Apple Sued In China For Selling Iphones Without Charger: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కు చైనా విద్యార్థులు భారీ షాకిచ్చారు. ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌తో ఛార్జర్ ఇవ్వనందుకుగాను కంపెనీపై దావా వేసినట్లుగా తెలుస్తోంది. ఐఫోన్ కొనుగోలుపై కంపెనీ ఇచ్చిన యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ కేబుల్ ఇతర ఛార్జర్లకు అనుకూలంగా లేదంటూ విద్యార్థులు తమ దావాలో వెల్లడించారు. అంతేకాకుండా ఈ ఛార్జింగ్ కేబుల్ ఇతర ఛార్జర్లకు సపోర్ట్ ఇస్తూందనే కంపెనీ చెప్పిన విషయాన్ని దావాలో గుర్తుచేశారు.
చదవండి: యాపిల్ నెంబర్ 1 స్థానంపై కన్నేసిన మైక్రోసాఫ్ట్..!
మ్యాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జర్‌లను ప్రోత్సహించడం కోసం కర్బన్ వెస్ట్ రిడక్షన్ పాలసీను ఒక సాకుగా చూపిస్తోందని విద్యార్థులు పేర్కొన్నారు. తమకు వెంటనే యాపిల్ ఛార్జర్లను సరఫరా చేయాలని అదే విధంగా 100 యువాన్లు నష్టపరిహరాన్ని అందించాలని విద్యార్ధులు దావాలో తెలిపారు. కాగా పలు స్మార్ట్‌ఫోన్ చైనీస్ కంపెనీలు స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై అడాప్టర్ అప్షన్‌ను ఇస్తున్నట్లు కోర్టుకు విద్యార్థులు విన్నవించారు
స్పందించిన యాపిల్..!
విద్యార్థులు వేసిన దావాపై యాపిల్ ప్రతినిధులు స్పందించారు. స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఛార్జింగ్ అడాప్టర్లను విడిగా విక్రయించడం సర్వసాధారణమని యాపిల్ బీజింగ్ వర్చువల్ కోర్టులో పేర్కొంది. కర్బన్ వెస్ట్ రిడక్షన్ తగ్గించేందుకుగాను ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లకు ఛార్జింగ్ నిలిపివేసినట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఈ పాలసీపై అక్కడి ప్రభుత్వం కూడా మద్దతు తెలిపిందనే విషయాన్ని యాపిల్ గుర్తుచేసింది. కాగా ఈ పిటిషన్‌పై ఇంకా వాదనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
చదవండి: దాతృత్వంలో దేశంలోనే అజీమ్ ప్రేమ్‌జీ టాప్
Comments
Please login to add a commentAdd a comment