వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పనితీరును సుమారు 60 శాతం మంది ప్రజలు తిరస్కరించారు. 50 శాతం మంది ట్రంప్‌పై అభిశంసనకు మద్దతు పలికినట్లు వాషింగ్టన్ పోస్ట్–ఏబీసీ న్యూస్ పోల్ సర్వేలో తేలింది. 36 శాతం మంది ట్రంప్ పనితీరుపై సంతృప్తిగా ఉన్నట్లు సర్వే తేల్చింది. ఆగస్టు 26–29 మధ్య ఈ అధ్యయనం చేపట్టారు. ట్రంప్‌ను అభిశంసించేందుకు కాంగ్రెస్ సంసిద్ధం కావాలని 49 శాతం మంది అభిప్రాయపడగా, 46 శాతం మంది అందుకు భిన్నంగా స్పందించారు. అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యంపై రాబర్ట్ ముల్లర్ జరుపుతున్న విచారణలో జోక్యం చేసుకోవడం ద్వారా ట్రంప్ న్యాయ ప్రక్రియకు అడ్డంకులు సృష్టించారని 53 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవహారాల్లో ట్రంప్ తీరును 45 శాతం మంది సమర్థించగా, అంతే శాతం మంది తిరస్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment