పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) కు చెందిన ముగ్గురు ఎయిర్ హోస్టెస్‌ను బ్రిటన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఆ విషయాన్ని పాకిస్థాన్ ఉన్నతాధికారులు ధృవీకరించారు. బ్రిటన్ మహిళ ఇచ్చిన పిర్యాదు మేరకు ఆ ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వారు వివరించారు.
మాంచెస్టర్‌లోని ఓ హోటల్లో ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిని బ్రిటన్ పోలీసు అధికారులు విచారిస్తున్నారన్నారు. పాకిస్థాన్‌కు చెందని ముగ్గురు ఎయిర్‌హోస్టెస్‌లను ఎందుకు అరెస్ట్ చేసింది అనేదానిపై ఇంకా తమకు సమాచారం అందలేదన్నారు. ఆ అంశంపై బ్రిటన్‌తో చర్చిస్తున్నామని పాక్ అధికారులు తెలిపారు.