హాలీవుడ్ హీరో జానీ డెప్ మీద సంచలన ఆరోపణలు చేసింది అతడి మాజీ ప్రేయసి ఎలెన్ బార్కిన్. తాము తొలిసారి శారీరకంగా కలవడానికి ముందు అతడు తనకు క్వాల్యూడ్ అనే డ్రగ్ ఇచ్చాడని ఆరోపించింది. ఆ సమయంలో అతడు బాగా తాగి తనను కంట్రోల్ చేయడమే కాక నోటికొచ్చినట్లు మాట్లాడాడని పేర్కొంది. జానీ మీద అంబర్ హెరాల్డ్ వేసిన పరువు నష్టం దావా కేసులో సాక్షిగా ఉన్న ఆమె ఆరువేల పేజీలున్న కోర్టు డాక్యుమెంట్స్‌లో పై వ్యాఖ్యలు చేసింది.
జానీ ఎప్పుడూ తనను కట్టడి చేయాలని చూసేవాడంది. ఎవరితోనైనా కాస్త చనువుగా ఉంటే చాలు ఈర్ష్య పడేవాడంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరితో వెళ్తున్నావు? మీరిద్దరూ రాత్రంతా ఏం చేశారు? వంటి ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడని చెప్పుకొచ్చింది. ఒకసారి తన వీపు మీద ఏదో గీత పడితే నేను ఎవరితోనో బెడ్ షేర్ చేసుకున్నానని అనుమానించాడని వాపోయింది. ఒకసారి తనకు క్వాల్యూడ్ అనే డ్రగ్ ఇచ్చాడని, అప్పుడే తామిద్దరం తొలిసారిగా బెడ్ షేర్ చేసుకున్నామని పేర్కొంది.
కొన్ని నెలలపాటు తమ బంధం కొనసాగిందని, ఆ సమయంలో వారానికి మూడు, నాలుగు రోజులు ఒకరింటికి మరొకరం వెళ్లి కలుసుకునేవాళ్లమని తెలిపింది. చాలావరకు జానీ పూటుగా మద్యం సేవించి, ఆ మత్తులోనే ఉండేవాడని చెప్పింది. అతడు కొకైన్, గంజాయి, హాలూసినోజెనిక్ వంటి డ్రగ్స్ సేవించడం తాను కళ్లారా చూశానని చెప్పుకొచ్చింది. అయితే మందు, లేదంటే సిగరెట్ తాగేవాడని, అందరి మీదా అరుస్తాడని, ఓసారి తనమీదకు మందు బాటిల్ విసిరాడని ఆరోపణలు చేసింది. కాగా అంబర్ హెరాల్డ్, జానీ డెప్ ఒకరి మీద ఒకరు వేసుకున్న పరువు నష్టం కేసులో ఫైనల్‌గా జానీ డెప్ గెలిచిన విషయం తెలిసిందే!
చదవండి: భర్తను టార్చర్ పెట్టిన హీరోయిన్, ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ ఆలియా..
తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుని ఎమోషనలైన కల్యాణ్ రామ్
Comments
Please login to add a commentAdd a comment