
Okapari Okapari Sravana Bhargavi: టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి పేరు కొంతకాలంగా నెట్టింట హల్‌చల్ చేస్తుంది. తాజాగా ఆమె రిలీజ్ చేసిన ఓ పాటపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అన్నమయ్య కీర్తనను అపహాస్యం చేసిందంటూ అన్నమయ్య వంశస్తులు మండిపడుతున్నారు. వెంకటేశ్వర స్వామికి అభిషేకం కైంకర్యం చేస్తూ భక్తి భావంతో పాడిన కీర్తనను శ్రావణ భార్గవి వివిధ భంగిమల్లో కనిపిస్తూ, కాళ్లు ఊపుతూ పాటను చిత్రీకరించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
తాజాగా తనపై వస్తోన్న విమర్శలపై సింగర్ శ్రావణ భార్గవి స్పందించింది. తాను పాడిన పాటలో ఎలాంటి తప్పులేదని, మీరు చూసే చూపులోనే తప్పుందని ఘాటుగా బదులిచ్చింది. 'ఆ వీడియోలో అశ్లీలత ఎక్కడ కనిపించింది? నేను ఆ పాటను ఎంత భక్తితో పాడానో నాకు తెలుసు. ఈ పాటలో మీకు తెలుగుదనం తప్పా ఇంకేదైనా కనిపిస్తే అది మీ చూపులో లోపం. నా ప్రాబ్లం కాదు.మీరు చూసే చూపులో లోపం ఉంటే దుప్పటి కప్పుకుని కూర్చున్నా అశ్లీలంగా కనిపిస్తుంది.
నేనేం లిరిక్స్ మార్చి పాడలేదు. నా అంతరాత్మకి తెలుసు నేను తప్పుచేయలేదని. నిజంగా ఈ పాట తప్పు అంటే.. దేవుడే ఆ పాటని తీయించేస్తాడు. మగ గాయకులు ఆల్బమ్స్ రిలీజ్ చేసినప్పుడు ఎలాంటి వివాదాలు ఉండవు. కానీ అదే ఆడవాళ్లు రిలీజ్ చేసినప్పుడే ఇలాంటి వివాదాలు సృష్టిస్తారు' అంటూ శ్రావణ భార్గవి కౌంటర్ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment