
లొకేషన్ మేనేజర్‌పై దాడి చేసిన కేసులో హాలీవుడ్ స్టార్ హీరో జానీ డీప్(55) చిక్కుల్లో పడ్డారు. సెట్స్‌లోనే డీప్ తనను అసభ్యంగా దూషించటంతోపాటు.. భౌతికంగా దాడి చేశాడంటూ లొకేషన్ మేనేజర్ గ్రెగ్ బ్రూక్స్ దావా వేశారు.
గతేడాది ఏప్రిల్‌లో లాస్ ఏంజెల్స్‌లోని బార్‌క్లే హోటల్‌లో ‘సిటీ లైట్స్’ చిత్ర షూటింగ్ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ‘షూటింగ్‌కు అనుమతి ముగిసింది. సమయం ఎక్కువ లేదు. త్వరగా షాట్ ముగించండి’ అని డీప్‌కు తాను చెప్పటంతో.. పిచ్చెక్కిపోయిన డీప్ తనపై దాడి చేశాడని బ్రూక్స్ ఆరోపిస్తున్నాడు. ఆ ఘటన తర్వాత ఫిర్యాదు చెయొద్దంటూ చిత్ర నిర్మాతలు, దర్శకుడు తనను వారించారని, అయినా తాను వెనక్కి తగ్గకపోవటంతో ప్రాజెక్టు నుంచి తొలగించారని బ్రూక్స్ వాపోతున్నాడు.
అంతేకాదు జానీ డీప్ డ్రగ్స్ తీసుకుని సెట్స్‌లోకి వచ్చేవాడంటూ బ్రూక్స్ సంచలన ఆరోపణలు చేశాడు. అయితే ఈ వ్యవహారంపై స్పందించేందుకు డీప్ అందుబాటులో లేరు. ఇదిలా ఉంటే ఆర్థికంగా తనను సొంత మేనేజర్లు దెబ్బతీయటంతో మానసికంగా కుంగిపోయిన డీప్.. వారిపై దావా వేశారు. కాగా, డిటెక్టివ్ డ్రామాగా తెరకెక్కుతున్న సిటీ లైట్స్ సెప్టెంబర్‌లో రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment