫోన్ నెంబర్ మార్చుకుందామని అనుకున్నానని, అయితే తనను ఫోన్‌పై పిలిచే కస్టమర్లకు ఇబ్బంది అవుతుందని మార్చుకోలేదన్నాడు. 50వేల పౌండ్లకు కోర్టుకెళ్లి లాయర్ ద్వారా దావా కూడా వేశానని చెప్పాడు. అయితే దాన్ని విచారించేందుకు జడ్జీ స్వీకరించలేదని, ఫోన్ నెంబర్ వల్ల తనకు నిజంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయో, లేదో తెలుసుకునేందుకు దర్యాప్తుకు ఆదేశించారని చెప్పాడు. దర్యాప్తు అనంతరం తన దావాపై విచారణ జరిగే అవకాశం ఉందని అతడు తెలిపాడు. -
యాహూకి మరో షాక్!
కాలిఫోర్నియా: భారీ ఎత్తున యాహూ ఖాతాలు హాకింగ్ కు గురయ్యాయని ప్రకటించిన ఇంటర్నెట్ సంస్థ యాహూకి మరో షాక్ తగిలింది. కనీసం 50 కోట్ల ఖాతాల హ్యాకింగ్ వ్యవహారంలో సంస్థ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ ఒక యూజర్ కోర్టులో దావా వేశారు. న్యూయార్క్ కు చెందిన రోనాల్డ్ ష్వార్ట్జ్, శాన్ జోస్, కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవడంతోపాటు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ వినియోగదారులను తరపున కోర్టును ఆశ్రయించారు. వినియోగదారుల వ్యక్తిగత సమాచార భద్రతను కాపాడతామని వాగ్దానం చేసిన సంస్థ ఘోరమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని స్క్వార్జ్ ఆరోపించారు.. అయితే ఈ వ్యాజ్యంపై స్పందించడానికి యాహూ ప్రతినిధి సన్నీవేల్ తిరస్కరించారు. వెరిజోన్, యాహూ వ్యాపార ఒప్పందానికి నష్టం చేకూరే అవకాశం ఉందని, దీనికోసం సీఈవో మారిస్సా మేయర్స్ చేస్తున్నప్రయత్నాలను ప్రభావితం చేస్తుందని చెప్పారు. కాగా 50కోట్ల (500 మిలియన్) యూజర్ల అకౌంట్లు హ్యాకింగ్‌కు గురైనట్లు యాహూ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ బాబ్ లార్డ్ ఈ విషయాన్ని గురువారం ధృవీకరించారు. దీనిని స్టేట్ స్పాన్సర్డ్ అటాక్ అని హ్యాకింగ్‌కు సంబంధించి విచారణ కొనసాగుతోందని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
జేబులో పేలిన శాంసంగ్ ఫోన్
న్యూయార్క్: దక్షిణ కొరియా కు చెందిన మొబైల్ మేకర్ శాంసంగ్ ను పేలుడు కష్టాలు వెన్నాడుతూనే ఉన్నాయి. చార్జింగ్ పెడుతున్న సమయంలో గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ పేలుడుతున్న ఘటనలతో ఆందోళనలో పడ్డ సంస్థకు ఇపుడు మరో వివాదం చుట్టుకుంది. వరుస ఘటనలు, రీకాల్ సంక్షోభానికి తోడు న్యాయపరమైన చర్యల్ని కూడా ఎదుర్కొంటోంది. జరిగిన జాప్యానికి, నష్టానికి, నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కోరుతూ అమెరికా కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఫ్లోరిడాలోని పామ బీచ్ గార్డెన్స్ లో జోనాథన్ స్ట్రోబెల్ అనే వినియోగదారుని జేబులోనే గెలాక్సీనోట్ 7 పేలిపోయింది. పనిలో ఉండగానే అకస్మాత్తుగా ఈ పేలుడు సంభవించడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. సెకండ్ డిగ్రీ గాయాలతో ఉన్నాడని పాం బీచ్ పోస్ట్.కామ్ సోమవారం రిపోర్టు చేసింది. ఈ లోపం గురించి స్పష్టంగా ముందే తెలిసి వున్నా నిర్లక్ష్యం చేసిందని ఆరోపిస్తూ సుమారు కోటి రూపాయలు(15,000 డాలర్లు) నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ దావా వేశాడు. శాంసంగ్ లాంటి కార్పొరేట్ సంస్థ తగిన చర్యలు చేపట్టడంలో విఫలమైందని జొనాధన్ లాయర్ వాదించారు. మరోవైపు ప్రమాదం తర్వాత జోనాథన్ కు ఫోన్ ను అప్పగించాల్సిందిగా శాంసంగ్ సంస్థనుంచి ఈమెయిల్ అందుకున్నాడు. కాగా ప్రపంచ వ్యాప్తంగా గెలాక్సీ నోట్ 7 పేలుడు ప్రమాదాలను ధృవీకరించిన శాంసంగ్ , ఈ ఫోన్లను రీకాల్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. పేలుడు ఘటనలతో వినియోగాదారులను అప్రమత్తం చేస్తూ ఈమెయిల్స్ పంపుతోంది. దీంతోపాటు వినియోగదారులకు క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. -
వివాదంలో టాప్ ఎలక్ట్రానిక్ దిగ్గజాలు
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజాలు శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ ,ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ సంస్థలు చిక్కుల్లో పడ్డాయి. యాంటీట్రస్ట్ ఉల్లంఘనలకింద ఆరోపణలు చెలరేగాయి. అమెరికాలో ఉద్యోగుల నియమాక విధానాలపై ఇరు సంస్థల మధ్య ఒప్పందం జరిగిందని ఆరోపిస్తూ అమెరికా కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎల్జీ మాజీ సేల్స్ మేనేజర్ ఉత్తర కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో గెలాక్సీ నోట్ 7 పేలుడు ఘటనలు, నిషేధంతో ఇబ్బందుల్లో ఉన్న సంస్థను మరో వివాదం చుట్టుకున్నట్టయింది. సాంసంగ్, ఎల్జీ సంస్థల మధ్య ఒకరి ఉద్యోగులను ఒకరు తీసుకోకూడదనే ఒప్పందం ఉందని పిటిషనర్ ఫ్రాస్ట్ వాదిస్తున్నారు. ఇలా నిబంధనల ఉల్లంఘన ద్వారా ఉద్యోగుల జీతాలను కిందికి తెస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. 2013 లో లింక్డ్ఇన్ ద్వారా శాంసంగ్ లో ఉద్యోగం కోసం తనను సంప్రదించారని, వెంటనే తాను పొరపాటు చేశానని, శాంసంగ్, ఎల్జీ మధ్య ఒకరి ఉద్యోగాలను ఒకరు నియమించుకోకూడదనే ఒప్పందని ఉందని చెప్పారని దావాలో తెలిపారు. ఇది అక్రమమని..క్షమించమని రిక్రూటర్ తెలిపాడనేది ఫ్రాస్ట్ వాదన. అయితే ఈ ఆరోపణలను ఎల్జీ ప్రతినిధి ఖండించారు. అలాంటి ఒప్పందమేమీ తమ మధ్య లేదన్నారు. ఈ ఆరోపణల్లో బలం లేదని వాదించగా, శాంసంగ్ వ్యాఖ్యానించడానికి నిరాకరిచింది.మరోవైపు ఇలాంటి అంతర్గత ఒప్పందాలు పోటీ తత్వానికి విరుద్ధమని ఫ్రాస్ట్ లాయర్ జోసెఫ్ సవేరీ వ్యాఖ్యానించారు. ప్రతిభ, సామర్ధ్యం ఆధారంగా ఉద్యోగాలు పొందడం ఉద్యోగుల ప్రాథమి హక్కు అన్నారు. కాగా టెక్ దిగ్గజాలు ఆపిల్, గూగుల్ మధ్య నెలకొన్న ఇలాంటి వివాదాన్ని గత ఏడాది 415 మిలియన్ డాలర్లకు సెటిల్ చేసుకున్న సంగతి తెలిసిందే. -
రాహుల్‌కు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ