
మాంచెస్టర్ సిటీ యునైటెడ్ ఆటగాడు.. పోర్చుగల్ సాకర్ ప్లేయర్ జావో క్యాన్సెల్లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విషయంలోకి వెళితే.. జావో క్యాన్సెల్లో ఇంటికి నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి అతనిపై దాడికి పాల్పడ్డారు. ఇంట్లోని విలువైన వస్తువులు, నగలు దోచుకెళ్లారు. అడ్డువచ్చిన కుటుంబసభ్యులను ఇంట్లో బంధించి వెళ్లారు. ఈ దాడిలో జావో క్యాన్సెల్లో ముఖానికి గాయాలయ్యాయి. వీటన్నింటిని జావో తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకొచ్చాడు.
చదవండి: Cristiano Ronaldo: ఫుట్‌బాల్ స్టార్ రొనాల్డోకు భారత్‌లో అరుదైన గౌరవం
''నిజంగా ఈరోజు నా జీవితంలో అత్యంత దురదృష్టకరం. ఎవరో నలుగురు పిరికివాళ్ల మా ఇంటికి వచ్చి నాపై దౌర్జన్యం చేశారు. అడ్డువచ్చిన నా ఫ్యామిలీకి హాని కలిగించాలని చూశారు. నేను ప్రతిఘటించడంతో నా ముఖంపై భౌతిక దాడికి దిగారు. ఆ తర్వాత ఇంట్లో కనిపించిన వస్తువులు.. బంగారం ఎత్తుకెళ్లారు. ఇక్కడ అదృష్టం ఏంటంటే నా ఫ్యామిలీలో అందరూ బాగానే ఉన్నారు.. ఎవరికి ఏం కాలేదు.. అది సంతోషం. ఇలాంటివి నాకు కొత్తేం కాదు.. జీవితంలో ఇలాంటివి ఎన్నో ఎదుర్కొన్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ విషయం తెలుసుకున్న మాంచెస్టర్ సిటీ యునైటెడ్ క్లబ్ క్యాన్సెల్లోపై జరిగిన దాడిని ఖండించింది. క్యాన్సెల్లో దాడి మాకు షాక్‌తో పాటు దిగ్భ్రాంతి చెందాము. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నాం. కేసు నమోదు చేసి విచారణ చేయమని పోలీసులకు చెప్పినట్లు తెలిపింది. జావో క్యాన్సెల్లో 2019లో జువెంటస్ క్లబ్ నుంచి మాంచెస్టర్ సిటీ యునైటెడ్‌కు మారాడు.
చదవండి: 55 నిమిషాల పాటు నరకం అనుభవించా: స్టీవ్ స్మిత్
Comments
Please login to add a commentAdd a comment