City Lights
-
లొకేషన్ మేనేజర్‌పై దాడి.. చిక్కుల్లో హీరో
లొకేషన్ మేనేజర్‌పై దాడి చేసిన కేసులో హాలీవుడ్ స్టార్ హీరో జానీ డీప్(55) చిక్కుల్లో పడ్డారు. సెట్స్‌లోనే డీప్ తనను అసభ్యంగా దూషించటంతోపాటు.. భౌతికంగా దాడి చేశాడంటూ లొకేషన్ మేనేజర్ గ్రెగ్ బ్రూక్స్ దావా వేశారు. గతేడాది ఏప్రిల్‌లో లాస్ ఏంజెల్స్‌లోని బార్క్లే హోటల్లో ‘సిటీ లైట్స్’ చిత్ర షూటింగ్ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ‘షూటింగ్‌కు అనుమతి ముగిసింది. సమయం ఎక్కువ లేదు. త్వరగా షాట్ ముగించండి’ అని డీప్కు తాను చెప్పటంతో.. పిచ్చెక్కిపోయిన డీప్ తనపై దాడి చేశాడని బ్రూక్స్ ఆరోపిస్తున్నాడు. ఆ ఘటన తర్వాత ఫిర్యాదు చెయొద్దంటూ చిత్ర నిర్మాతలు, దర్శకుడు తనను వారించారని, అయినా తాను వెనక్కి తగ్గకపోవటంతో ప్రాజెక్టు నుంచి తొలగించారని బ్రూక్స్ వాపోతున్నాడు. అంతేకాదు జానీ డీప్ డ్రగ్స్ తీసుకుని సెట్స్‌లోకి వచ్చేవాడంటూ బ్రూక్స్ సంచలన ఆరోపణలు చేశాడు. అయితే ఈ వ్యవహారంపై స్పందించేందుకు డీప్ అందుబాటులో లేరు. ఇదిలా ఉంటే ఆర్థికంగా తనను సొంత మేనేజర్లు దెబ్బతీయటంతో మానసికంగా కుంగిపోయిన డీప్.. వారిపై దావా వేశారు. కాగా, డిటెక్టివ్ డ్రామాగా తెరకెక్కుతున్న సిటీ లైట్స్ సెప్టెంబర్‌లో రిలీజ్ కానుంది. -
ఏ సలహా ఇవ్వకపోవడం కూడా... సలహానే!
తొలి పరిచయం కెమెరా ముందు తొలిసారిగా నిల్చోవడానికి, తొలి సన్నివేశంలో నటించడానికి ఇబ్బంది పడలేదు. భయపడలేదు. కారణం ఏమిటంటే, గతంలో నేను చాలా వాణిజ్య ప్రకటనల్లో నటించాను. నేను షిల్లాంగ్‌లో పుట్టి పెరిగాను. అక్కడ పాశ్చాత్య సంస్కృతి ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. అలా నేను ఇంగ్లిష్ సినిమాలు చూస్తూ పెరిగాను. ‘టైటానిక్’ ‘ప్రెట్టీ ఉమన్’ నా అభిమాన చిత్రాలు. నేను చూసిన తొలి హిందీ సినిమా ‘కుఛ్ కుఛ్ హోతా హై’. పోటీకి భయపడేవాళ్లు ఆటలో దిగవద్దు. దిగితే భయపడవద్దు. సినీ పరిశ్రమలోనే కాదు ప్రతిచోటా పోటీ ఉంది. ‘ఇతరులు ఏం చేస్తున్నారు?’ అనేదాని కంటే ‘నేనేం చేస్తున్నాను’ అనేదానిపైనే ఎక్కువ దృష్టి పెడతాను. షిల్లాంగ్ నేపథ్యం, సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తొలి చిత్రం విజయం సాధించడం, నాకు గుర్తింపు రావడం... నావరకైతే అతిపెద్ద విజయాలు. ఈ సంతృప్తి చాలు. కెరీర్ మొదట్లో లభించే ప్రశంసలు జీవితకాలం గుర్తుండి పోతాయి. ‘సిటీ లైట్స్’ ప్రదర్శన తరువాత నటి అలియాభట్ నన్ను కౌగిలించుకొని చాలాసేపు మెచ్చుకోలుగా మాట్లాడింది. నాకు స్ఫూర్తి కలిగించిన నటి విద్యాబాలన్ కూడా నన్ను మెచ్చుకున్నారు. షబానా ఆజ్మీ కూడా. ఈ ప్రశంసలతో సంతోషం కంటే ‘బాధ్యత’ ఎక్కువ పెరిగింది. ‘కొత్తనటిని కదా. ఏదైనా సలహా చెప్పండి’ అని ఒక నటుడిని అడిగితే ‘ఏ సలహా ఇవ్వక పోవడం కూడా సలహానే’ అన్నారు నవ్వుతూ. అంతేనేమో! - పత్రలేఖ, హీరోయిన్ (సిటీలైట్స్ ఫేమ్) -
సిటీలైట్స్ కోసం ఎంతో కష్టపడ్డా!
ఇది వరకు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తయితే.. తాజాగా నటించిన సిటీలైట్స్ సినిమా ఒకెత్తని హీరో రాజ్‌కుమార్ రావు అంటున్నాడు. ఇంతకుముందు విడుదలైన కోయి పో చే, షహీద్ సినిమాలు మనోడికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. 2010లో హత్యకు గురైన మానవ హక్కుల కార్యకర్త, న్యాయవాది షహీద్ ఆజ్మీ జీవితగాథ ఆధారంగా షహీద్ తీశారు. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల కోసం బ్రిటన్ నుంచి వచ్చిన మెట్రో మనీలా ఆధారంగా సిటీలైట్స్ రూపొందించారు. ‘దీని సినిమా షూటింగ్‌ను ఇటీవలే ముగించాం. మంచి జీవితం కోసం రాజస్థాన్ నుంచి ముంబై వచ్చిన జంట కథ ఇది. కొత్త నగరంలో వాళ్లు చాలా ఇబ్బందులు పడుతుంటారు. వారి ప్రేమకథలో ఎన్నో మలుపులు ఉంటాయి’ అని రాజ్‌కుమార్ వివరించాడు. మహేశ్ భట్ నిర్మించగా, హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన ఈ సినిమా మే ఒకటిన విడుదలయ్యే అవకాశముంది. కొత్తనటి పత్రలేఖ ఇందులో హీరోయిన్గా కనిపిస్తుంది. షహీద్ సినిమాతో తనకు కొత్త జీవితాన్ని ఇచ్చిన మెహతా కుటుంబసభ్యుడి వంటివాడేనని రావు అన్నాడు. ఒకరినొకరం బాగా అర్థం చేసుకుంటామని, పాత్రలను ఎలా తీర్చిదిద్దాలో బాగా తెలుసని చెప్పాడు. ఆయన దమ్మున్న దర్శకుడు కాబట్టే సిటీలైట్స్లో నటించడానికి సంతోషంగా ఒప్పుకున్నానని ఈ 29 ఏళ్ల నటుడు అన్నాడు. కంగనా రనౌత్ ప్రధానపాత్రధారిగా ఇటీవలే వచ్చిన క్వీన్లోనూ రావు ప్రధాన పాత్ర పోషించాడు. తన ప్రియురాలిని ప్రేమలోకి దింపడానికి ఎన్నో కష్టాలు పడే ఢిల్లీ యువకుడు విజయ్ ధింగ్రాగా సత్తా ప్రదర్శించాడు. ‘ఇది హీరోయిన్ ఆధారిత సినిమా అని తెలిసినా, నాకూ నటించే అవకాశముంటుంది కాబట్టి అంగీకరించాను. ఇందులో విజయ్ పాత్ర కూడా చాలా ముఖ్యమైనది’ అని చెప్పిన రాజ్‌కుమార్ రావు ఢిల్లీడాలీ సినిమాలో సోనమ్ కపూర్ సరసన నటించే చాన్స్ కొట్టేశాడు.